Jump to content

KTR behind Samantha Nag Chaitanya divorce reason


Recommended Posts

Posted

Konda Surekha: ఆ కుటుంబం పెట్టిన పోస్టు చూసి చాలా బాధ‌ప‌డ్డా.. నా ఉద్దేశం అది కాదు: మంత్రి కొండా సురేఖ

03-10-2024 Thu 10:49 | Telangana
Konda Surekha Explanation on Comments about Akkineni Family

 

  • హనుమకొండలో మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం 
  • కేటీఆర్‌ వ్యాఖ్యల‌తో భావోద్వేగానికి గురైనట్లు వెల్ల‌డి
  • ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసే క్రమంలోనే అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించాన‌న్న మంత్రి
  • ఇప్ప‌టికే ఎక్స్ వేదిక‌గా స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు
  • అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే భావోద్వేగానికి గురైనట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆయనపై విమర్శలు చేసే క్రమంలోనే అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. ఇవాళ హనుమకొండలో మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం నిర్వహించి, మాట్లాడారు. తనకు ఎవరిమీద వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పిన మంత్రి.. ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడ్డాన‌ని అన్నారు. 

మంత్రి కొండా సురేఖ ఇంకా మాట్లాడుతూ... "తాను ఏ విష‌యంలోనైతే బాధ‌ప‌డ్డానో.. ఆ విష‌యంలో మ‌రొక‌రిని నొప్పించాన‌ని తెలిసి నా వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకున్నాను. నేను ప‌డ్డ బాధ మ‌రొక‌రు ప‌డ‌కూడ‌ద‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నాను. అప్పుడే దీనిపై స్పందిస్తూ ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా పోస్టు పెట్టాను. అయితే, కేటీఆర్ విషయంలో మాత్రం వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేదు. ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే. కానీ ఇప్పుడు రివ‌ర్స్‌లో న‌న్ను ఆయన క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోర‌డం విడ్డూరంగా ఉంది. ఆయ‌న వ్య‌వ‌హారం దొంగే.. దొంగా దొంగా అన్న‌ట్లుగా ఉంది. కేటీఆర్ లీగల్ నోటీసుపై న్యాయ‌ప‌రంగా ముందుకెళ్లం జ‌రుగుతుంది" అని మంత్రి సురేఖ‌ అన్నారు. 

ఇక మంత్రి సురేఖ ఇప్ప‌టికే సమంతకు ఎక్స్ వేదిక‌గా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే అంటూ మంత్రి తెలిపారు. కానీ, స‌మంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు ఆదర్శం కూడా అని పేర్కొన్నారు. త‌న‌ వ్యాఖ్యల పట్ల ఆమె కానీ, స‌మంత‌ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్ల‌యితే బేషరతుగా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. అన్యదా భావించవద్దని మంత్రి సురేఖ త‌న ఎక్స్ పోస్టులో వెల్లడించారు. 
Posted
41 minutes ago, psycopk said:

lol.. ee labour gadu kuda shocked anta.. comedy ga unde..

Ram Gopal Varma: నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ కామెంట్లు విని షాక్ అయ్యాను: రామ్ గోపాల్ వర్మ

03-10-2024 Thu 15:04 | Telangana
Ram Gopal Varma reaction on Konda Surekha comments

 

  • కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో నాగచైతన్య విడాకుల అంశం ప్రస్తావించిన కొండా సురేఖ
  • తీవ్రస్థాయిలో విమర్శలు 
  • నాగ్ కుటుంబాన్ని రోడ్డు మీదికి లాగడం భరించరాని విషయమన్న వర్మ 

నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆర్ ను ముడిపెడుతూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టించడం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండడానికి కేటీఆర్ పెట్టిన ఓ షరతు నాగచైతన్య-సమంతల విడాకులకు దారితీసిందన్నది కొండా సురేఖ వ్యాఖ్యల సారాంశం. దీనిపై సినీ ప్రముఖుల తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.

తాజాగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ అంశంపై తన బాణీ వినిపించారు. నాగార్జున కుటుంబాన్ని కొండా సురేఖ అత్యంత దారుణంగా అవమానపర్చిందని పేర్కొన్నారు. కొండా సురేఖ కామెంట్లు విని తాను షాక్ అయ్యానని వర్మ వెల్లడించారు. 

తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి అత్యంత గౌరవనీయ నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదికి లాగడం ఏమాత్రం భరించరాని విషయం అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్ చేశారు.

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...