ntr2ntr Posted October 23, 2024 Author Report Posted October 23, 2024 రెండు రోజుల క్రితం బెంగళూర్ వేధికగా సాగిన ఆస్తుల పంపకం ఒక కొలిక్కి వచ్చాయని అందరూ అనుకొంటున్న తరుణం లో జగన్ మడం తిప్పడం కాదు అసలు నాకు మడమే లేదు అన్నట్లు తల్లి విజయమ్మ,చెల్లె షర్మిల మీద కేసు వేయడం సంచలనం గా మారింది. బెంగళూర్ లో జరిగిన సమావేశం లో జగన్ సానుకూలం గానే స్పందించడానికి కారణం కేసులు మెడకు వేలాడటం తో తప్పని పరిస్థితిలో ఒప్పుకున్నట్లు అందరూ అనుకున్నారు.ఇక అన్న చెల్లెలు ఒకటై రాజకీయాలు చేస్తారని పలు మీడియా చానల్స్ ప్రచారం చేశాయి. కానీ భారతి ఎపిసోడ్ మొదలు కాగానే సస్పెన్స్ వీడి కథ క్లైమాక్స్ కు వచ్చింది. కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం అన్ని భారతి గా సాగే జగన్ స్టోరీ అంత త్వరగా ముగుస్తుంది అనుకోవడం పొరపాటే... అసలు వాళ్ళు పంచుకొంటున్న ఆస్తులు ఎవరివి...?ఆ ఆస్తులు ఎలా వచ్చాయి..? తల్లి పేరుతో ఉన్న షేర్లు తనవే తల్లికి చెందవని జగన్ కోర్టు కు వెళ్ళాడు. అసలు ఈ ఆస్తులు ఎక్కడివి అని కోర్టు అడిగితే సమాధానం ఎవరు చెపుతారు .. రాజశేఖర్ రెడ్డి చనిపోగానే దోపిడీ మీద కోర్టు కేసులు పడితే జగన్ ఆ కేసులు తన తండ్రివి కాబట్టి తండ్రి లేని కారణం గా కేసులు తనకు సంబంధం లేదని సుప్రీం కోర్టు కు వెళ్ళాడు తండ్రి దోచుకొన్న సంపద తాను అనుభవిస్తాడు,కానీ కేసులు తనకు సంబందం లేదని చెప్పడం న్యాయమూర్తులు తల ఆడించడం విడ్డూరం. జగన్ అనుభవిస్తున్న వందల కంపెనీలు ఎక్కడివి అన్న ప్రశ్నకు భూమండలం లో ఎవ్వడు సమాధానం చెప్పలేడు ... రాజశేఖర్ రెడ్డి కి డబ్బు లేక ఉన్న ప్రభుత్వ భూమిలో ఇల్లు అమ్ముకోవడానికి టీడీపీ నీ బ్రతిమాలుకొన్న కుటుంభం లక్షల కోట్లు ఎలా సంపాదించింది? న్యాయమూర్తులకు తెలియాలి... 16 ED కేసులు,42 వేలకోట్ల ఆస్తుల అటాచ్మెంట్ జరిగినా 10 ఏళ్ళ నుండి కోర్టు కు వెళ్లన్ని అర్ధిక ఉగ్రవాది కి శిక్షించే దమ్ము ఉన్న న్యాయమూర్తి లేకపోవడం ఈ దేశం దౌర్భాగ్యం... ఒక ఎంపీ గా ఉన్న వివేకానంద రెడ్డీ గారిని దారుణం గా ఇంట్లో నరికేస్తే అన్ని సాక్షాలు ఉన్నా దోషిని శిక్షించ లేకపోయినా మన చట్టాలు,న్యాయమూర్తులను చూసి ప్రపంచం జాలి చూపిస్తుంది . తండ్రి బ్రతికి ఉండగా లక్ష కోట్లు దోచిన జగన్ తన పాలనలో పంచ భూతాలను దోచి న్యాయస్థానాలకు సవాలు విసిరాడు... జగన్ దోపిడీ,అరాచకల వెనుక కర్త కర్మ అన్ని భారతి అని అందరికీ తెలుసు.జగన్ జైల్లో ఉంటే 3 వేల కి.మీ .పైగా పాదయాత్రలు చేసిన చెల్లి,తల్లి కి అధికారం వచ్చాక ఒక్క పదవి కూడా ఇవ్వని జగన్,తల్లి గౌరవ అధ్యక్ష పదవి కూడా లాగేసుకుని,ఆస్తి అడిగినందుకు చెల్లి తలను గోడకు కొట్టిన సైకో జగన్ రెడ్డి లాంటి మనిషి ఈభూమి మీద ఉంటాడా...? ఆస్తి పంపకం వాళ్ళ కుటుంబ సమస్య అనుకొంటే పొరపాటే...వాళ్ళు ఆస్తుల పంపకం వ్యక్తిగతమైనది కాదు... ఆ ఆస్తి ప్రజలది...తెలుగు ప్రజల ఆస్తి. ఆస్తుల కోసం ప్రాణాలు తీసే జగన్ నైజాం తెలిసిన న్యాయస్థానాలు అతనిని వదిలేసి చ్యోద్యం చూడటం విచిత్రం. పరిటాల హత్య తరువాత జరిగిన హత్యలను ఇప్పటికీ నిర్ధారణ చేయలేదు. వివేకానంద రెడ్డి హత్య తరువాత జరిగిన హత్యలకు కారణం తెలిసినా మాట్లాడలేని న్యాయమూర్తులు.ఇప్పుడు ఆస్తుల తగాదా తో భారతి వేసే మాస్టర్ ప్లాన్ తో ఎన్ని ప్రాణాలు పోవాలి.. ? ఇప్పుడు న్యాయం చెప్పాల్సింది న్యాయస్థానాలు కాదు... ప్రజలు. ప్రజల ఆస్తి ప్రజలకే దక్కాలి అంటే రాక్షస కుటుంబాన్ని పొలిమేరలు దాటించాలి. ఆస్తులు ప్రజలు స్వాదీనం చేసుకొని గుణపాఠం చెప్పాలి Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.