ntr2ntr Posted October 25, 2024 Report Posted October 25, 2024 అవును నేడు హ్యాపీ కోడికత్తి డే! ఆరేళ్ళ క్రితం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో ఆయనపై దళిత యువకుడు శ్రీను కోడికత్తితో దాడి చేశాడు. అప్పటి నుంచే కోడికత్తి చాలా పాపులర్ అయ్యింది. తల్లినీ చెల్లినీ కూడా మోసం చేశావుగా జగనన్నా! అయితే ఆ క్రెడిట్ దానిని వాడిన శ్రీనుకి దక్కుతుందా లేదా ఆ పేరుతో ఎన్నికలలో సానుభూతి పొందేందుకు డ్రామా ఆడిన జగన్‌కు దక్కుతుందా లేదా జగన్-కోడికత్తి అంటూ టాంటాం… చేసిన టిడిపికి దక్కుతుందా లేదా ఆ సానుభూతితో జగన్‌కి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు దక్కుతుందా? అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవలసిందే. కానీ జయంతులు, వర్దంతులు మరిచిపోకుండా జరుపుకొంటున్నట్లు ఆరేళ్ళయినా కోడికత్తిని మరిచిపోకుండా ట్విట్టర్‌లో ‘హ్యాపీ కోడికత్తి డే’ అని టిడిపి (జగన్‌కి) శుభాకాంక్షలు తెలిపింది. నారా లోకేష్ ఐటి కంపెనీలు రప్పించగలిగితే…. తల్లినీ, చెల్లిని కోర్టుకి ఈడ్చడం కాదు, కోర్టుకి వచ్చి కోడికత్తి కేసులో వాంగ్మూలం ఇచ్చి దళిత యువకుడి జీవితం నిలబెడితే బాగుంటుంది,” అని అడగకుండానే ఓ ఉచిత సలహా కూడా ఇచ్చింది. తండ్రి హంతకులను కూడా క్షమించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అంతటి ఉదారమైన హృదయం అందరికీ ఉండదు. తల్లికీ, చెల్లికీ ఆస్తిలో వాటా ఇవ్వడానికి ఇష్టపడక వారికి నోటీసులు పంపిన జగన్‌కి కోడికత్తితో తనకి భుజంపై చిన్న ఘాటు పెట్టిన శ్రీను, దళిత యువకుడే అయినప్పటికీ క్షమిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. జగన్‌కి ఇటువంటి ఆలోచనలు ఎందుకు రావో? క్షమించాలనుకుంటే శ్రీనుని 5 ఏళ్ళు జైలులో పెట్టించేవారే కారు. కుంటి సాకులతో కోర్టుకి రాకుండా తప్పించుకు తిరిగేవారే కారు. ఈ లెక్కన ఎన్నికల సమయంలో జగన్‌ని గులక రాయితో హత్య చేయాలని ప్రయత్నించిన వ్యక్తి చాలా అదృష్టవంతుడే అని చెప్పొచ్చు. ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయ్యుంటే అతను కూడా శ్రీనుతో పాటు 5 ఏళ్ళపాటు జైలులో మగ్గేవాడే. గిట్టనివారు దీనిని శాడిజం అని అనుకోవచ్చు. కానీ కోడికత్తి, గులక రాయితో ఏదో సాధిద్దామనుకుంటే, ఆ కేసులని టిడిపి ఇంతగా హైలైట్ చేయడమే శాడిజం అని వైసీపి ప్రకటించింది. Quote
ntr2ntr Posted October 25, 2024 Author Report Posted October 25, 2024 Paytms ki festival day ee roju cake cut chesara. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.