Jump to content

Gharshana Veru Kottukovadam Veru..Nenu naa koduku kottukoledhu..gharshana paddam..anthe - M0h@n Bob

Recommended Posts

Posted

Mogan bob ki matisthimitam sarigga ledani doctors certificate icharata kada...mogun bob safe

Posted

Manchu Vishnu: మ‌మ్మ‌ల్ని అతిగా ప్రేమించ‌డ‌మే మా నాన్న చేసిన త‌ప్పు: మంచు విష్ణు 

11-12-2024 Wed 13:10 | Both States
 
Manchu Vishnu Press Meet on Family Conflict

  • నిన్న రాత్రి మ‌రింత ముదిరిన మంచు ఫ్యామిలీ వివాదం
  • ఈ నేప‌థ్యంలో మంచు విష్ణు మీడియా స‌మావేశం
  • ప్ర‌తి ఇంట్లో ఇలాంటి స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని వ్యాఖ్య‌
  • ఓ తండ్రిగా మ‌నోజ్‌పై మోహ‌న్ బాబు త‌క్కువ‌గానే రియాక్ట్ అయ్యార‌న్న విష్ణు
  • పోలీసు వ్య‌వ‌స్థ‌పై గౌర‌వం ఉంది కాబట్టి సీపీని క‌లుస్తాన‌ని వెల్ల‌డి
  • తల్లి ఫోన్ చేసి ఏడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమీ ఉండద‌న్న విష్ణు
మంచు ఫ్యామిలీ వివాదం మంగ‌ళ‌వారం రాత్రి మ‌రింత ముదిరిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంచు విష్ణు తాజాగా మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

ఈ ప్రెస్‌మీట్‌లో మంచు విష్ణు మాట్లాడుతూ... "ప్ర‌తి ఇంట్లో ఇలాంటి స‌మ‌స్య‌లు ఉంటాయి కాబట్టి, ఈ విష‌యాన్ని పెద్ద‌దిగా చేయ‌డం త‌గ‌దు. ఇది నా రిక్వెస్ట్. నిన్న జ‌రిగిన దాడిలో నాన్న‌కు గాయాల‌య్యాయి. కుటుంబ గొడ‌వ‌ల కార‌ణంగా మా అమ్మ ఆసుప‌త్రి పాలైంది. గేట్లు ప‌గ‌ల‌గొట్టుకుని మ‌రీ మ‌నోజ్ లోప‌లికి వ‌చ్చాడు. ఓ తండ్రిగా మ‌నోజ్‌పై నాన్న త‌క్కువ‌గానే రియాక్ట్ అయ్యారు. 

మ‌మ్మ‌ల్ని అతిగా ప్రేమించ‌డ‌మే మా నాన్న చేసిన త‌ప్పు. మేము క‌లిసి మెలిసి ఉంటాం అనుకున్నా. కానీ, దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఇలా జ‌రిగింది. మేము మ‌ళ్లీ తిరిగి క‌లుస్తామ‌ని ఆశిస్తున్నా. నిన్న జ‌రిగిన గొడ‌వ‌లో ఒక రిపోర్ట‌ర్‌కు గాయాల‌య్యాయి. అది దుర‌దృష్ట‌క‌రం. మీడియా వారికి ఆయ‌న‌ నమస్కరిస్తూ వచ్చారు. కానీ, అలా జరిగిపోయింది. గాయ‌ప‌డిన రిపోర్ట‌ర్ ఫ్యామిలీ తో టచ్ లో ఉన్నాము. ఉద్దేశ‌పూర్వ‌కంగా మేము ఎవ‌రిపై దాడి చేయ‌లేదు. 

మా కంటే ముందు మీడియాకు పోలీసుల నోటీసులు లీక్ అవుతున్నాయి. ఇవాళ ఉద‌యం 9.30 గంట‌ల‌కు నాకు పోలీసుల నోటీసులు వ‌చ్చాయి. పోలీసు విచార‌ణ‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం నాకు లేదు. మాకు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు? కానీ, వ్య‌వ‌స్థ‌పై గౌర‌వం ఉంది కాబట్టి సీపీని క‌లుస్తాను. 

ప్రేమలో గెలవాల్సిన విషయాలపై రచ్చ పెట్టుకుంటే ఏది జరగదు. మనోజ్ ఆరోపణలపై నేను చెప్పేది ఏమీ లేదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుద్ది. నేను నా కుటుంబ విషయాలు మాట్లాడను. నేను ఇక్కడ ఉంటే, ఫిర్యాదుల వరకు వెళ్లేది కాదు. నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం. ఎంతో కష్టపడి స్వయంకృషితో గొప్ప స్దాయికి ఎదిగారు. మాకు లభించే గౌరవం ఆయనవల్లే. కుటుంబం పరంగా నాన్న ఏది అనుకుంటే అదే ఉండాలి. తల్లిదండ్రుల‌ను గౌర‌వించ‌డం పిల్ల‌లుగా మా బాధ్య‌త‌. 

మీడియాలో కొంతమందే హద్దు మీరుతున్నారు. అందరూ కాదు. పబ్లిక్ ఫిగర్స్ పై రిపోర్ట్ చేయటం మీడియా బాధ్యత‌. కానీ సోసైటీలో కొందరు ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వినయ్ నాకు అన్న లాంటి వారు. ఆయన ఎవరిపైనా చేయి చేసుకోలేదు. వినయ్ కు, నాకు 15 ఏళ్ల పరిచయం ఉంది. ఇండియాలోనే గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి.

తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీకి మంచి పేరు ఉంది. ఇండియాకు ఫారిన్ యూనివర్సిటీలను తీసుకువచ్చే ఘనత మాదే అవుతుంది. ఇప్ప‌టికే ఆ వైపుగా చ‌ర్చ‌లు జరుగుతున్నాయి. మోహన్ బాబు గారిని నమ్మి అక్కడ తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు. అది మాకు దేవాలయం. యూనివ‌ర్సిటీ జోలికి వ‌స్తే ఊరుకునేది లేదు. ఇక మా అక్కకు,  నాకు భేదాభిప్రాయాలు ఉన్నా.. ఆమె కొట్టినా తిట్టినా నేను పడతాను. ఎందుకంటే తను నా అక్క. 

మా కుటుంబంలో బయటి వ్యక్తుల ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉంటే వారికి ఈ సాయంత్రం వ‌ర‌కు సమయం ఇస్తున్నాము. లేదంటే అందరి పేర్లు నేనే బయడపెడతాను. మా నాన్న చెప్పిందే వేద వాక్కు. ఆయన చెప్పింది నేను చేస్తాను. కానీ నా తమ్ముడిపై నేనిప్పుడు దాడులు చేయను. నా సినిమా, మా అసోసియేషన్ గురించి తప్ప నేను ఏ విషయంలో మాట్లాడను‌. కానీ నాకు అవకాశం ఉంటే ఫిర్యాదులు, వాయిస్ మెసెజ్ కూడా బయటికి వచ్చేది కాదు. సమయమే అన్ని స‌మ‌స్య‌ల‌కు సమాధానం ఇస్తుంది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను. మీ తల్లి మీకు ఫోన్ చేసి ఏడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమైనా ఉంటుందా?" అని మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు.   
Posted

Manchu Manoj: నా కోసం వచ్చిన జ‌ర్న‌లిస్టుల‌కు ఇలా జ‌ర‌గ‌డం బాధాక‌రం.. సారీ: క‌న్నీరు పెట్టుకున్న‌ మంచు మ‌నోజ్ 

11-12-2024 Wed 11:52 | Both States
 
Manchu Manoj Emotional At Press Meet

  • కుటుంబంలో జ‌ర‌గుతున్న వివాదం నేప‌థ్యంలో మంచు మ‌నోజ్ తీవ్ర భావోద్వేగం
  • ఇలాంటి రోజు వ‌స్తుంద‌నుకోలేదంటూ ఎమోష‌న‌ల్‌
  • జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఎప్పుడూ తోడు ఉంటాన‌న్న‌ మ‌నోజ్
  • త‌న తండ్రి మోహ‌న్ బాబు, అన్న విష్ణు త‌ర‌ఫున జ‌ర్న‌లిస్టుల‌కు క్ష‌మాప‌ణలు
  • మా నాన్న దేవుడు.. కానీ ఈరోజు చూస్తున్న‌ది ఆయ‌న‌ను కాద‌ని వ్యాఖ్య‌ 
త‌న కుటుంబంలో జ‌రు‌గుతున్న వివాదం నేప‌థ్యంలో హీరో మంచు మ‌నోజ్ తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా త‌న తండ్రి మోహ‌న్ బాబు, అన్న విష్ణు త‌ర‌ఫున జ‌ర్న‌లిస్టుల‌కు క్ష‌మాప‌ణ చెప్పారు. ఇలాంటి రోజు వ‌స్తుంద‌నుకోలేద‌ని, త‌న కోసం వ‌చ్చిన జ‌ర్న‌లిస్టుల‌కు ఇలా జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఎప్పుడూ తోడు ఉంటాన‌ని మ‌నోజ్ అన్నారు. 

"ఆస్తి కోసం నాన్న‌తో గొడ‌వ ప‌డుతున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం నిజం కాదు. నా కుటుంబ స‌భ్యుల‌ను ఏమీ అడ‌గ‌లేదు. ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధార‌ప‌డలేదు. నా భార్య వాళ్లింట్లోనూ ఏమీ అడిగింది లేదు. సొంతంగా వ్యాపారం చేసుకుని సంపాదించుకుంటున్నాను. సొంత‌కాళ్ల‌పై బ‌తుకుతున్నాను. ఈ వివాదంలోకి నా భార్య, ఏడు నెల‌ల కూతురును కూడా లాగుతున్నారు" అంటూ మ‌నోజ్ క‌న్నీరు పెట్టుకున్నారు.  

"మా నాన్న దేవుడు. కానీ, ఈరోజు చూస్తున్న‌ది మా నాన్నను కాదు. వేరేవాళ్లు ఆయ‌న‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. నేను ఎవ‌రిపై దాడి చేశానో సీసీటీవీ ఫుటేజీ చూపించండి. నేను ఇవాళ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాను. మిగ‌తా విష‌యాలు పోలీసుల విచార‌ణ త‌ర్వాత వెల్ల‌డిస్తా" అని మ‌నోజ్ చెప్పుకొచ్చారు.   

Posted

Mohan Babu: తెలంగాణ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట 

11-12-2024 Wed 16:31 | Both States
 
Small relief to Mohan Babu in High Court

  • విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుకు పోలీసుల నోటీసులు
  • స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు
  • 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చిన హైకోర్టు
  • 2 గంటలకోసారి మోహన్ బాబు ఇంటి వద్ద చూసి రావాలని పోలీసులకు ఆదేశం
సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాచకొండ పోలీసులు తనకు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. అలాగే, పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా... మోహన్ బాబుపై నమోదైన కేసులను ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించారు. పరస్పర ఫిర్యాదులతో కేసులు నమోదైనట్లు తెలిపారు. నిన్న సాయంత్రం జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్ బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదైందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో పోలీసుల నోటీసులు అందుకున్న మంచు మనోజ్ ఈ రోజు విచారణకు హాజరయ్యారని కోర్టుకు తెలిపారు.

మోహన్ బాబు ఇంటి వద్ద గస్తీ ఏర్పాటు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

అయితే నిత్యం గస్తీ ఏర్పాటు చేయడం కుదరదని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. అయితే రెండు గంటలకు ఓసారి పోలీసులు అక్కడి పరిస్థితులను గమనించి వస్తారన్నారు.

దీంతో, రెండు గంటలకోసారి పోలీసులు మోహన్ బాబు ఇంటి వద్దకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు పరిస్థితిని పర్యవేక్షించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. 
Posted

Dongatananiki taskarinchadaniki entha difference undo, Kottukovadaniki Garshana ki anthe difference undhi.

Telugu prajalaki telugu nerputunnaru, super 

  • Haha 1
Posted

Vaadu cheppindhi nenu vaadini chinnapilladila kotaledu memu iddaram hora hori ga kottukunam ani .

Posted
4 hours ago, psycopk said:

Mohan Babu: తెలంగాణ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట 

11-12-2024 Wed 16:31 | Both States
 
Small relief to Mohan Babu in High Court

  • విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుకు పోలీసుల నోటీసులు
  • స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు
  • 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చిన హైకోర్టు
  • 2 గంటలకోసారి మోహన్ బాబు ఇంటి వద్ద చూసి రావాలని పోలీసులకు ఆదేశం
సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాచకొండ పోలీసులు తనకు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. అలాగే, పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా... మోహన్ బాబుపై నమోదైన కేసులను ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించారు. పరస్పర ఫిర్యాదులతో కేసులు నమోదైనట్లు తెలిపారు. నిన్న సాయంత్రం జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్ బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదైందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో పోలీసుల నోటీసులు అందుకున్న మంచు మనోజ్ ఈ రోజు విచారణకు హాజరయ్యారని కోర్టుకు తెలిపారు.

మోహన్ బాబు ఇంటి వద్ద గస్తీ ఏర్పాటు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

అయితే నిత్యం గస్తీ ఏర్పాటు చేయడం కుదరదని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. అయితే రెండు గంటలకు ఓసారి పోలీసులు అక్కడి పరిస్థితులను గమనించి వస్తారన్నారు.

దీంతో, రెండు గంటలకోసారి పోలీసులు మోహన్ బాబు ఇంటి వద్దకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు పరిస్థితిని పర్యవేక్షించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. 

Sr ntr tarwatha aa level lo paruv poyindhi idhe ga

Madya lo chiranjeevi meedha divert ayyaru kadha ayya 

Posted

Garshana - Celebrity Level

Kottukodam - Legendary Level

Hence Legendary Award goes to Mohanbabu 😂😂

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...