Jump to content

Mohan bob vishayam lo ayyo ane vari kante, baaga ayyindhi anukunna vaare ekkuva la unnaru


Recommended Posts

Posted
7 minutes ago, nuvvu_naakina_paalem said:

Is it true bhavani?

Yes. Vademaina manchi person aithe sare. Rangampet lo chala lands swadinam chesukunnaru

Posted
1 hour ago, nuvvu_naakina_paalem said:

Is it true bhavani?

Jealous, Rude (tries to cover with straight forward nature), criminal, land grabber, Echulu and sonta dabba, manhandle artists, no end to his atrocities. Not many people care about this family. 

Karma is a bitch. It comes back. 

  • Upvote 1
Posted
1 hour ago, Konebhar6 said:

Jealous, Rude (tries to cover with straight forward nature), criminal, land grabber, Echulu and sonta dabba, manhandle artists, no end to his atrocities. Not many people care about this family. 

Karma is a bitch. It comes back. 

Over to @Rendu

Posted
4 hours ago, sarfaroshi2 said:

 

Mari manchu brothers phones kuda tap cheyatam enti vayya… tappu kada…

 

Mohan Babu: జర్నలిస్ట్‌ను కొట్టింది నిజమే... అందుకు చింతిస్తున్నాను కానీ: మోహన్ బాబు మరో ఆడియో విడుదల 

12-12-2024 Thu 18:48 | Both States
 
Mohan Babu released second video on attack on Journalist

 

  • జర్నలిస్టును కొట్టాలనుకోలేదన్న మోహన్ బాబు
  • మీ ఇంట్లో ఎవరైనా దూరితే అంగీకరిస్తారా? అని ప్రశ్న
  • మీడియా ప్రతినిధి తనకు తమ్ముడి లాంటివాడన్న మోహన్ బాబు
  • కొట్టడం తప్పైనప్పటికీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలని విజ్ఞప్తి
  • పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న మోహన్ బాబు
నేను మీడియా ప్రతినిధిని కొట్టిన మాట నిజమే... కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలని, అయినప్పటికీ అలా కొట్టినందుకు చింతిస్తున్నానని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఆసుపత్రి నుంచి విడుదలయ్యాక వెల్లడించారు. ఈ మేరకు 11 నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేశారు.

జర్నలిస్టును కొట్టాలనుకోలేదు... చింతిస్తున్నా

జర్నలిస్ట్‌ను కొట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ప్రశ్నించారు. ప్రజలు, రాజకీయ నాయకులు దీనిపై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తన ఇంట్లోకి దూసుకొచ్చేవారు జర్నలిస్టులా? కాదా? తనకు తెలియదని వ్యాఖ్యానించారు. మీడియాను అడ్డు పెట్టుకొని తనపై దాడి జరగవచ్చని భావించానన్నారు. జరిగిన ఘటనకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నట్లు తెలిపారు. తాను కొట్టడం తప్పే కావొచ్చు... కానీ ఏ సందర్భంలో అలా చేశానో ప్రతి ఒక్కరూ  ఆలోచించాలన్నారు. 

మీ ఇంట్లో ఎవరైనా దూరితే... మీ ఏకాగ్రతను భగ్నం చేస్తే అంగీకరిస్తారా?... న్యాయాధిపతులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, వ్యాపారస్తులు, మీడియా ప్రతినిధులు దీనిపై ఆలోచించాలన్నారు. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలిందన్నారు. అందుకు బాధపడుతున్నానని... ఆ మీడియా ప్రతినిధి తనకు తమ్ముడి లాంటి వాడన్నారు. మీడియా ప్రతినిధి భార్యాబిడ్డల గురించి తాను ఆలోచించానని... కానీ తన గురించి ఎవరూ ఆలోచించలేదన్నారు. తాను సినిమాల్లో నటిస్తానని... నిజజీవితంలో మాత్రం నటించాల్సిన అవసరం లేదన్నారు.

మీకు టీవీలు ఉన్నాయి... మాకు టీవీలు (చానళ్లు) లేవు... రేపు నేను కూడా టీవీని పెట్టవచ్చు... అది కాదు గొప్ప... కానీ మీడియా ప్రతినిధి మనసును గాయపర్చినందుకు చింతిస్తున్నానన్నారు. మనసును గాయపెట్టాక చింతించి లాభం ఏమిటని ఎవరైనా అడిగితే ఇక నేనేం చేయను... మీరు చేసిందేమిటని ప్రశ్నించారు. మళ్లీ మళ్లీ చెబుతున్నాను... అసలు అతను నిజంగా జర్నలిస్టా? కాదా? అని నాకు ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. కొట్టడం తప్పైనప్పటికీ ఏ సందర్భంలో కొట్టానో చూడాలన్నారు. కానీ మీరు ఈ విషయాలు చెప్పడం లేదన్నారు. పైన భగవంతుడు చూస్తున్నాడని వ్యాఖ్యానించారు.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు

పోలీసులు అంటే తనకు ఇష్టమని, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. తన విశ్వవిద్యాలయం నుంచి ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారన్నారు. వారికి తన విద్యాసంస్థల నుంచి న్యాయం, ధర్మం నేర్పించానన్నారు. తన విద్యాసంస్థల నుంచి వెళ్ళి ఉద్యోగం చేస్తున్న వారు న్యాయంగా ఉన్నారని, కానీ ఇక్కడ మాత్రం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేను చేసింది న్యాయమా? అన్యాయమా? ప్రజలే ఆలోచించాలన్నారు. నా ఇంటికి తలుపులు బద్దలు కొట్టి రావడం న్యాయమా? అని అడిగారు.

తనకు ఉన్న ధైర్యం ఒకటేనని... నీతిగా, ధర్మంగా బతకాలన్నదే తన ఆలోచన అన్నారు. గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి, దాడి చేస్తే తనపై 50 కేసులు పెట్టుకోవచ్చని... అవసరమైతే అరెస్ట్ కూడా చేయవచ్చన్నారు. తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయేవాడినన్నారు. కానీ నా ఇంట్లోకి వచ్చి నా ఏకాగ్రతను చెడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

నా బిడ్డే నా ప్రశాంతతను చెడగొడుతున్నాడు

తన బిడ్డే తన ప్రశాంతతను చెడగొడుతున్నాడని ఆరోపించారు. నా బిడ్డతో ఏదో ఒకరోజు సఖ్యత కుదురుతుందని, కుటుంబ సభ్యులం కూర్చొని మాట్లాడుకుంటామన్నారు. కుటుంబ సభ్యుల గొడవలకు మధ్యవర్తులు అవసరం లేదని స్పష్టం చేశారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని... కానీ అన్నీ మరిచిపోయి తాను కొట్టిన విషయమే మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కొట్టింది వాస్తవమేనని... అసత్యమేమీ కాదన్నారు.
Posted

Mohan Babu: మీడియా ప్ర‌తినిధిపై దాడి ఘ‌ట‌న‌.. లిఖిత‌పూర్వ‌కంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మోహ‌న్ బాబు 

13-12-2024 Fri 09:44 | Both States
 
Mohan Babu Say Sorry to Media

 

  • టీ9 యాజ‌మాన్యానికి ప్ర‌త్యేకంగా ఒక లేఖ రాసిన మోహ‌న్ బాబు
  • త‌న కుటుంబ గొడ‌వ పెద్ద‌దిగా మార‌డంతో ఆవేశంలో ఆ ఘ‌ట‌న జ‌రిగింద‌న్న న‌టుడు
  • ఆ రోజు జ‌రిగిన ఘ‌ట‌న‌లో జ‌ర్న‌లిస్టు గాయ‌ప‌డ‌టం చాలా బాధించింద‌ని వ్యాఖ్య‌
  • టీవీ9 టీంకి, జర్నలిస్ట్‌ రంజిత్‌ కుటుంబానికి మ‌న‌స్ఫూర్తిగా క్షమాపణలు
మీడియా ప్ర‌తినిధిపై దాడి ఘ‌ట‌న‌లో న‌టుడు మోహ‌న్ బాబు టీ9కి లిఖిత‌పూర్వ‌కంగా క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీ9 యాజ‌మాన్యానికి ప్ర‌త్యేకంగా ఒక లేఖ రాశారు. త‌న కుటుంబ ఘ‌ట‌న పెద్ద‌దిగా మారి టీవీ9ను, జ‌ర్న‌లిస్టుల‌ను ఆవేద‌న‌కు గురిచేసినందుకు చింతిస్తున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఘ‌ట‌న అనంత‌రం 48 గంట‌ల పాటు ఆసుప‌త్రిపాలు కావ‌డంతో వెంట‌నే స్పందించ‌లేక‌పోయాన‌ని తెలిపారు. ఆ క్షణంలో గేటు విరగ్గొట్టి 30 మంది లోపలికి ఉరుక్కుంటూ వస్తుంటే సంఘ వ్యతిరేక శక్తులు వస్తున్నారేమో అని నేను ఆందోళనతో ఆ పని చేశాన‌ని పేర్కొన్నారు. ఆ రోజు ఆవేశంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లో జ‌ర్న‌లిస్టు గాయ‌ప‌డ‌టం చాలా బాధించింద‌న్నారు. 

తన వల్ల జరిగిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నానని, టీవీ9 టీంకి, జర్నలిస్ట్‌ మిత్రుడు రంజిత్‌ కుటుంబానికి మ‌న‌స్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. 'మీకు, మీ కుటుంబానికి కలిగిన మనోవేదనకు చింతిస్తున్నా'న‌ని మోహ‌న్ బాబులు త‌న లేఖ‌లో తెలిపారు.   

కాగా, ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే మోహ‌న్ బాబుపై 118(1) బీఎన్ఎస్ సెక్ష‌న్ కింద కేసు న‌మోద‌యిన విష‌యం తెలిసిందే. అలాగే లీగ‌ల్ ఒపీనియ‌న్ తీసుకున్న ప‌హాడీ ష‌రీఫ్ పోలీసులు.. గురువారం ఆయ‌న‌పై 109 సెక్ష‌న్ కింద హ‌త్యాయ‌త్నం కేసు కూడా న‌మోదు చేశారు. 
20241213fr675baf03d647d.jpg
Posted

 

Mohan Babu: సినీ న‌టుడు మోహ‌న్ బాబుపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు! 

12-12-2024 Thu 09:50 | Both States
 
Attempted Murder Case Registered Against Mohan Babu

 

  • మీడియా ప్ర‌తినిధుల‌పై దాడి ఘ‌ట‌న‌
  • మోహ‌న్ బాబుపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసిన ప‌హాడీ ష‌రీఫ్ పోలీసులు
  • ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే ఆయ‌న‌పై 118(1) బీఎన్ఎస్ సెక్ష‌న్ కింద కేసు
  • లీగ‌ల్ ఒపీనియ‌న్ త‌ర్వాత‌ 109 సెక్ష‌న్ కింద హ‌త్యాయ‌త్నం కేసు
మీడియా ప్ర‌తినిధుల‌పై దాడి నేప‌థ్యంలో సినీ న‌టుడు మంచు మోహ‌న్ బాబుపై ప‌హాడీ ష‌రీఫ్ పోలీసులు తాజాగా హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే ఆయ‌న‌పై 118(1) బీఎన్ఎస్ సెక్ష‌న్ కింద కేసు న‌మోద‌యిన విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా లీగ‌ల్ ఒపీనియ‌న్ తీసుకున్న పోలీసులు.. 109 సెక్ష‌న్ కింద హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేశారు. 

ఇక మంచు ఫ్యామిలీ వివాదం నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం రాత్రి మీడియా ప్ర‌తినిధులు జ‌ల్‌ప‌ల్లిలోని మోహ‌న్ బాబు ఇంటికి వెళ్లారు. ఈ క్ర‌మంలో మంచు మ‌నోజ్ ఇంటి గేట్ల‌ను త‌న్నుకుంటూ లోప‌లికి వెళ్ల‌డంతో మీడియా ప్ర‌తినిధులు కూడా నివాసం లోప‌లికి వెళ్ల‌డం జ‌రిగింది. అదే స‌మ‌యంలో ఇంట్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మోహ‌న్ బాబు ఓ మీడియా ప్ర‌తినిధి చేతిలో నుంచి మైకు లాక్కుని ముఖంపై దాడి చేశారు. 

దాంతో మీడియా ప్ర‌తినిధి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అంత‌కుముందు కూడా బౌన్స‌ర్లు మీడియా ప్ర‌తినిధుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించడంతో ప‌లువురికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఇలా మీడియా ప్ర‌తినిధులపై దాడి నేప‌థ్యంలోనే కేసు న‌మోదైంది.  

 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...