Jump to content

Recommended Posts

Posted

NTR- విజయవాడలో నేడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం 

14-12-2024 Sat 08:49 | Entertainment
380-3.jpg
NTR Diamond Jubilee In Vijayawada

 

  • పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో నిర్వహణ
  • ఎన్టీఆర్ తొలి సినిమా మనదేశం విడుదలై 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో వేడుకలు
  • హాజరుకానున్న సినీ, రాజకీయ రంగ ప్రముఖులు
మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నేడు విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దిగ్గజ డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 1949లో వచ్చిన మనదేశం సినిమాతో ఎన్టీఆర్ నటుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం విడుదలై 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.

సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్టీఆర్ కుమారులు నందమూరి మోహనకృష్ణ, జయకృష్ణతోపాటు సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొంటారని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ‘తారకరామం.. అన్నగారి అంతరంగం’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా లైవ్‌లింక్‌ అందుబాటులో ఉంటుందని జనార్దన్ తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలు, సినీరంగంలో ఎన్టీఆర్ ఒక ధ్రువతార అని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ జీవితచరిత్రను భావితరాలకు పాఠ్యాంశంగా పొందుపరచనున్నట్టు జనార్దన్ తెలిపారు.
  • Like 1
Posted
26 minutes ago, psycopk said:

 

NTR- విజయవాడలో నేడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం 

14-12-2024 Sat 08:49 | Entertainment
380-3.jpg
NTR Diamond Jubilee In Vijayawada

 

  • పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో నిర్వహణ
  • ఎన్టీఆర్ తొలి సినిమా మనదేశం విడుదలై 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో వేడుకలు
  • హాజరుకానున్న సినీ, రాజకీయ రంగ ప్రముఖులు
మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నేడు విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దిగ్గజ డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 1949లో వచ్చిన మనదేశం సినిమాతో ఎన్టీఆర్ నటుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం విడుదలై 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.

సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్టీఆర్ కుమారులు నందమూరి మోహనకృష్ణ, జయకృష్ణతోపాటు సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొంటారని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ‘తారకరామం.. అన్నగారి అంతరంగం’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా లైవ్‌లింక్‌ అందుబాటులో ఉంటుందని జనార్దన్ తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలు, సినీరంగంలో ఎన్టీఆర్ ఒక ధ్రువతార అని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ జీవితచరిత్రను భావితరాలకు పాఠ్యాంశంగా పొందుపరచనున్నట్టు జనార్దన్ తెలిపారు.

nede rambotsavam la undhi ee thread

Posted

NTR Diamond Jubilee celebrations: ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలో సినీ పాత్రికేయులకు విశిష్ట సత్కారం 

14-12-2024 Sat 21:43 | Andhra
380-3.jpg
Chandrababu conferes senior cine journalists in NTR Diamond Jubilee celebrations

 

  • ఎన్టీఆర్ సినీ జీవితానికి 75 ఏళ్లు
  • పోరంకిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుక
  • ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
  • సీనియర్ సినీ జర్నలిస్టులకు మెమెంటోల బహూకరణ
కృష్ణా జిల్లా పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమంలో సీనియర్ సినీ పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. ఎన్టీఆర్ డైమండ్ జూబ్లీ పేరిట ప్రత్యేకంగా తయారుచేయించిన జ్ఞాపికలను ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ సినీ జర్నలిస్టులకు బహూకరించారు. మోహన్ గోటేటి, బీకే ఈశ్వర్, కె.ఉడయవర్లు, కె.ఉమామహేశ్వరరావు, గౌస్, శాతవాహన, యు.వినాయకరావు, రెంటాల జయదేవ, అనురాధ, రమణమూర్తి తదితర పాత్రికేయులు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మెమెంటోలు అందుకున్నారు. 

కాగా, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీఎం చంద్రబాబు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ స్పెషల్ క్యాలెండర్ ను కూడా ఆవిష్కరించారు. 

దాంతోపాటే, తారకరామం-అన్న గారి అంతరంగం పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఎన్టీఆర్ సినిమా కెరీర్ విశేషాలు, పలు ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు, ఆయన గురించి సమాచారాన్ని, ఆయన గురించి ఇతర ప్రముఖులు చెప్పిన మాటలను పొందుపరిచారు.
20241214fr675dae6b52bd0.jpg
Posted

Chandrababu: మనకు తెలిసిన, మనం చూసిన ఏకైక యుగపురుషుడు ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు 

14-12-2024 Sat 21:13 | Andhra
380-3.jpg
CM Chandrababu speech in NTR Diamond Jubilee celebrations

 

  • ఎన్టీఆర్ తొలి చిత్రం మనదేశం
  • ఆ చిత్రం విడుదలై 75 ఏళ్లు
  • పోరంకిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుక
  • ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన సీఎం చంద్రబాబు
జగద్విఖ్యాత మహా నటుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నందమూరి తారకరామారావు తొలి చిత్రం మనదేశం విడుదలై 75 ఏళ్లయిన సందర్భంగా ఈ వేడుక జరుపుకుంటున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మనదేశం చిత్ర నిర్మాత కృష్ణవేణి గారు కూడా హాజరవడం విశేషమని అన్నారు. ఆమెకు ఇప్పుడు 102 సంవత్సరాలని, ఆమె పట్టుదలను మెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో పట్టుదలతో రావడమే కాకుండా, ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా ప్రశాంతంగా కూర్చున్నారని వివరించారు. అందుకు కారణం ఆమె జీవితంలో క్రమశిక్షణ అని వ్యాఖ్యానించారు. 

ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు రావడం హర్షణీయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దగ్గుబాటి సురేశ్, మాజీ ఎంపీ జయప్రద, ప్రభ, కృష్ణంరాజు అర్ధాంగి శ్యామల, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కేఎస్ రామారావు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థంగా నిర్వహిస్తున్నందుకు టీడీ జనార్ధన్ ను అభినందిస్తున్నానని తెలిపారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ లేకపోతే ఈ కార్యక్రమం లేదని అన్నారు. 

ఈ రెండింటికి అర్థం... ఎన్టీఆర్

ఇవాళ మనం ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక జరుపుకుంటున్నాం. ఇదొక అపూర్వ ఘట్టం. గతేడాది ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుపుకున్నాం. సంవత్సరమంతా ఉత్సవాలు జరుపుకున్నాం. ఒక యుగపురుషుడు జన్మించినప్పుడు చరిత్ర అతడిని మర్చిపోదు. అందుకు ఎన్టీఆర్ ఒక ఉదాహరణ. ఒక దేశంలో అని కాదు... ప్రపంచంలోని అనేక దేశాల్లో  ఆయన శతజయంతి వేడుకలు జరుపుకున్నాం. మరోసారి ఆయన పేరిట సినీ వజ్రోత్సవ వేడుక ఏర్పాటు చేసుకోవడం, మళ్లీ మనందరం ఆయన గురించి మాట్లాడుకోవడం సంతోషదాయకం. 

ఎన్టీఆర్ వంటి యుగపురుషులు అరుదుగా పుడతారు. మనకు తెలిసిన, మనం చూసిన ఏకైక యుగపురుషుడు ఎన్టీఆర్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, తెలుగుజాతి పేరు వింటేనే గుర్తుకు వచ్చే వ్యక్తి ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి హృదయాల్లో ఉండే వ్యక్తి ఎన్టీఆర్. అచ్చమైన తెలుగుదనం, తెలుగువాడి ఆత్మగౌరవం... ఈ రెండింటికి అర్థం ఎన్టీఆర్. 

చరిత్రలో ఇలా ఎక్కడా జరగలేదు

ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి, తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్ లా ఎదగడం, తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు... భవిష్యత్తులోనూ జరుగుతుందన్న నమ్మకం లేదు... జరగదు. ఇటు  వెండితెరను, అటు రాజకీయాలను ఏలిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఎన్టీఆర్ ఒక్కరే. రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోటా సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. 

ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మనదేశం... విడుదలై 75 సంవత్సరాలవుతోంది. ఇవాళ ఆయన లేకపోయినా మనం ఈ వేడుక జరుపుకుంటున్నామంటే అదీ ఎన్టీఆర్ గొప్పదనం. ఒక్కోసారి యుగపురుషుల చరిత్ర కూడా మనం నెమరువేసుకోవాలి. వారి జీవితాల నుంచి స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. 

ఆ రైలెక్కాక ఎన్టీఆర్ జైత్రయాత్ర మొదలైంది

నిమ్మకూరు అనే పల్లెటూరులో వెంకట్రామమ్మ,లక్ష్మయ్య చౌదరి దంపతులకు 1923 మే 28న జన్మించిన కారణజన్ముడు ఎన్టీఆర్. నేను ఆయనను కలిసి చాలాసార్లు మాట్లాడినప్పుడు... అప్పుడప్పుడు తన చరిత్రను, జీవితంలోని సంఘటనలను నాకు కొంచెం చెప్పేవారు. చదువు కోసం విజయవాడకు వచ్చేవారు. తెల్లవారుజామునే లేచి... తల్లికి సాయంగా అనేక పనులు చేసేవారు. పాలను విక్రయించేవారు... ఆ తర్వాత కాలేజికి వెళ్లేవారు. జీవితం మొదట్లో అందరికీ కష్టాలు ఉంటాయి... ఆ తర్వాత మనశక్తిని బట్టి మన జీవితాన్ని మలుచుకుంటాం. 

1945లో మద్రాసు రైలెక్కాక ఎన్టీఆర్ జైత్రయాత్ర మొదలైంది. సినిమా రంగంలో ఆయన మొదట్లో నెలవారీ జీతం తీసుకునేవారు. ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, చక్రపాణి తదితరులు ఆయనకు సినిమాల్లో అవకాశాల కోసం సహకరించారు. ఆ తర్వాత సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక సినిమాల్లో నటించి, ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. 300 సినిమాల్లో నటించారు. అప్పట్లో ఆయన ఏడాదికి 10 నుంచి 15 సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే మూడేళ్లు పడుతోంది. కానీ ఎన్టీ రామారావు మాత్రం పెద్ద సంఖ్యలో సినిమాల్లో నటించేవారు. 

 అలాంటి నటులు మరొకరు దొరకరు... కనిపించరు!

భారతదేశ సినీ చరిత్రలో ఎన్టీఆర్ లా విభిన్న పాత్రలు పోషించే నటులు మరెవరూ లేరు... దొరకరు... కనిపించరు! ఆయన ఏ పాత్ర పోషించినా... ఆ పాత్రలో జీవించారు. వెంకటేశ్వరస్వామి పాత్ర వేయాలన్నా, శ్రీకృష్ణుడి పాత్ర వేయాలన్నా, రాముడిగా నటించాలన్నా ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. ఆ సమయంలో మాంసాహారం తినేవారు కాదు... ఇంట్లో మంచం మీద కాకుండా చాప మీద పడుకునేవారు. నిబద్ధతకు ఉదాహరణలా నిలిచారు. దేవుడు ఎలా ఉంటాడో ఆ రూపం మనకు తెలియదు కానీ, ఎన్టీఆర్ రూపంలో దేవుడ్ని చూస్తున్నాం. 

ఓసారి ఎన్టీఆర్ గారిని అడిగాను... మీరు రాముడిగా నటిస్తారు, రావణుడిగా నటిస్తారు... శ్రీకృష్ణుడిగా నటిస్తారు, ధుర్యోధనుడిగా నటిస్తారు... ఎలా సమన్వయం చేసుకుంటారు అని అడిగాను. అందుకాయన ఒకటే మాట చెప్పారు... ఏ క్యారెక్టర్ కు ఆ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది... వాళ్లు విలక్షణ వ్యక్తిత్వం ఉన్నవారు. వాళ్ల వ్యక్తిత్వాలు కూడా విశిష్టంగా ఉంటాయని ఆ క్యారెక్టర్లను జస్టిఫై చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆయా క్యారెక్టర్లలోని మంచి గుణాలు నచ్చి, ఆ పాత్రలు పోషించాడు. 

దానవీరశూరకర్ణలో మూడు పాత్రలు పోషించి, మళ్లీ దర్శకత్వం కూడా వహించారు. నేను చేయలేనిది ఏదీ లేదు... ఏదైనా సరే చేసి చూపిస్తాను అని చేసి చూపించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. అందుకే సినిమాల్లో 24 క్రాఫ్ట్స్ గురించి తెలిసిన ఏకైక కథానాయకుడు నందమూరి తారకరామారావు. 

నా చిన్నప్పుడు లవకుశ సినిమా చూశాను. ఎక్కడో పల్లెటూరి నుంచి ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చి ఆ సినిమా చూసేవారు. ఇలాంటివి ఎన్నో. పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర, శ్రీనాథ కవిసార్వభౌమ వంటి సినిమాల కోసం ఎంతో రీసెర్చ్ చేసి ఆయా పాత్రలు పోషించారు. తోడుదొంగలు సినిమాకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. 

రాజకీయాల్లోనూ ఆయన హీరో

సినిమాల్లో హీరోగా చేసినట్టే... రాజకీయాల్లోనూ నిజమైన హీరో అనిపించుకున్నారు. నేను ఆయనను కలిసిన తర్వాత నా పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆయనతో ఓసారి చర్చ జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే... 60 ఏళ్లు నేను కుటుంబం కోసం బతికాను. ప్రజలు నన్ను ఆదరించారు. తిరిగి నా శేషజీవితాన్ని ఈ ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నానని చెప్పి, రాజకీయాల్లోకి ప్రవేశించారు. 

చైతన్యరథం ఎక్కి 9 నెలలు రాష్ట్రమంతటా తిరిగారు. పిల్లల పెళ్లిళ్లకు కూడా రాకుండా ఆయన సమాజం కోసం అంకితమయ్యారు. 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన స్థాపించిన పార్టీ శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంతవరకు నందమూరి తారకరామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుంది. మేం ఆన్ లైన్ లో పార్టీ సభ్యత్వాలు నమోదు చేస్తుంటే, ఇప్పటికే 73 లక్షల మంది సభ్యత్వాలు తీసుకోవడం టీడీపీ శక్తికి నిదర్శనం. 

ఆయన తెలుగుజాతి పౌరుషం, తెలుగుజాతి ఆత్మగౌరవం

తెలుగుజాతి ఆత్మగౌరవం, తెలుగుజాతి పౌరుషం అంటే ఎన్టీఆర్ గుర్తొస్తారు. మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు సంక్షేమ పథకాలు అనేవే లేవు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు... ప్రభుత్వం అంటే పరిపాలన, పెత్తందారు వ్యవస్థ అన్నట్టుగా ఉండేది. కానీ కూడు, గూడు, గుడ్డ నినాదంతో పాలనకు కొత్త అర్థం చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఇప్పుడు మేం కూడా ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరిక నిర్మూలనకు కృషి చేయడమే కాకుండా... ఆర్థిక అసమానతలను తగ్గించే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది" అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...