psycopk Posted January 3 Report Posted January 3 Mid Day Meal For Inter Students: రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం... ప్రారంభించనున్న నారా లోకేశ్ 03-01-2025 Fri 16:32 | Andhra ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు మంత్రి నారా లోకేశ్ చర్యలు డొక్కా సీతమ్మ పథకం పేరిట ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రేపు విజయవాడలో లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి లోకేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల మెరుగుదలకు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం' అమలు చేయాలని నిర్ణయించారు. రేపు (జనవరి 4) విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేశ్ లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 398 పాఠశాలలు అనుసంధానమై ఉండగా, అక్కడ భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఈ ఏడాది రూ.27.39 కోట్లు, వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85.84 కోట్లు ఖర్చుచేయనున్నారు. Quote
psycopk Posted January 3 Author Report Posted January 3 AP Maker Lab On Wheels: ఏపీ-మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ వాహనాన్ని పరిశీలించిన మంత్రి నారా లోకేశ్ 03-01-2025 Fri 17:09 | Andhra అధునాతన సాంకేతికతపై అవగాహన కోసం మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ స్కూళ్ల వద్దకే వెళ్లి అవగాహన కల్పించేలా వాహనాలకు రూపకల్పన విద్యార్థులకు భవిష్యత్ సాంకేతికతను వివరించే లక్ష్యంతో కీలక ప్రాజెక్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ-మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ఏపీ ప్రభుత్వం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని విద్యార్థులకు భవిష్యత్ సాంకేతికతను వివరించే లక్ష్యంతో ప్రారంభించనున్న ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో నేడు పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని పాఠశాలలకు వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పిస్తుంది. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు ఇటువంటి వాహనాలను పంపిస్తారు. పరివర్తనాత్మక నైపుణ్య అవకాశాలను విద్యార్థుల వద్దకే తీసుకెళ్లేందుకు ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కావడం అభినందనీయమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా విజన్, ESG విజన్ 2030 ( ఎన్విరాన్ మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) లక్ష్యాలకు అనుగుణంగా మారుమూల ప్రాంతాలకు ఉచిత డిజిటల్, STEM లెర్నింగ్ అవకాశాలను అందించడం మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ లక్ష్యం. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్–ఇన్ఫోసిస్ సంయుక్త సహకారంతో ఏపీ-మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభిస్తారు. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగాలపై ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా విద్యార్థులకు బేసిక్ స్కిల్ అందించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఏపీ మేకర్ ల్యాబ్‌లో 90 నిమిషాల వ్యవధిలో ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్ ఉంటుంది. తర్వాత విద్యార్థుల ఆసక్తిని బట్టి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు ప్లాట్‌ఫామ్ ద్వారా ఉచితంగా వివిధ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం కల్పించి, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ సర్టిఫికేషన్ అందజేస్తారు. మొబైల్ ల్యాబ్‌లో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్ లు, వర్క్‌స్టేషన్‌లు, ప్రయోగాల కోసం కిట్‌లతో సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ రూ.5 కోట్లతో ల్యాబ్ తో కూడిన బస్సు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఏడాది రూ. 40 లక్షల నిర్వహణ వ్యయాన్ని భరించడమేగాక విద్యార్థులకు కోర్సు కంటెంట్ తో పాటు ట్రైనర్ సపోర్టు అందిస్తుంది. ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ ఒక్కో విద్యార్థికి సగటున రూ.1,500 ఖర్చుచేస్తుంది. ఈ కార్యక్రమం కింద ప్రతి మూడు నెలలకు 4,800 మంది విద్యార్థులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిరోజూ 20 మంది విద్యార్థులతో కూడిన 4 బ్యాచ్‌లకు అవగాహన కల్పించాలన్నది ప్రధాన లక్ష్యమని ఇన్ఫోసిస్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ జి. గణేశ్ కుమార్, ఇన్ఫోసిస్ సిబ్బంది పాల్గొన్నారు. Quote
psycopk Posted January 3 Author Report Posted January 3 Ganapati Sachidananda Swamy: చంద్రబాబు ఒక కర్మయోగి... ఆయన అనుకున్నది నిర్విఘ్నంగా జరుగుతుంది: గణపతి సచ్చిదానంద 03-01-2025 Fri 17:36 | Andhra విజయవాడలోని సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లిన చంద్రబాబు ఆశీర్వచనాలు పలికిన గణపతి సచ్చిదానంద స్వామి చంద్రబాబు పాలనలో కచ్చితంగా స్వర్ణాంధ్ర సాకారం అవుతుందన్న స్వామి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడారు. చంద్రబాబు ఒక కర్మయోగి అని అభివర్ణించారు. ఆయన అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ స్వర్ణాంధ్ర కావడం తథ్యమని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆయనకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. "చంద్రబాబు వంటి కర్మయోగిని ఆ భగవంతుడు మనకు మళ్లీ తీసుకువచ్చి ఇచ్చాడు. అమ్మవారు ఆయనతో ఏమేం చేయించాలనుకుందో, అవన్నీ జనసహకారంతో, పరమాత్మ యొక్క వాతావరణ సహకారంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. నిస్వార్థమైన సేవలు అందించేలా చంద్రబాబుకు, ఆయన మంత్రివర్గానికి మంచి శక్తిని, ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని జగన్మాత అయిన గీతా మాతను ప్రార్థిస్తున్నాం" అని సచ్చిదానంద స్వామి వివరించారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడానికి చంద్రబాబు ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ వెళుతున్నారని, ఆయనకు కొంచెం సమయం ఇవ్వాలని అన్నారు. చెడు చేయాలంటే ఎంతో సమయం పట్టదని, వెంటనే చేసేయొచ్చని... కానీ మంచి పనులు చేయాలంటే సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఇటీవలి వరకు మీ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదని, కానీ ఇప్పుడు మళ్లీ మన రాష్ట్రానికి రాజధాని వచ్చిందని గణపతి సచ్చిదానంద హర్షం వ్యక్తం చేశారు. నా రాజధాని అమరావతి అని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలనని అన్నారు. Quote
psycopk Posted January 3 Author Report Posted January 3 కడప శివార్లలో 52 ఎకరాల భూములు కబ్జా చేశారంటూ ఆరోపణలు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని పవన్ ఆదేశం పేదల, ప్రభుత్వ భూముల జోలికి వస్తే సహించేది లేదన్న పవన్ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. కడప శివార్లలో 52 ఎకరాల చుక్కల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ భూములను సజ్జల కుటుంబీకులు ఆక్రమించుకున్నారంటూ వచ్చిన ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ కబ్జా వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. భూ కబ్జా వ్యవహారంపై విచారణ జరపాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. సజ్జల కుటుంబం కబ్జాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అటవీ, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. పేదల, ప్రభుత్వ భూముల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికారులు విచారణ నిమిత్తం రంగంలోకి దిగారు. ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. మరోవైపు, ఈ భూముల్లోనే సజ్జల గెస్ట్ హౌస్ కట్టుకున్నట్టు తెలుస్తోంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.