Jump to content

Kalki movie fans ravali


Recommended Posts

Posted

175

తాత్పర్యం: అని దుర్యోధనుడు అమూల్యరత్నాలతో చేసిన తనకంకణాలను ఒడ్డగా, ఒకరికై మరొకరు జూదమాడటం
అక్రమ మని అంటూ ధర్మరాజు సముద్రపు సుళ్ళలో ఉద్భవించిన ఉత్తమ మణులతో చేసిన హారాలను ఒడ్డాడు.
ఈవిధంగా స్నేహభావంతో జూదం నడుస్తుండగా, అక్కడికి భీష్మ ధృతరాష్ట్ర విదుర కృప ద్రోణాశ్వత్థామలు వచ్చి,
ఎత్తైన పీఠాలమీద కూర్చుండి, సంతోషం లేనిమనస్సుతో జూదాన్ని చూస్తూ ఉన్నారు.
 

విశేషం: ఒకరికై మరొకరు జూదమాడటం అక్రమం అనే ధర్మరాజు జూదంలో ఎందుకు పాల్గొనాలి? వ్యక్తి స్వభావంలో
వ్యసనం ఎంతో బలీయం. అందుచేతనే అంతటి ధర్మరాజుకూడ - అందరికీ తెలియటానికి అది అక్రమం అని అన్నారు కాని- ఆటమాత్రం తాను మానలేదు.

This తాత్పర్యం and విశేషం sums up dharma raju ‘s addiction to gambling it has nothing to do with following vidura or dhrutharastra orders. Sakuni mosam chesthaadu ani telusu, okari kai marokaru aada koodadhu ani Telusu clear ga ikkada gambling rules follow avvatledhu ani cheppi game aadanu ani cheppachu but he didn’t stop.

 

176 sakuni winning the gambling.

తాత్పర్యం: తన కిష్టమైన పాచికలు రూపొందించుకొని మోసగా డైన శకుని ధర్మరాజును జయించాడు. చంద్ర
వంశంవాడైన ధర్మరాజు 'నే నింక నిన్ను ఓడిస్తాను' అని శకునితో మళ్ళీ జూదం ఆడటానికి పూనుకొన్నాడు

177 dharmaraju betting everything.

తాత్పర్యం: విధంగా ధర్మరాజు క్రోధంతో పెచ్చుపెరిగి ఒకదాని వెంట ఒకటి ఒడ్డుతూ వేలకొలది వరహాలతో నిండి పదివేల సంఖ్యలు గల పెక్కు కుండలతో ఒప్పుతున్న బంగారు భాండాగారాలను, వజ్ర వైదూర్యమరకతాది పలువిధ స్వచ్ఛ విస్తార రత్నాలతో నిండిన రత్నభాండాగారాలను, ప్రత్యేకంగా ఐదుతూముల బంగారంతో కూడుకొన్న నాలుగువందలనిధులను, మణులసమూహాలతో, చిరుగజ్జెలసమూహాలతో అలంకరించబడిన లెక్కలేనన్ని గుర్రాల సమూహాలను, బంగారుకవచాలతో, నడుముకు కట్టే బంగారుమోకులతో, మీద పరిచే బంగారుచిత్రకంబళాలతో కూడుకొన్న మదపుటేనుగుల సమూహాలను, శ్రేష్ఠాలైన రత్నాల సొమ్ములతో అలంకరించబడిన వేలకొలది స్త్రీలను, ప్రతిదినం అతిథిజనుల భోజన పాత్రలను హస్తాల్లో ధరించిన నూరువేలమంది సేవకులను, అర్జునుడికి గంధర్వరాజు బహూకరించిన గంధర్వాశ్వాలు మొదలుకొని పాలు త్రాగటంచేత, వరిబియ్యం తినటంచేత పెరుగుతున్న పెక్కు పదివేల సంఖ్యల మేలుజాతిగుర్రాలను, మేకల, గుఱ్ఱాల, గోవుల, గేదెల, గాడిదల, కంచరగాడిదల సమూహాలను ఒక్కొక్క ఒడ్డున ఒడ్డి ఓడిపోవటం చూచి, విదురుడు ధృతరాష్ట్రునితో రహస్యంగా ఇలా అన్నాడు.

Next slokas are discussion between vidura - drutharasthra and vidura – Duryodhana to stop the gambling

194 shakuni to dharma raju

తాత్పర్యం: ‘ చంద్రవంశపురాజా! ధర్మరాజా! ఉన్న సంపదనంతా ఓడిపోయావు. ఇంకా పందెం ఒడ్డటానికి నాకు
ధనం చూపు' అని సారెలు ముందర పడవేసి ఆట మానిన శకునికి, గొప్ప మనస్సు కల ధర్మరాజు బలమైన
ద్యూతవ్యసనానికి లొంగిపోయి రాజ్యాన్నంతా ఒడ్డి ఓడిపోయాడు.

Ikkada naa sampada antha poiyindhi ani apeyyachu kaani Goppa manasu gala dharma raju anta gambling lo motham pogottukunnadu. Ikkada kooda goppa manasey.

195

తాత్పర్యం: ఈవిధంగా - దేవాలయాల్లోని దేవుళ్ళ ధూపదీపాలంకార నైవేద్యాలకు, బ్రాహ్మణుల జీవనోపాధికి
దానాలుగా ఇచ్చిన భూములు తప్ప, తక్కిన భూమిని, బ్రాహ్మణులు తప్ప సామాన్యజనులందరిని, రాజపుత్రులను,
ఒక్కొక్క పందెంలో ఒడ్డి ఓడిపోయాడు. మళ్ళీ

Brahmanulini maatram vadilesi andarini betting lo pettadu anta. If you observe the whole book, brahmanulaki daanaalu chesaadu, brahamanulu chetha yagnaalu cheyinchaadu, brahmanulu maate vine vaadu, brahmanululani baaga choosi konevaadu, etc ani chaala slokalu untai, looks like the author indirectly injecting into the minds of the readers that if you want good things to happen you have to take care of brahmins. Joodam aadataaniki mundara episode lo yagnaalu yagaalu cheyisthaadu rajyam subhiksham kosam. But, he loses all.

Posted

196

తాత్పర్యం: పూర్తిగా ధర్మాన్ని అనుసరించేవాళ్ళు, విశాలమైనభుజాలుగలవాళ్ళు, యుద్ధంలో జయశీలురు, సూర్యునితో
సమానమైన తేజస్సు కలవాళ్ళు, తొలిరాజులవలె మంచి నడవడి కలవాళ్ళు, ఆత్మగౌరవంలో, సత్యంలో ప్రీతిగలవాళ్ళుఅయిన తమ్ములు - సహదేవనకులార్జునభీమసేనులు నలుగురిని వరుసగా ధర్మరాజు ఒడ్డి ఓడిపోయాడు. కడకు తనను కూడ ఒడ్డుకొని వంచనకు గురిఅయి ఓడిపోగా, శకుని చూచి, ' ధర్మరాజా! విధంగా ని న్నేల ఒడ్డుకొన్నావు? నీకు ఇంకొక ధనం ఉందిగదా! ఎలా మరచావు? కమలాక్షి ద్రౌపది నీధనం కాదా?' అన్నాడు.

విశేషం: ఇక్కడ శకుని వేసిన ప్రశ్న జటిలమైంది. చిక్కు ధర్మరాజుకే అర్థమౌతుంది. ధర్మరాజు తనను తాను పణంగా పెట్టుకొన్నప్పుడు శకుని మాట్లాడలేదు. అతను ఓడిన తరువాత మరొక ధనం ఉం దని జ్ఞాపకం చేశాడు. న్నోడిన ధర్మజుడు దాసుడు కావచ్చు కాని, అతనిభార్యమీది అధికారం అతని కున్న దని సూచనచేయటం ఒక అర్థం. ధర్మజుడు ఓడాడు కాబట్టి శకుని చెప్పినట్లు చేయటం కర్తవ్యం కావటం మరొక అర్థం. రెండింటిచేత బంధించబడిన ధర్మజుడు సభాపర్వము - ద్వితీయాశ్వాసము  భార్యను పణంగా పెట్టటానికి పూనుకొన్నాడు. దీనిలోని ధర్మసూక్ష్మాన్ని గురించి ద్రౌపది నిండుసభలో ప్రశ్నించబోతున్నది. (వివరాలకు పీఠిక చదవండి - సంపా.)

Ikkda విశేషం lo ధర్మజుడు ఓడాడు కాబట్టి శకుని చెప్పినట్లు చేయటం కర్తవ్యం కావటం మరొక అర్థం annadu kaani తాత్పర్యం lo కమలాక్షి ద్రౌపది నీధనం కాదా? Ani maatrame sakuni annadu, draupadini gambling ki pettamani order aithe ivvaledhu it’s just a suggestion that you have another property. Dharmanni kachitanga paalinche dharma raju drapaudi and brothers naa property kaadu nenu vallu naa aasthi kaadu gambling lo vallani pettalenu ani cheppi aapeyyachu but he didn’t stop. It clearly shows he did consider them as properties. Brothers and wife ni gambling lo pettachu annadhi e kshatriya dharmamlo undo dharma raju ke teliyaali. Draupadi questions about in the later slokas too.

197

తాత్పర్యం: ఆలస్యం చెయ్యకుండా, పాచికలమీది ప్రీతితో, ధర్మరాజు మళ్ళీ ఆటకు పూనుకున్నాడు. కలువరేకులవంటికన్నులు కలది, కులకాంత అయిన ద్రౌపదిని పణంగా ఒడ్డాడు. దుష్టశకుని చేతుల్లో ఆమెను కూడ ఓడిపోయాడు.ఇంకా ఒడ్డటానికి ధనం లేదు. అందుచేత గర్వాన్ని కోల్పోయాడు. ఎంతో దీనమైన ముఖంతో అప్పుడు ఆట చాలించాడు.

విశేషం: ధర్మజుని ద్యూతవ్యసనం కడకు ధర్మపత్ని ద్రౌపదిని ఓడిపోయేదాకా సాగితేకాని ఆగలేదు. మానవస్వభావంలో
వ్యసనపరత ఎంత బలీయమో, అన్నిధర్మాలు తెలిసిన ధర్మరాజుసమతనే అది ఎంతగా తారుమారు చేసిందో
మహాభారతం ఘట్టంలో మరపురానంత బలంగా ప్రదర్శించింది.

 197 sloka విశేషం lo clear gaa author explains that gambling addiction is the reason.

Dhrutarastrudu, vidurudu friendly gaa aada mannaru kaani motham asthulu,Thamullanu, bharyani kolpoye varaku aadalani cheppaledhu. Even if there is that kind of rule Shakuni gave an option if you don’t want to play you can leave but dharma raju ego was hurt. he was losing but didn’t stop and kept on betting everything. He considered his brothers and wife as properties lost them in the bet. Its his addiction that cost him, Dharma raju gambling only because he was following vidura orders is not a validatory reason.

Next slokas covers about seniors like bheeshma, vidura etc not happy and Kauravas are having fun.

 

200 sloka  dhuryodhana asking vidura to bring Draupadi to sabha and vidura rejects.

తాత్పర్యం: దాసీజనంతో కలిసి తన ఇల్లు వరుసగా తుడవటానికి ద్రౌపదిని ఆజ్ఞాపించాలనే ఆలోచనతో, రాజ్య
గర్వంతో విర్రవీగుతూ- ద్రౌపదిని తోడ్కొని రమ్మని విదురుణ్ణి వెంటనే ఆజ్ఞాపించాడు.

His first intention was to make her to sweep the house along with other servants.

201

తాత్పర్యం: దాన్ని సహించక విదురుడు దుర్యోధనునితో 'నీతో సమానమైన మూర్ఖులు లోకంలో మరెవ్వరూ లేరు.
ఇంత క్రూరమైన పనికి నన్ను పంపదగునా?' అని అన్నాడు.

Next slokas vidura explain it’s a bad idea to bring Draupadi into sabha. Duryodhana scolds vidura and sends pathikrami.

Posted

207 pathikrami to draupadi

తాత్పర్యం: 'ధర్మరాజు జూదమాడి-కౌరవులకు తన ధనసంపదలను, రాజ్యాన్ని, కొడుకులను, తమ్ములను, తనను,
నిన్ను ఓడిపోయాడు. పద్మాక్షీ! కౌరవశ్రేష్ఠుడైన దుర్యోధనుని పనిమీద నిన్ను వేగమే తోడ్కొని పోవటానికి వచ్చాను.
కౌరవేశ్వరుని దగ్గరికి రా' అని అనగా ద్రౌపది అతనితో ఇలా అన్నది.

208

Draupadi to pathikrami


తాత్పర్యం: యుగంలో నయినా, ఎటువంటి చెడ్డ జూదగాడయినా, భార్యను పణంగా ఒడ్డి ఓడిపోయిన భర్త
ఉన్నాడా? వినటాని కిది ఆశ్చర్యకరంగా ఉంది. చంద్రవంశ ప్రభువైన ధర్మరాజు ఇలా చేశాడా?


విశేషం: ధర్మజుని 'ఇందుకులు' డనటంలో చంద్రునికాంతితో పాటు అతనిమచ్చకూడ స్ఫురించినట్లే. ధర్మజుని
గుణసంపదతోపాటు అతని ద్యూతవ్యసనం కూడా ధ్వనిస్తున్నది.


Draupadi also surprised that even the worst gambler doesn’t bet wife in gambling.

విశేషం lo clear gaa malli mention chesaadu dharmaja gambling addiction.

209

తాత్పర్యం: నా భర్త మొదట తన్నోడి తరువాత న్నోడెనా? లేక ముందే న్నోడి తరువాత తా నోడెనా? అన్నా!
నీకు తెలిస్తే సంగతి నాకు చెప్పు.

Mundu odina venaka odina doesn’t matter it clearly shows that he lost her because of gambling addiction even the author mentioned about it. Evarni mundu betting lo pettina end of the day Draupadi is still dharma raju’s wife her status doesn’t change if he betted her before or later.

210

తాత్పర్యం: 'నీకు తెలియకుంటే, జూదగాణ్ణి అడిగి వచ్చి- నన్ను పిలిచికొని వెళ్ళటం తగినట్లయితే పిలుచుకొని వెళ్ళు'- అని ద్రౌపది పలుకగా, ప్రాతికామి తిరిగి వచ్చి ఆమెమాటలు ధర్మరాజుకు చెప్పాడు. కాని, అతడు జూదంలో ఓడిపోయి దుఃఖంతో ఉండటంవల్ల ప్రాతికామికి బదులు చెప్పలేదు. అప్పుడు దుర్యోధనుడే ఇలా అన్నాడు.

211

తాత్పర్యం: ‘ఖచ్చితంగా సమాధానం చెప్పటానికి వీలులేని న్యాయాన్ని ఇంతమంది ఎదుట అడిగావు. సభలోని
వా రందరూ తెలుసుకొనేట్లు, అందగత్తె అయిన ద్రౌపదిని ఆలస్యం చేయకుండా తోడ్కొనిరా- వెళ్ళు' అని
దుర్యోధను డనగా.

 

212

తాత్పర్యం: ప్రాతికామి ద్రౌపది దగ్గరకు వెళ్ళాడు. 'నీ వడిగిన న్యాయాన్ని నిర్ణయించటానికి సభ్యులు నిన్ను
మ్మని ఆజ్ఞాపించారు. రా' - అన్నాడు. ద్రౌపది దుర్యోధనుని దుష్కృత్యానికి, ధర్మరాజు అంగీకారానికి భయపడింది.
ధరించిన ఏకవస్త్రంతో, క్రిందికి ఉన్న కోకముడితో, ఎడతెరపిలేని కన్నీటి బిందువులతో, తడిసిన చనుకట్టుతో
ప్రాతికామివెంట సభకు వెళ్ళింది. కురువృద్ధుడైన ధృతరాష్ట్రునిదగ్గర నిలిచింది. ద్రౌపదిదీనస్థితిని చూడలేక సిగ్గుతో
దుఃఖిస్తూ, పాండవులు తలలు వంచుకొన్నారు. సిగ్గుతో తలలువంచుకొన్న పాండవుల్ని చూచి సుయోధనుడు
సంతోషించాడు. దుశ్శాసనుణ్ణి పిలిచాడు. 'ప్రాతికామి భీముడికి భయపడతాడు. నీవు వెళ్ళి ద్రౌపదిని తీసుకురా' అని
ఆజ్ఞాపించాడు. అప్పుడు

214

తాత్పర్యం: వెంటనే దుశ్శాసనుడు ద్రౌపదివెంట పరుగెత్తి ' కాంతా! ఇంక నీ వెక్కడికి వెళ్ళగలవు? చెప్పినట్లు
విని ఇక్కడికి రా. జూదంలో శకుని నిన్ను గెలిచాడు. కురుశ్రేష్ఠుడైన దుర్యోధనుడి సొత్తువైనావు. నీ భర్తలు నిన్ను,
రాజ్యాన్ని, తమను జూదంలో కోల్పోయారు.

Posted

215

తాత్పర్యం: అంటూ దగ్గరకు రాగా, ద్రౌపది - 'నేను రజస్వలను, నన్ను తాకవద్దు. ఒకే బట్ట కట్టుకొని ఉన్నాను.
పెద్దలు, బంధువులు కొలువుదీరిన సభకు ఎలా వస్తాను?' అని అనగా, దుశ్శాసనుడు 'నీవు ఒకే బట్ట కట్టుకొంటే
ఏమి? లేదా అసలు బట్ట లేకుండా ఉంటే ఏమి? ఎలాగైనా నిన్ను తీసుకొని పోతాను' అని బలవంతంగా.

217

తాత్పర్యం: విధంగా గాలిచే కదలించబడిన జెండావలె దుశ్శాసనునిచేత ఈడ్వబడిన ద్రౌపది, చెదిరిన
జుట్టుతో, వెలవెలబోయిన ముఖంతో- కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, సైంధవుడు మొదలయిన దుర్మార్గులతో
నిండిన సభకు వచ్చి, కోపంతో సిగ్గుతో మైమరచినదై.

218

తాత్పర్యం: కురువంశంలోని పెద్దలారా! సాటిలేని దురదృష్టాలచేత దెబ్బతిన్నప్పటికీ, పుణ్యాత్ముడైన ధర్మరాజు
ఎల్లప్పుడు ధర్మమనే సంపదతో ప్రకాశిస్తాడేకాని, ధర్మమార్గం తప్పి నడుస్తాడా? అధికకోపం కలవాడు, చెడ్డవాడు
అయిన దుశ్శాసనుడు కండకావరంతో అవివేకంగా న్నెందుకు సభకు ఈడ్చి తెచ్చాడు?

Adhi duradhrustam tho kaadu dhootya vyasanam tho debbathinnadu, punyatmudu ellappudu dharma mane sampadane prakaasistaadu antundi, nijamga gaa dharmanne follow ayyevaadu aithe he wouldn’t have gambled, as it it against kshatriya dharma.

219

తాత్పర్యం: ‘ విధంగా నన్ను జుట్టుపట్టి ఈడ్చితేవటం ఉచితం కాదని భావించక, కురువంశప్రముఖులంతా
చూస్తుండగా, క్రొవ్విన దుశ్శాసనుడు న్నవమానిస్తున్నాడు. అన్ని ధర్మాలు పూర్తిగా తెలిసినవా ళ్ళని పేరు
పొందిన భరతవీరుల వంశం ఈనాడు అధర్మం పెరగటంచేత ఎంతో నిందించదగినది అయిందని
కోపించిన ద్రౌపది భయపడి శ్రీకృష్ణుణ్ణి స్మరించింది.

Daaniki sole reason is dharma raju and his gambling addiction. Bhima talks about it in next slokas.

221 bheema questioning dharma raju

తాత్పర్యం: సూర్యునితో సమానమైన ధర్మరాజా! ధన, కనక, రత్న, వాహనాలకు, రాజ్యానికి, ఆయుధాలకు,
తమ్ములమైన మా నల్వురకు - నీవు ప్రభుడవు. కాబట్టి, జూదంలో ఒడ్డి ఓడిపోవటం ఉచితమే.

222

తాత్పర్యం: ఓరాజా! ద్రౌపదిని కపటపు జూదంలో పందెంగా ఒడ్డదగునా! చెడుజూదం కారణంగా ఆమె
దయలేనివాళ్ళచేత అవమానింపబడింది.

223

తాత్పర్యం: 'శకునిమోసం తెలిసికూడ నీవు చెడుజూదంలో పాల్గొని, అధర్మమార్గాన నడిచినవాడి వయ్యావు.
అందుచేత నీ చేతులు కాల్చాలి' అని కోపంతో పలికిన భీమునికి అర్జునుడు ఇలా అన్నాడు.

I think bhima is the only one who had some sense here.

224 arjuna explaining to bhima

తాత్పర్యం: ధర్మరాజే ధర్మం తప్పితే భూమండలమంతా తల్లడిల్లదా? స్నేహంగా ఆడుకొనే జూదానికి, ధర్మంకొరకు
చేసే యుద్ధానికి ఇతరులు పలుమార్లు పిలిస్తే, ప్రభువైనవాడు అందుకు పూనుకోకుండా, పెడమొగంపెట్టి పోకూడదన్న
శుభక్షత్రియధర్మాన్ని, ఆయన లోకంలో నిలిపాడు. అంతేకాని ధర్మరాజు జూదమాడటం అజ్ఞానంవల్లనా?
దైవానుగ్రహం తారుమారైతే అందుకు దుఃఖించటం తగునా? ధర్మజుని శాశ్వతమైన ధర్మగౌరవం- ధర్మహీనులైన
ఇతరులచేత విధంగా చెడగొట్టబడింది.

ikkada dharma raju dharma tappadu clear gaa, joodam aadatam kshatriya dharma kaadu ani athane cheppadu, motham slokalu ani observe chethe clear gaa thelusthundhi he has gamblind addiction. Friendly gaa adamannaru asthulu, kutumbanni pogottukomani ekkada analedhu, friendly gambling and war are completely two different things its comparing apples with oranges.  Friendly gaa evaraina war cheddam antaara??

అంతేకాని ధర్మరాజు జూదమాడటం అజ్ఞానంవల్లనా? దైవానుగ్రహం తారుమారైతే అందుకు దుఃఖించటం తగునా? ధర్మజుని శాశ్వతమైన ధర్మగౌరవం- ధర్మహీనులైన ఇతరులచేత విధంగా చెడగొట్టబడింది.

Clear gaa agnyaanam kaadu his addiction. Deeniki daivaanugraham ki sambandam emundhi. Ee logic ee theesukunte daivaanugraham can be applied in many ways draupathi cheera lagali ani dussasuni agnanam vallana? Leka daivaanu graham leka ala cheyyalsi vachinda? Daivanugraham tho common sense vachi unte ala chesevaadu kaadu emo. Dharma raju asthulu pogottu kuntoo unte arjunudu dharma raju ni aapakundaa choosthundadam agynaanam vallana leka dhaivaanu graham lekanaa? Etc it can be applied many ways. Malla arjunudu “dharma raju dhi sasvatham gouravam anta adhi dharma heenulu chedagottaru anta” chedagottukunde dharma raju Its an illogical explanation from arjuna to just cover dharma raju mistakes.

Next slokas vikarna questioning elders in the sabha

 

తాత్పర్యం: ' కురువంశపు పెద్దలైన భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలయినవాళ్ళూ, గురువులైన
ద్రోణుడు, కృపుడు మొదలయినవాళ్ళూ మౌనంగా ఉన్నారు. సభలో కూర్చున్నవాళ్ళలో మిగిలిన ధర్మజ్ఞులైనా
రాగద్వేషాలు మాని ఆలోచించి చెప్పండి' - అని వికర్ణు డనగా, ఎవ్వరూ పలుకలేదు. అప్పుడు వికర్ణుడు 'నేనే ఇక్కడ
ధర్మనిర్ణయం చేస్తాను. అందరు వినండి. జూదం, వేట, మద్యపానం, అతిగా తినటం అనే నాలుగూ చెడు
వ్యసనాలు. వీటిలో తగుల్కొన్న మానవుడు ధర్మంతప్పి ప్రవర్తిస్తాడు. అలాంటివాడి పనులు లెక్కలోకి తీసుకోకూడదు.
జూదగానిచేత ఆహ్వానించబడి, జూదవ్యసనంలో తగుల్కొని ఓడిపోయిన ధర్మరాజు, పాండవు లందరికి ఉమ్మడిసొమ్ము
అయిన పాంచాలిని పందెంగా చేశాడు. అందుచేత ఆమె అధర్మంచేత జయించబడింది. సుకుమారిని-
ఒకేవస్త్రం ధరించి ఉన్నదాన్ని, ఇక్కడికి తీసుకొని రావటం అన్యాయం' అని వికర్ణు డనగా మాటలను
అంగీకరించక కర్ణు డతనితో ఇలా అన్నాడు.

Here also dharma raju gambling addiction is mentioned. Joodam,Veta, drinking and adhikamgaa thinadam kooda adharmam anta.  Ilaanti panulu chesthe lekkaloki theesukovadhu antunnadu. Adharmampu panulu antaadu vaatini lekkaloki theesukokoodadu antaadu. Also,

In 151 sloka dhuryodhana says “: ‘జూదం అనేది పురాణాల్లోకూడా వినిపిస్తుంది. దీనిలో దోషం లేదు. స్నేహంగా ఆడుకొనే జూదంవల్ల దేవతలు దేవత్వాన్ని పొందుతున్నారు.”

In 166 sloka dharma raju says “మోసం, జూదం- క్షత్రియధర్మానికి తగినవి కావు సుమా! ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు రెంటిని వదలివెయ్యాలి. రాజులు జూదమాడటం పాపపు పని.”

In 167 Dharma raju again says”: 'అంతేకాక, కపటపు జూదంలో గెలవటం మహాపాప మని, ధర్మంగా ఆడిన జూదంలో గెలవటం ధర్మంగా చేసినయుద్ధంలో గెలిచినంత పుణ్య మని అసితుడయిన దేవలుడు చెప్పాడు'

Asalu joodam adatam anedhi adharmama? Dharmama? Anedhi vellakey clarity ledhu.

229 karna to vikarna


తాత్పర్యం: ‘నీవు, ద్రౌపది అధర్మంగా జయించబడిందని పలికావు. సభలో కూర్చున్న ధర్మజ్ఞులంతా చూస్తుండగా
ధర్మరాజు తన సర్వస్వాన్నీ ఒడ్డి ఓడిపోయాడు. ద్రౌపది అతనికి పరాయిమనిషి కాదు. అందుచేత అదికూడ
ధర్మంగా జయించబడినట్లే. అలా కాకుంటే పాండవులంతా దానిని ఎందుకు జయించబడిన దానినిగా అంగీకరిస్తారు?
కాగా, ఒకే వస్త్రాన్ని ధరించి ఉన్నదాన్ని సభకు తోడ్కొని రావటం ధర్మం కా దన్నావు. భార్యకు భగవంతుడు
విధించిన భర్త ఒక్కడే. ఇది పెక్కుమంది భర్తలు కలది. అందుచేత బంధకి. ఇలాంటిదాన్ని బట్టలు లేకుండ
నగ్నంగా తెచ్చినా తప్పు లేదు' అని కర్ణుడు వికర్ణుని మాటలను త్రోసిపుచ్చి పలుకగా దుర్యోధనుడు విని,
దుశ్శాసనుణ్ణి పిలిచి 'ఈపాండవులవి, ద్రౌపదివి వస్త్రాలు లాగితీసుకో' అని ఆజ్ఞాపించగా దానిని తెలుసుకొని.
 

Ofcourse it’s a bad suggestion from karna and followed by dhuryodhana to implement it and dusssana pulling the saree. No one with minimum common sense will support this. Ee situation ki ravadaaaniki dharma raju gambling addiction is the main reason. This is what I was pointing out in my post earlier.

Posted

Some snippets from this book.

Srikrishna sending gifts to Pandavas for marrying draupadi

తాత్సర్యం: పాండవులైదుగురు (ద్రౌపదిని వివాహమాడటం విని ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు సంతోషించాడు. ఆ అయిదుగురికి వజ్రాలు, వైడూర్యాలు, మరకతాలు, ముత్యాలు పొదిగిన ఆభరణాలను, వివిధ దేశాలకు సంబంధించిన చిత్రవిచిత్రాలైన వస్ర్తాలను, ఎన్నో ఎనుగుల, గుర్రాల, రథాల, రత్నాల, పల్లకీల, వేశ్యల సమూహాలను పంపించాడు.

Srikrishna sending prostitutes as gifts to Pandavas for marrying Draupadi.

 

 

తాత్పర్యం: జనమేజయా! పండితుల సమూహం, వివిధ దేశాల రాజుల సముదాయం, మంత్రులు, ధనార్జన మొదలైనవి చేసేవారు, వివిధ పరిచర్యలు చేసే సేవకజనం, వైశ్య ప్రముఖులు మొదలైన పౌరులు, కృషీవలులు మొదలైన గ్రామీణులు, వీణ వేణువు మొదలైన సంగీత వాద్యాలను పలికించటంలో నేర్పరులు, గాయకులు, వేశ్యలు మొదలైనవారంతా ధర్మరాజును దర్శించుకొని, అతడిచేత సన్మానాలు పొంది, మనసులో ఎంతో సంతసిస్తూ కొలువు తీర్చి ఉండగా సభ చాల (ప్రకాశించింది).

 

తాత్సర్యం: అంతేకాక ధర్మరాజుపట్ట (పేమ కలవాడై విరాటుడు రెండువేల ఏనుగులను ఇచ్చాడు. (ద్రుపదుడు వెయ్యి ఏనుగులను, పదివేల గుర్రాలను, పద్నాలుగువేలమంది వేశ్యలను, పదివేల దాసీకుటుంబాలవాళ్ళను ఇచ్చాడు. కురు, కుకుర ఉలూకాది దేశ ప్రభువులు, ప్రాగ్బోతిష దేశాధిపతి భగదత్తుడు, మరుకచ్చ నివాసులు, చేది దేశరాజులు పేరుపొందిన ఆజానేయ బాహ్లిక హూణ పారసీక దేశాల గుర్రాలను, కొండలతో సమానాలైన మదపుటేనుగులను, మంచి వస్త్రాలతో, సొమ్ములతో అలంకరించబడిన వేలకొలది (స్త్రీలను, లెక్కకు మిక్కిలిగా మేకలను, గొర్రెలను, ఆవులను, (రైలను, బంగారు, రత్నాలు, వెండి, కంబళ్ళు, వస్త్రాలు మొదలయిన వాటిని ఇచ్చారు. అంతేగాక మేరు మందర పర్వతాల మధ్య ఉండే సన్నవెదుళ్ళ అడవుల్లో నివసించే గుళింద, పారద, బర్భర, తురుష్క, టెంకణ, కోంకణ దేశప్రభువులు లొంగిపోయినవాళ్ళయి హిమశైల, రామశైల, కురుదేశాల్లోని పూలతేనెతో కూడిన పాత్రలను, మంచి మందులను, ఇం[ద్రనీలమణి, ఆరుదద్రపురుగు, కోకిల, చంద్రుడు, నెమలి, చిలుకరంగులు గల గుర్రాలను, బంగారు మయాలై పట్టుపురుగువంటి పురుగులనుండి పుట్టిన పట్టు వంటి మెత్తని పదార్థంతో, చెట్లబెరడులనుండి పుట్టిన మెత్తని పదార్థంతో, గ్రుడ్డునుండి పుట్టిన పక్షుల ఈకలవంటి మెత్తని పదార్థంతో రూపొందించిన పాన్సులను, వాడిగల, పొడవైన ఖడ్డాలను, మణులు బంగారు పొదుగబడిన ఏనుగుదంతాలతో రూపొందించిన పల్లకీలను, పీఠాలను ఇచ్చారు. దేవేంద్రుడి స్నేహితుడైన గంధర్వరాజు చిత్రరథుడు నాలుగు వందల గంధర్వజాతి గుర్రాలను ఇచ్చాడు. తుంబురుడనే గంధర్వుడు వంద గుర్రాలను ఇచ్చాడు.

Posted
On 1/5/2025 at 11:37 PM, The_Mentalist said:

Grow up uncle

20 rounds aadali thats the rule… 

and no 1 till date cheated in joodham first one was kauravas

pandavas won before just got some silly necklaces from kauravas… they didn’t take entire kingdom so they have to bet kids and wives

aak thelvadhi fook thelvadhi prathodu bharatam ni anude

read moola bharatam or just shut it

 

Sampoorna Andhra bharatam (TTD)

PDF page 10630

తాత్పర్యం: ‘ఇక మీరు తిరిగి (ఇళ్ళకు) వెళ్ళండి' అన్నది కుంతి. కుంతి తమతో అరణ్యాలకు రావటానికి పూనుకొనటమూ,
అందుకు ఆమె కొడుకులు అంగీకరించకుండా ఆమెను వారించటమూ తెలిసినవాడు కాబట్టి ధృతరాష్ట్రుడు ఆ
సమయంలో, విదురుడినీ, సంజయుడినీ పిలిచి, 'కుంతికి ధర్మరాజు ఏ విధంగా చేయుమంటే ఆ విధంగా చేయు’
మని కబురు పంపాడు. వాళ్ళిద్దరూ వచ్చి ధృతరాష్ట్రుడి సందేశాన్ని కుంతికి చెప్పారు. అయినా కుంతి పట్టు విడవకుండా
విదుర సంజయుల మాటలకు అడ్డం వచ్చి గట్టి నిర్ణయంతో కొడుకులనూ, కోడళ్ళనూ, మిగిలిన చుట్టాలనూ, భరతవంశ
స్త్రీలనూ, సేవకులనూ-అందరినీ ఒక్కసారి పరికించి చూచి 'ఎందు కిట్లా వెంట వస్తారు? ఇంక ఆగండి. (ఇళ్ళకు వెళ్ళి)
సుఖంగా ఉండండి' అన్నది. అప్పుడు.
విశేషం: మూలంలో గాంధారీ ధృతరాష్ట్రులు ధర్మరాజాదుల మాటలన్నీ వింటూ ఇక్కడే ఉన్నారు కాని తెలుగులో తిక్కన
గాంధారీ ధృతరాష్ట్రులు - కుంతీ పాండవులకు కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ ఆగారు.
దుఃఖిస్తున్న కుంతికీ - తత్పుత్రులకూ
ఏకాంతం కలిగించటం వారి మాటలకు తాను అడ్డంగా ఉండటం తగదని ధృరాష్ట్రుడు అనుకొని దూరంగా వెళ్ళాడన్నమాట.
అట్లానే 'విషాదం బంది ఊరకున్న ధర్మరాజు, ధృతరాష్ట్రుడు 'కొండొక యెడగలుగం జనిన తర్వాత తల్లితో మాట్లాడాడు(157).
ఏకారణంగా నైనా కుంతి దుర్యోధనాదుల వలన పాండవులకు కలిగిన కీళ్ళు (166,168) ప్రస్తావించింది. ఇంకా ఆ రోజు సభలో
పెద్దలు ఎవరూ నోరుమెదపలేదన్నమాట ధృతరాష్ట్రుడికీ తగిలేదే. (ఉద్యో.3,198) ధృతరాష్ట్రుడు ప్రక్కన ఉంటే కుంతి కూడా
ఇట్లా మాట్లాడటం కుదురుతుందా? ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ ఆ మాటలు యథార్థాలే కదా! అందుకే తిక్కన ధృతరాష్ట్రుడిని ఆ
సన్నివేశం నుండి తప్పించాడు. కాబట్టి యిక్కడి మాటలలో మూలానికీ తెలుగుకీ తేడా వస్తుంది. గాంధారీ ధృతరాష్ట్రు లిక్కడ
లేరు కాబట్టి వారు ధర్మరాజు చెప్పినట్లు చెయ్యుమని స్వయంగా కుంతితో (మూలంలోవలె) అనే వీలు లేదు. విదుర సంజయుల
చేత కబురు చేసినట్లు తెలుగులో కల్పనం, ధృడనిశ్చయం చేసికొన్న కుంతి ధృతరాష్ట్రుడి మాటను అతడి ముఖమ్మీద కాదనటంకంటె
కబురు తెచ్చిన విదుర సంజయులతో కా దనడంలో 'వారి పలుకులు వారించటం లో సౌకర్యమూ లభించింది. కుంతి నిర్ణయం
అంగీకరించి (సరే అడవులకు పొమ్మని) అందరూ వెళ్ళిపోయాక గాంధారీ ధృతరాష్ట్రులు కుంతిని వారించినట్లు మూలం. తెలుగులోని
మార్పు ఉచితం.
 

విశేషం లో క్లియర్ గా రాసాడు "మూలంలో గంధారి ద్రుతరాష్ట్రులు...." అని. దీని ప్రకారం చూస్తే బుక్ కూడా మూల భరతం కాదు.

Disclaimer: If I am criticizing this book that doesn’t I am  supporting bible or quran, both of them are equally bad books.

Posted

we are digging thousands of years back written scriptures/dharmas/prophesies and fighting over it

are they gonna reduce our taxes or improve our economy?

Posted
23 hours ago, socrates said:

we are digging thousands of years back written scriptures/dharmas/prophesies and fighting over it

are they gonna reduce our taxes or improve our economy?

I doubt that they are that old.  we are just discussing to get know actual truth. for me its just a little hobby to  know the true indian history nothing more than that. 

  • Thanks 1
Posted
On 1/5/2025 at 11:37 PM, The_Mentalist said:

Grow up uncle

20 rounds aadali thats the rule… 

and no 1 till date cheated in joodham first one was kauravas

pandavas won before just got some silly necklaces from kauravas… they didn’t take entire kingdom so they have to bet kids and wives

aak thelvadhi fook thelvadhi prathodu bharatam ni anude

read moola bharatam or just shut it

188

తాత్సర్యం: అంతేకాక ధర్మరాజుపట్ట (పేమ కలవాడై విరాటుడు రెండువేల ఏనుగులను ఇచ్చాడు. (ద్రుపదుడు వెయ్యి ఏనుగులను, పదివేల గుర్రాలను, పద్నాలుగువేలమంది వేశ్యలను, పదివేల దాసీకుటుంబాలవాళ్ళను ఇచ్చాడు. కురు, కుకుర ఉలూకాది దేశ ప్రభువులు, ప్రాగ్బోతిష దేశాధిపతి భగదత్తుడు, మరుకచ్చ నివాసులు, చేది దేశరాజులు పేరుపొందిన ఆజానేయ బాహ్లిక హూణ పారసీక దేశాల గుర్రాలను, కొండలతో సమానాలైన మదపుటేనుగులను, మంచి వస్త్రాలతో, సొమ్ములతో అలంకరించబడిన వేలకొలది (స్త్రీలను, లెక్కకు మిక్కిలిగా మేకలను, గొర్రెలను, ఆవులను, (రైలను, బంగారు, రత్నాలు, వెండి, కంబళ్ళు, వస్త్రాలు మొదలయిన వాటిని ఇచ్చారు. అంతేగాక మేరు మందర పర్వతాల మధ్య ఉండే సన్నవెదుళ్ళ అడవుల్లో నివసించే గుళింద, పారద, బర్భర, తురుష్క, టెంకణ, కోంకణ దేశప్రభువులు లొంగిపోయినవాళ్ళయి హిమశైల, రామశైల, కురుదేశాల్లోని పూలతేనెతో కూడిన పాత్రలను, మంచి మందులను, ఇం[ద్రనీలమణి, ఆరుదద్రపురుగు, కోకిల, చంద్రుడు, నెమలి, చిలుకరంగులు గల గుర్రాలను, బంగారు మయాలై పట్టుపురుగువంటి పురుగులనుండి పుట్టిన పట్టు వంటి మెత్తని పదార్థంతో, చెట్లబెరడులనుండి పుట్టిన మెత్తని పదార్థంతో, గ్రుడ్డునుండి పుట్టిన పక్షుల ఈకలవంటి మెత్తని పదార్థంతో రూపొందించిన పాన్సులను, వాడిగల, పొడవైన ఖడ్డాలను, మణులు బంగారు పొదుగబడిన ఏనుగుదంతాలతో రూపొందించిన పల్లకీలను, పీఠాలను ఇచ్చారు. దేవేంద్రుడి స్నేహితుడైన గంధర్వరాజు చిత్రరథుడు నాలుగు వందల గంధర్వజాతి గుర్రాలను ఇచ్చాడు. తుంబురుడనే గంధర్వుడు వంద గుర్రాలను ఇచ్చాడు.

విశేషం: బహుశః లోకంలో దుర్యోధనుని వంటి ఈర్భాగ్రస్తులే దాయాదుల ఐశ్వర్యాన్ని ఇంతగా లెక్కించి గుర్తుంచుకోగలరేమో! దేశాల పేర్ల విషయంలో కొన్ని ప్రతుల్లో భేదాలున్నాయి. ఆంధ్ర కేరళ తురుష్కరాజులు ఆకాలంలో ఉన్నారా? ఇవి నన్నయ చేర్చినవే. మూలంలో లేవు. (ధర్మరాజుకు కానుకలుగా వచ్చిన వివరాలను రాజసూయం జరిగిన ఘట్టంలో వివరించకుండా దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి నివేదించటంలో కథాకథన శిల్పం ఉంది. అప్పుడు చెప్పినట్టైతే వివరాలు కథలో మునిగిపోయేవి.  ఇప్పుడు చెప్పటంవల్ల దుర్యోధనుని అసూయకు గల బలమైన హేతువును చెప్పినట్టయింది. ధర్మరాజు కావాలని దుర్యోధనునికి  బహుమతులను స్వీకరించే బాధ్యత ఎందుకు ఇచ్చాడో తేటతెల్లమయింది. ఆత్మీయుడైతే దుర్యోధనుడు సంపదను చూచి హర్షించేవాడు. దాయాది, అసూయాగ్రస్తుడు కావటంచేత భరించలేకపోతున్నాడు. వివరాలవల్ల పాండవుల జొన్నత్యం, దుర్యోధనుని దుష్టత్వం ధ్వనిస్తున్నాయి. మరొక విశేషం - ధర్మరాజు మాయాద్యూతంలో సంపదలను కోల్పోయినప్పుడు నివఠాలు ఇవ్వవలసిన అవసరంకూడా తప్పింది. ఇదంతా నన్నయ కథను చెప్పటంలో సాధించిన అర్థసంయోజనం. -సంపా.)

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...