Jump to content

Recommended Posts

Posted

HMPV- బెంగళూరులో హెచ్ఎంపీవీ కేసులు... ఐసీఎంఆర్ స్పందన 

06-01-2025 Mon 18:25 | National
ICMR responds on HMPV Circulation in India
 

 

  • ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోన్న మరో వైరస్
  • బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్
  • హెచ్ఎంపీవీని ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధంగా ఉందన్న ఐసీఎంఆర్
కరోనా మహమ్మారి దెబ్బకు హడలిపోయిన ప్రపంచ దేశాలను మరో వైరస్ కలవరపెడుతోంది. దాని పేరు హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమా వైరస్). చైనాలో ఈ వైరస్ తీవ్రస్థాయిలో ప్రబలుతోందంటూ ఇటీవల కథనాలు వచ్చాయి. 

తాజాగా, భారత్ లోనూ హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేగింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆసక్తికరంగా స్పందించింది. ప్రపంచ దేశాల్లోనే కాకుండా, భారత్ లోనూ ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని వెల్లడించింది. 

అయితే, ఇటువంటి శ్వాస సంబంధిత అనారోగ్యాలను ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. హెచ్ఎంపీవీ సోకిన వారిలో ప్రధానంగా శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నట్టు ఇతర దేశాల్లో నమోదైన కేసుల ద్వారా అర్థమవుతోందని పేర్కొంది. తమ వద్ద అందుబాటులో ఉన్న డేటా మేరకు భయాందోళనలు కలిగించే స్థాయిలో పరిస్థితులేమీ లేవని ఐసీఎంఆర్ వెల్లడించింది. 

హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని వైపుల నుంచి పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని తెలిపింది. తాము కూడా ఏడాది పొడవునా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ఓ కన్నేసి ఉంచుతామని పేర్కొంది.
Posted

HMPV Virus: హెచ్ఎంపీవీ కేసులు... అధికారులకు ఢిల్లీ మంత్రి కీలక ఆదేశాలు 

06-01-2025 Mon 16:49 | National
Delhi mandates isolation directs hospitals to report suspected HMPV cases
 

 

  • వైరస్ వ్యాప్తి చెందితే తీసుకోవాల్సిన చర్యలపై అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రులకు ఆదేశాలు
  • కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరపాలని ఢిల్లీ ఆరోగ్య శాఖకు ఆదేశం
  • వైరస్ విషయంలో ఆదేశాలు, సూచనల కోసం ఫోన్లో సంప్రదించవచ్చునని సూచన
దేశంలోని రెండు రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో రెండు, గుజరాత్‌లో ఒకటి నమోదైంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్‌ఎంపీవీ విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆదేశాలు జారీ చేశారు.

ఒకవేళ హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందితే తీసుకోవాల్సిన చర్యలపై అన్ని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి భరద్వాజ్ సూచించారు. ఈ వైరస్ కట్టడికి సంబంధించిన అంశాలపై ఢిల్లీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరపాలన్నారు.

ఈ హెచ్ఎంపీవీ వైరస్‌కు సంబంధించి ఎలాంటి ఎలాంటి కొత్త విషయాలు తెలిసినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎలాంటి ఆదేశాలు, సూచనలు కావాలన్నా తనను వెంటనే ఫోన్లో సంప్రదించవచ్చన్నారు. ప్రతిరోజు మూడు ఆసుపత్రులను తనిఖీ చేసి సంబంధిత నివేదికలను తనకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.
Posted

Stock Market: చైనా హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం... రూ.12 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి 

06-01-2025 Mon 17:22 | Business
Investors Lose Rs 12 Lakh Crore As Sensex Slumps Over 1200 Points
 

 

  • భారత్‌లో మూడు హెచ్ఎంపీవీ కేసులు నమోదు
  • మార్కెట్‌పై ప్రభావం చూపిన వైరస్
  • ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు
చైనాలో పుట్టిన హెచ్ఎంపీవీ వైరస్ కేసులు భారత్‌లో నమోదు కావడంతో స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. మన దేశంలో మూడు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. అన్ని రంగాలు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. వైరస్‌కు తోడు ఆసియా మార్కెట్ నుంచి బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు భారీ నష్టాలను మిగిల్చాయి.

మార్కెట్ భారీ నష్టాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెట్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ దాదాపు రూ.12 లక్షల కోట్ల మేర క్షీణించింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ రూ.439 లక్షల కోట్లకు తగ్గింది. హెచ్ఎంపీవీ వైరస్‌కు తోడు ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాల ప్రభావంతో అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిశాయి.

పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగం 4 శాతం, మెటల్, రియాల్టీ, ఎనర్జీ, పీఎస్‌యూ, పవర్, ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ రంగాలు 3 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.4 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 3 శాతం నష్టపోయాయి.
Posted

HMPV: దేశంలో మూడో హెచ్ఎంపీవీ కేసు నమోదు... ఈసారి గుజరాత్ లో! 

06-01-2025 Mon 19:56 | National
Third HMPV case identified in Gujarat
 

 

  • బెంగళూరులో తొలుత రెండు పాజిటివ్ కేసులు
  • తాజాగా గుజరాత్ లో మరో కేసు
  • ముగ్గురూ చిన్నారులే!
చైనాలో విస్తృతంగా ప్రబలుతున్నట్టు భావిస్తున్న హ్యూమన్ మెటాన్యూమా వైరస్ వ్యాప్తి భారత్ లోనూ మొదలైంది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ నిర్ధారణ కాగా, తాజాగా గుజరాత్ లోనూ ఓ చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్టు వెల్లడైంది. దాంతో, భారత్ లో హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. 

కర్ణాటకలో మూడు నెలల పసికందుకు, ఆరు నెలల బాబుకు హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణ అయింది. ఆరు నెలల బాలుడు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేస్తే హెచ్ఎంపీవీ వైరస్ అని తేలింది. 

ఇక, గుజరాత్ లోనూ ఓ చిన్నారి ఈ వైరస్ బారినపడ్డాడు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న రెండు నెలల పసిబిడ్డను గత డిసెంబరు 24న అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. 

కాగా, అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం... హెచ్ఎంపీవీ వైరస్ ఎగువ, దిగువ శ్వాసకోశ వ్యవస్థల్లో ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. దాంతో, ఇది చూడ్డానికి ఫ్లూ, సాధారణ జలుబు లాగానే అనిపిస్తుంది.
Posted

HMPV: హెచ్ఎంపీవీ వైరస్... అప్రమత్తమైన ఏపీ... చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ 

06-01-2025 Mon 21:34 | Andhra
Chandrababu tele conference on HMPV
 

 

  • కర్ణాటక, గుజరాత్‌లో హెచ్ఎంపీవీ కేసులు
  • వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్
  • ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
  • ఏపీలో కేసులు నమోదు కాలేదని వెల్లడి
హెచ్ఎంపీవీ వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హెచ్ఎంపీవీ వైరస్ కేసులపై ఆయన అధికారులను అడిగారు. అయితే ఏపీలో ఎలాంటి అనుమానిత కేసులు నమోదు కాలేదని అధికారులు సీఎంకు తెలిపారు.

కర్ణాటకలో, గుజరాత్‌లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పటి వరకు ఒక్కటి కూడా నమోదు కాలేదని అధికారులు... సీఎంకు తెలిపారు. రాష్ట్రానికి వచ్చి వెళ్లే వారిపై దృష్టి పెట్టాలని, అనుమానం ఉంటే పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో సీఎంతో పాటు మంత్రి మంత్రి సత్యకుమార్, వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...