psycopk Posted January 18 Report Posted January 18 NTR: నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. వీడియో ఇదిగో! 18-01-2025 Sat 08:07 | Entertainment ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు. మరికాసేపట్లో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేశ్ తదితరులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళి అర్పించనున్నారు. అలాగే, బసవతారకం ఆసుపత్రిలోనూ బాలకృష్ణ నివాళులు అర్పిస్తారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 1 Quote
psycopk Posted January 18 Author Report Posted January 18 Chandrababu: ఎన్టీఆర్ ఒక పేరు కాదు.. ప్రభంజనం: చంద్రబాబు, లోకేశ్ 18-01-2025 Sat 10:22 | Andhra ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన చంద్రబాబు నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపారన్న బాబు ఎన్టీఆర్ తెలుగువాడి విశ్వరూపం అన్న లోకేశ్ టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ... నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసింది ఎన్టీఆరే అని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది అని కొనియాడారు. స్త్రీలకు సాధికారతను ఇచ్చిన సంస్కర్త అని అన్నారు. స్వర్గీయ తారక రామరావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడి స్మృతికి నివాళి అర్పిద్దామని చెప్పారు. మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ... ఎన్టీఆర్ ఒక పేరు కాదు, ఒక ప్రభంజనం అని అన్నారు. ఎన్టీఆర్ ఒక సంచలనం, తెలుగువాడి విశ్వరూపం అని చెప్పారు. వెండితెరపై రారాజుగా వెలుగొందారని, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని నినదించారని చెప్పారు. కోట్లాది మంది హృదయాల్లో కొలువైన తన తాతగారే తనకు నిత్యస్ఫూర్తి అని అన్నారు. 1 Quote
psycopk Posted January 18 Author Report Posted January 18 Balakrishna: ఎన్టీఆర్తోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం: బాలకృష్ణ 18-01-2025 Sat 10:51 | Both States ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా బాలకృష్ణ నివాళులు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన బాలయ్య నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని ప్రశంస ప్రజల వద్దకు పాలన కోసం ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని వ్యాఖ్య తన తండ్రి ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతో పాటు రామకృష్ణ, నందమూరి సుహాసిని, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని పేర్కొన్నారు.పేదల కోసం టీడీపీని స్థాపించారని, ఆయనతోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చిందని బాలయ్య గుర్తు చేశారు. ప్రజల వద్దకు పాలన కోసం ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని తెలిపారు. తెలుగు రాజకీయాలు ఎన్టీఆర్‌కు ముందు.. తర్వాత అనే విధంగా మారాయని కొనియాడారు. ఇప్పటికీ ఆయన తెచ్చిన పథకాలనే ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, వివిధ వర్గాలకు ఎన్టీఆర్ దైవ సమానంగా నిలిచారని చెప్పారు. మద్రాసు నగరానికి మంచి నీళ్ళిచ్చిన మహానభావుడు ఎన్టీఆర్ అని అన్నారు. కార్యకర్తలను నాయకులుగా తయారుచేసింది కూడా ఎన్టీఆర్ మాత్రమేనని బాలయ్య చెప్పుకొచ్చారు. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.