psycopk Posted January 25 Author Report Posted January 25 Palla Srinivasa Rao: వైసీపీ దివాళా తీయడం ఖాయం.. ఏ2 రాజీనామా చేయడమే దీనికి నిదర్శనం: పల్లా శ్రీనివాస్ 25-01-2025 Sat 13:23 | Andhra విజయసాయి లాంటి వాళ్లు ఆర్థిక ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉందన్న పల్లా శ్రీనివాస్ తప్పులన్నీ చేసి తప్పించుకుంటానంటే కుదరదని వ్యాఖ్య చేసిన తప్పులకు చట్ట పరంగా చర్యలు ఉంటాయన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందిస్తూ... విజయసాయి రెడ్డి లాంటి ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల్లో ఉంటే... వారు ఆర్థిక ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చేయాల్సిన తప్పులన్నీ చేసి తప్పించుకుంటానంటే కుదరదని శ్రీనివాస్ అన్నారు. చేసిన తప్పులకు చట్ట పరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని, పవన్ కల్యాణ్ తో ఎప్పటి నుంచో పరిచయం ఉందని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ కూడా ఆర్థిక నేరారోపణలు ఉన్న వ్యక్తేనని చెప్పారు. రానున్న రోజుల్లో వైసీపీ దివాళా తీయడం ఖాయమని... దీనికి నిదర్శనం ఏ2 రాజీనామా చేయడమేనని అన్నారు. Quote
psycopk Posted January 25 Author Report Posted January 25 Gurumurthy: సమస్యలు ఉంటే చర్చించుకుందామని విజయసాయి రెడ్డికి చెప్పాను: వైసీపీ ఎంపీ గురుమూర్తి 25-01-2025 Sat 13:19 | Andhra రాజీనామా చేయవద్దని విజయసాయిని కోరానన్న గురుమూర్తి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో విజయసాయి చెప్పడం లేదని వెల్లడి పార్టీలోకి మళ్లీ తిరిగి రావాలని కోరానన్న వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ కడ్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. రాజ్యసభ ఛైర్మన్ ను కలవడానికి ముందే విజయసాయి నివాసానికి వెళ్లి అయనను కలిశారు వైసీపీ ఎంపీ గురుమూర్తి. ఈ సందర్భంగా మీడియాతో గురుమూర్తి మాట్లాడుతూ... రాజీనామా చేయవద్దని విజయసాయిని తాను కోరానని చెప్పారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో విజయసాయి చెప్పడం లేదని తెలిపారు. ఏవైనా చిన్నిచిన్ని లోపాలు, సమస్యలు ఉంటే చర్చించుకుని పరిష్కరించుకుందామని చెప్పానని వెల్లడించారు. 2029 ఎన్నికల్లో అందరం కలిసి పోటీ చేసేందుకు సమాయత్తమవుదామని చెప్పానని తెలిపారు. పార్టీలోకి తిరిగి రావాలని, రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పారు. Quote
psycopk Posted January 25 Author Report Posted January 25 Ganta Srinivasa Rao: విజయసాయి రాజీనామా చేసి బయటకు వెళ్లినా చట్టం నుంచి తప్పించుకోలేరు: గంటా శ్రీనివాసరావు 25-01-2025 Sat 12:50 | Andhra విజయసాయి హయాంలో విశాఖ వాసులు పడిన ఇబ్బందులను మర్చిపోలేమన్న మాజీ మంత్రి వైసీపీ మునిగిపోయే నావ అని తాను ఎప్పుడో చెప్పానని వ్యాఖ్య ఇప్పుడు అది నిజం అవుతుందన్న గంటా శ్రీనివాసరావు వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, విజయసాయి రాజీనామా అంశంపై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. విజయసాయి రాజీనామా చేసి బయటకు వెళ్లినా చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఆయన హయాంలో విశాఖపట్నం వాసులు పడిన ఇక్కట్లు, వారి విధ్వంసం, వారిపై దాడులను మర్చిపోలేమని పేర్కొన్నారు. ఇక వైసీపీ మునిగిపోయే నావ అని తాను ఎప్పుడో చెప్పానని, ఇప్పడు అది నిజం అవుతుందని గంటా అన్నారు. వైసీపీ నేతలు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ విషయంలో ఇప్పటికీ ఇంకా వక్రంగానే మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. వారి విధ్వంసం వల్ల పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నారని తెలిపారు. దావోస్‌లో పారిశ్రామివేత్తల్లో నమ్మకం నిలిపి ఏపీ బ్రాండ్‌ను సీఎం చంద్రబాబు వివరించారని గంటా శ్రీనివాసరావు చెప్పారు. Quote
psycopk Posted January 25 Author Report Posted January 25 Vijayasai Reddy: రాజీనామాకు కారణం వ్యక్తిగతమే.. విజయసాయి రెడ్డి స్పష్టీకరణ 25-01-2025 Sat 12:31 | Andhra జగన్ తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశానన్న మాజీ ఎంపీ తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారని వెల్లడి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని వివరణ పదవుల కోసమో, కేసుల మాఫీ కోసమో తాను ఎంపీ పదవికి రాజీనామా చేయలేదని మాజీ ఎంపీ, వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కారణం పూర్తిగా వ్యక్తిగతమని వివరణ ఇచ్చారు. దైవాన్ని నమ్మే వ్యక్తిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం తనకు తెలియదన్నారు. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని, దేనికీ ఎవరికీ భయపడబోనని తేల్చిచెప్పారు. శనివారం ఉదయం రాజ్యసభ చైర్మన్ (ఉపరాష్ట్రపతి)కి రాజీనామా పత్రం అందించానని, ఆయన ఆమోదం తెలిపారని విజయసాయి రెడ్డి తెలిపారు. రాజీనామా గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో ఫోన్ లో మాట్లాడానని చెప్పారు. అన్నీ వివరంగా మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. వైఎస్ కుటుంబంతో తనకు మూడు తరాలుగా అనుబంధం ఉందని గుర్తుచేశారు. వైఎస్ కుటుంబంతో తనకు ఎన్నడూ విభేదాలు లేవని, ఆ కుటుంబానికి తాను ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. నిరంతరం తాను పార్టీ కోసమే పనిచేశానని చెప్పారు. తన రాజీనామాపై జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆపాలని విజయసాయి రెడ్డి మీడియాకు విజ్ఞప్తి చేశారు. కేవీ రావుతో తనకెలాంటి పరిచయం లేదని, ఎక్కడైనా ఎదురుపడితే నమస్కారం అంటే నమస్కారం అని పలకరించుకోవడం వరకేనని తెలిపారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన రోజులు వేరు.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి, పార్టీకి తాను న్యాయం చేయలేననే భావనతోనే రాజీనామా చేశానని చెప్పారు. తనకన్నా మెరుగ్గా పనిచేసే నేత తన స్థానంలోకి వస్తే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశమే తప్ప వేరే కారణంలేదన్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో నమోదైన కేసులో ఈడీ తనను ఏ2 గా చేర్చించిందని చెప్పారు. ఆ కేసును తాను చట్టపరంగానే డీల్ చేస్తానని వివరించారు. ‘నా పిల్లల సాక్షిగా చెబుతున్నా.. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో నాకు సంబంధం లేదు’ అని అన్నారు. ప్రస్తుతం తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేశానని, వైసీపీ పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదని తెలిపారు. నేడో రేపో పార్టీకి కూడా రాజీనామా చేస్తానని విజయసాయి రెడ్డి వివరించారు. బెంగళూరులో ఒక ఇల్లు, విజయవాడలో ఉన్న రెండు ఇళ్లల్లో ఒకటి మాత్రమే తనదని, విశాఖపట్నంలో ఓ అపార్ట్ మెంట్ ఉందని.. ఇవికాకుండా తనకు ఎలాంటి ఆస్తులు లేవని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. Quote
psycopk Posted January 25 Author Report Posted January 25 Budda Venkanna: జగన్ రెడ్డి, విజయసాయి కలిసి ఆడుతున్న డ్రామా ఇది: బుద్దా 25-01-2025 Sat 11:46 | Andhra ఎక్స్ వేదికగా విజయసాయిపై మండిపడ్డ బుద్దా వెంకన్న చంద్రబాబుతో విభేదాలు లేవంటే ప్రజలు నమ్మేంత పిచ్చోళ్లు కాదన్న బుద్దా కేసులు పక్కదారి పట్టించడానికి ఆడుతున్న నాటకంగా అభివర్ణించిన బుద్దా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. విజయసాయి రాజీనామా అంశంపై ఇటు అధికార టీడీపీ, అటు ప్రతిపక్ష వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఇది జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. జగన్ కు తెలిసే అంతా జరుగుతుందన్నారు. వీళ్లిద్దరి కేసులు పక్కదారి పట్టించడానికి ఆడుతున్న నాటకం ఇదంతా అని ఎక్స్ వేదికగా విమర్శించారు. చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవు అని విజయసాయి అంటే నమ్మేంత పిచ్చోళ్లు ప్రజలు కాదని అన్నారు. చంద్రబాబును విజయసాయి అన్న ప్రతి మాట తమకు ఇంకా గుర్తుందని అన్నారు. చేసినవి అన్నీ చేసి ఈ రోజు రాజీనామా చేసి వెళ్లిపోతా అంటే కుదరదన్నారు. మీరు చేసిన భూకబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో నువ్వు చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాలన్నారు. విజయసాయిరెడ్డికి దేశం విడిచి వెళ్లడానికి సీబీఐ అనుమతి ఇవ్వకూడదని బుద్దా విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుని, ఆయన కుటుంబ సభ్యులను విజయసాయిరెడ్డి అన్న మాటలు ఎవరు మర్చిపోయినా నేను మరచిపోనని బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయి ఎన్ని నాటకాలు ఆడినా ఎవరు క్షమించినా తాను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. Quote
psycopk Posted January 25 Author Report Posted January 25 Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామా అంశం.. ఢిల్లీకి పిల్లి సుభాష్ చంద్రబోస్ 25-01-2025 Sat 11:09 | Andhra రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయసాయి ప్రకటన ఒత్తిడితో రాజీనామా చేస్తానని చెప్పి ఉండొచ్చన్న సుభాష్ చంద్రబోస్ వ్యాపారాలు ఉన్నవారికి ఒత్తిడి ఉంటుందని వ్యాఖ్య రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు. తన నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి లేదని, ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. ఇకపై వ్యవసాయం చూసుకుంటానని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆదేశాలతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. ఆయన మాట్లాడుతూ... ఒత్తిడితోనే రాజీనామా చేస్తానని విజయసాయి చెప్పి ఉండొచ్చని అన్నారు. వ్యాపారాలు ఉన్నవారికి ఒత్తిడి ఉంటుందని చెప్పారు. Quote
Anta Assamey Posted January 25 Report Posted January 25 1 hour ago, psycopk said: Avinash gadi bend teyandi antunada?? Avinash pakkana unna vyakthi cheppadu... Aa vyakthi evado 1 Quote
psycopk Posted January 25 Author Report Posted January 25 29 minutes ago, Anta Assamey said: Avinash pakkana unna vyakthi cheppadu... Aa vyakthi evado https://www.instagram.com/reel/DFP7H-byaDX/?igsh=MWNxN2RoeHh0a2JmZQ== Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.