psycopk Posted January 24 Author Report Posted January 24 So far these are popular-- 1) Sesha jeevitha shanthi and varasudu tho gadapatam. 2) bharathi and jagan attrocities takukoleka ee daridrudiki enta dooram ga unte anta better ani side aaipoyadu 3) BJP lo cherataniki idi first move... 4) jagan wants to merge his party with congress... sai reddy opposed this before.. nuvvu enta nee bratuku enta ani belt tesina anna.. 5) sajjala debba sai reddy abba... edu waste ani prove cheyatanike sajja made him contest and lost disastorusly edi emaina... needu chesina penta.. darunalu ki samdhanam chepi terali... Quote
psycopk Posted January 24 Author Report Posted January 24 Vijayasai Reddy: ఇక ఢిల్లీలో వైసీపీ పనైపోయింది: విజయసాయి ప్రకటనపై రఘురామ స్పందన 24-01-2025 Fri 22:57 | Andhra రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయసాయి ప్రకటన ఈ నిర్ణయం బాధాకరమన్న రఘురామ తనకు తెలిసి విజయసాయి నెమ్మదస్తుడు అని వెల్లడి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం ప్రకటనపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. రఘురామ ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ, ఒక అరగంట క్రితమే ఈ వార్త చూశానని వెల్లడించారు. నిజాయతీగా చెప్పాలంటే, ఈ వార్త వినగానే మొదట బాధపడ్డానని తెలిపారు. ఎందుకు అనేది తాను చెప్పలేనని అన్నారు. గతంలో తాము అనేక సార్లు దెబ్బలాడుకున్న సందర్భాలు ఉన్నాయని రఘురామ తెలిపారు. విజయసాయి టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉందని, ఆయన స్వభావరీత్యా చాలా నెమ్మదస్తుడు అని వివరించారు. రాజకీయాలు అన్న తర్వాత ఏదో మాట్లాడతాం కానీ, నాకు తెలిసినంతవరకు విజయసాయి చెడ్డవాడు కాదు... మరి దుష్టుడి సహవాసంలో కొన్ని తప్పులు చేయవలసి వచ్చిందేమో అని వ్యాఖ్యానించారు. "నేను కూడా ఆ పార్టీలో ఉండి బయటికొచ్చాను. కొంతమంది నాలాగా ఆర్నెల్లలోనే బయటపడగలరు... కొంతమంది అలా బయటపడలేరు. 2014-19 మధ్య పార్టీ కోసం విజయసాయి సొంతంగా ఖర్చు పెట్టారు. మద్రాస్ లో తన ఇంటిని, ఆఫీసును కూడా అమ్ముకున్నారు. అవి మనకు తెలిసినోళ్లే కొన్నారు. ఢిల్లీలో ఆయన కీ రోల్ పోషించారు. సాయిరెడ్డి ఢిల్లీలో తనదైన ముద్ర వేశారు. నా దృష్టిలో ఇక ఢిల్లీలో వైసీపీ లేనట్టే" అని రఘురామ స్పష్టం చేశారు. ఈ క్రమంలో, సదరు మీడియా చానల్ ప్రతినిధి స్పందిస్తూ... అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా ప్రకటన చేశారని చెప్పగానే.... ఆయన కూడానా అంటూ రఘురామ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన కూడా లేరంటే... ఇక వైసీపీ పనైపోయినట్టే అని రఘురామ వ్యాఖ్యానించారు. "పార్లమెంటు సమావేశాలప్పుడు అప్పుడప్పుడు విజయసాయి, నేను ఎదురుపడితే కనీసం ఒక చిరునవ్వు ఉండేది. రాజకీయ పక్షాల పరంగా వేర్వేరు అయినప్పటికీ, మా మధ్య తీవ్రస్థాయి వైరం మాత్రం లేదు" అని రఘురామ వివరించారు. Quote
psycopk Posted January 24 Author Report Posted January 24 Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారడం ఖాయం: బీటెక్ రవి 24-01-2025 Fri 22:27 | Andhra రాజకీయాలకు వీడ్కోలు పలికిన విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించిన బీటెక్ రవి జగన్ డిస్ క్వాలిఫై కావడం ఖాయమని వెల్లడి పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక తథ్యమని వ్యాఖ్యలు వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం పట్ల టీడీపీ నేత బీటెక్ రవి స్పందించారు. రాజకీయాలకు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని తెలిపారు. విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారడం ఖాయమని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడడం ఖాయమని, పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం తథ్యమని పేర్కొన్నారు. ఈ మేరకు బీటెక్ రవి ట్వీట్ చేశారు. ఇవాళ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో జగన్ తర్వాత అగ్రనేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి గల కారణాలను తలోరకంగా చర్చించుకుంటున్నారు. ఆయన ఏ పార్టీలో చేరబోవడంలేదని ప్రకటించడం కూడా ఆసక్తికరంగా మారింది. Quote
psycopk Posted January 24 Author Report Posted January 24 Vijayasai Reddy: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి... సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ 24-01-2025 Fri 21:58 | Andhra ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు విజయసాయి ఫారెన్ ట్రిప్ నార్వే, ఫ్రాన్స్ వెళుతున్న వైనం జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని, అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డి కూడా నిందితుడు అని తెలిసిందే. ఆయన బెయిల్ పై బయటున్నారు. దాంతో, విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో... తాను నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ నేడు పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు తన విదేశీ పర్యటన ఉందని, అనుమతించాలని కోర్టును కోరారు. జగన్ ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ స్పందన కోసం తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 27కి వాయిదా వేసింది. కాగా, విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. Quote
psycopk Posted January 24 Author Report Posted January 24 Sajjala Ramakrishna Reddy: విషప్రచారాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సజ్జల 24-01-2025 Fri 20:55 | Andhra వైసీపీ కార్యాలయంలో మీడియా కమ్యూనికేషన్స్ వర్క్ షాప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సజ్జల టీడీపీకి మీడియాలో ఓ వర్గం అండ ఉందని వ్యాఖ్యలు దుష్ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపు ఇవాళ వైసీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. మీడియా కమ్యూనికేషన్స్ అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. వర్క్ షాప్ ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ రాజకీయ పార్టీ చేయనంత గొప్పగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసిందని అన్నారు. అయితే, చేసిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందని స్పష్టం చేశారు. అ దే సమయంలో, తాజా పరిణామాలపై నేతలు అవగాహన పెంచుకోవాలని సజ్జల సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏంచేస్తుందో గమనించాలని తెలిపారు. సమర్థ వాదనతో ప్రజల్లో సానుకూలత సంపాదించాలని, ప్రభుత్వ విష ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు కూడా పార్టీలో ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని అన్నారు. 2019లో కూడా వైసీపీకి వ్యతిరేకంగా మీడియాలో ఓ వర్గం వ్యతిరేకంగా భారీ ఎత్తున దుష్ప్రచారం చేసిందని, అయినా కూడా పార్టీ అధికారంలోకి వచ్చిందని సజ్జల గుర్తుచేశారు. టీడీపీ పూర్తిగా మీడియా ప్రచారం అండతోనే నడుస్తోందని, ఆ పార్టీకి కొంత బలమైన అనుకూల మీడియా మద్దతు ఉందని పేర్కొన్నారు. దాంతో అబద్ధాలను కూడా వేగంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అనుకూల మీడియాలో కనిపించేదంతా నిజం కాదని మనం గ్రహించాలని, ఆ ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని వైసీపీ శ్రేణులకు సజ్జల పిలుపునిచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీడియా, సోషల్ మీడియాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలకు ఇంకా చేరువ కావడంపై దృష్టి పెట్టాలనిసూచించారు. పార్టీలో కొత్తగా పదవులు స్వీకరించిన వారు, బాధ్యతలు చేపట్టిన వారు తమ ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల ముందు, వివిధ శక్తుల ముందు తమ వాదనను సమర్థంగా వినిపించాలని అన్నారు. అందుకోసం అవసరమైన ప్రోత్సాహాన్ని, సమాచారాన్ని, విధానాలను అందించేందుకు నేటి మీడియా కమ్యూనికేషన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని సజ్జల వివరించారు. Quote
psycopk Posted January 24 Author Report Posted January 24 Kodali Nani: తాను రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన కొడాలి నాని 24-01-2025 Fri 21:37 | Andhra ఇవాళ రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, అయోధ్య రామిరెడ్డి అదే బాటలో కొడాలి నాని అంటూ వార్తలు అది ఫేక్ పోస్టు అంటూ స్పష్టం చేసిన కొడాలి నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి చేసిన సంచలన ప్రకటనల నుంచి తేరుకోకముందే... కొడాలి నాని కూడా గుడ్ బై చెబుతున్నారంటూ వార్తలు రావడం కలకలం సృష్టించింది. అనారోగ్య కారణాల రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని కొడాలి నాని పేరిట ఉన్న ఓ ట్వీట్ ను ఉటంకిస్తూ... పలు మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. దీనిపై కొడాలి నాని స్పందించారు. తాను రాజీనామా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టు ఫేక్ అని స్పష్టం చేశారు. ఎడిట్ చేసిన తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఓ ప్రకటన చేశారు. ఫేక్ న్యూస్ పోస్టును కూడా పంచుకున్నారు. Quote
psycopk Posted January 24 Author Report Posted January 24 Bandla Ganesh: కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడమా?: విజయసాయిరెడ్డిపై బండ్ల గణేశ్ ట్వీట్ 24-01-2025 Fri 20:54 | Both States అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో వదిలేస్తున్నారని విమర్శ చాలామంది రాజకీయ నాయకులకు ఇది ఫ్యాషన్ అయిపోయిందని చురక విజయసాయిరెడ్డి ట్వీట్‌ను పేర్కొన్న బండ్ల గణేశ్ రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ఏపీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలివేయడం... వదిలి వెళ్లిపోవడం చాలామంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిందని విమర్శించారు. ఇది ధర్మమా? అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. కాగా, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, రేపు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని విజయసాయి రెడ్డి వెల్లడించారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, తన నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమన్నారు. జగన్‌కు మంచి జరగాలని ఆకాంక్షించారు. వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు. Quote
psycopk Posted January 25 Author Report Posted January 25 Vijayasai Reddy: ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదే.. టీడీపీ ఏపీ చీఫ్ పల్లా 25-01-2025 Sat 06:38 | Andhra విజయసాయి ప్రకటన వైసీపీ దివాలాకోరుతనానికి నిదర్శనమన్న పల్లా శ్రీనివాస్‌రావు రాజీనామాతో ఆయన చేసిన ఆర్థిక నేరాలు పోతాయనుకోవడం పొరపాటన్న పల్లా రాజకీయ నేతలకు ఇదొక గుణపాఠం కావాలని హెచ్చరిక విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రను దోచుకున్నారని, ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదేనని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విజయసాయి ప్రకటన వైసీపీ దివాలాకోరుతనానికి నిదర్శనమని పల్లా విమర్శించారు. ప్రజా సంక్షేమానికి పాటుపడలేని వారు రాజకీయాలకు స్వస్తి చెప్పడమే మంచిదని పేర్కొన్నారు. రాజీనామాతో ఆయన చేసిన ఆర్థిక నేరాలు పోతాయనుకోవడం పొరపాటని, రాజకీయ నేతలకు ఇదొక గుణపాఠం కావాలని ఆయన హెచ్చరించారు. కాగా, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయసాయి నిన్న చేసిన ప్రకటన రాజకీయాల్లో పెను సంచలనమైంది. ఆ ప్రకటన ప్రకారం నేడు ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఇకపై తాను ఏ పార్టీలోనూ చేరబోనని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. ఆయన పదవీ కాలం మరో మూడేళ్లు ఉండగానే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. Quote
psycopk Posted January 25 Author Report Posted January 25 MLA Somireddy Chandramohan Reddy: విజయసాయి రాజీనామా ప్రకటనపై సోమిరెడ్డి రియాక్షన్ 25-01-2025 Sat 07:01 | Andhra రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయి ప్రకటన ఈ ప్రకటన విచిత్రంగా ఉందన్న సోమిరెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్టా అని వ్యాఖ్య వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం ప్రకటనపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. ఎక్స్ వేదికగా సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందన్నారు. సేద్యం చేస్తానంటున్నావ్ .. దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా..? ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని ప్రశ్నించారు. 2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి ఏ 2 గా సకల పాపాలు చేశావని, గత ఐదేళ్లు అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండ్‌గా నిలిచి ఏ 2 స్థానాన్ని కొనసాగించావని విమర్శించారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్టా అని నిలదీశారు. ముందు అప్పుడు దోచుకున్న రూ.43 వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్‌తో కలిసి దోచేసిన లక్ష కోట్ల రూపాయల ప్రజల సొత్తు బయటపెట్టు. దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు. అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉందని అన్నారు. మొత్తంగా చూస్తే చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అంతేనా లేక నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ రాజీనామాల పరంపర ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్టు కూడా లేదని, రాత్రికో, రేపు రాత్రి లోపల మరో ఒకరిద్దరు సభ్యులు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కరలేదంటూ సోమిరెడ్డి ట్వీట్‌లో రాసుకొచ్చారు. Quote
psycopk Posted January 25 Author Report Posted January 25 Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డి రాజీనామా ఆమోదం 25-01-2025 Sat 16:50 | Andhra విజయసాయి రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్ రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్‌లో అందజేయడంతో వెంటనే ఆమోదం ఈ మేరకు బులెటిన్ విడుదల చేసిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ ఆమోదించారు. విజయసాయి తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్ లో అందజేయడంతో ఆ రాజీనామాను ఉప రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ బులెటిన్ విడుదల చేశారు. కాగా రాజీనామా చేసిన తరువాత విజయసాయి మీడియాతో మాట్లాడుతూ... పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేశానని అన్నారు. ఇక భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనని, పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్‌గా మారలేదని చెప్పిన విజయసాయి వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని పేర్కొన్నారు. అదే సమయంలో కేసుల నుంచి బయటపడడానికే తాను రాజీనామా చేశానంటూ వస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఎవరి చేతో కేసులు మాఫీ చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో తాను లేనని చెప్పారు. Quote
psycopk Posted January 25 Author Report Posted January 25 Chandrababu: విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు రియాక్షన్ 25-01-2025 Sat 16:38 | Andhra పార్టీపై నమ్మకం లేకపోతే ఎవరైనా వెళ్లిపోతారన్న చంద్రబాబు పార్టీ పరిస్థితి కూడా ముఖ్యమని వ్యాఖ్య ఇది వైసీపీ వ్యక్తిగత అంశమన్న సీఎం రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి స్పందించారు. దావోస్ పర్యటన వివరాలను వెల్లడించేందుకు ఈరోజు చంద్రబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయి రాజీనామా అంశాన్ని మీడియా ప్రతినిధులు లేవనెత్తగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా నమ్మకం ఉంటేనే పార్టీలో ఉంటారని... లేకపోతే వెళ్లిపోతారని చంద్రబాబు అన్నారు. పార్టీ పరిస్థితి కూడా చాలా ముఖ్యమని అన్నారు. ఇది వైసీపీ వ్యక్తిగత అంశమని చెప్పారు. వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేసిన పరిస్థితి ఏపీలో తప్ప దేశంలో మరెక్కడా లేదని అన్నారు. రాజకీయాల్లో ఉండేందుకు అర్హత లేని వ్యక్తులు వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. Quote
psycopk Posted January 25 Author Report Posted January 25 Vijayasai Reddy: వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని ఎందుకు చెప్పానంటే..: విజయసాయిరెడ్డి 25-01-2025 Sat 15:28 | Andhra వివేకా చనిపోయాడని తనకు ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడన్న విజయసాయిరెడ్డి అవినాశ్ కు ఫోన్ చేస్తే.. పక్కనున్న మరో వ్యక్తికి ఇచ్చారని వెల్లడి వివేకా గుండెపోటుతో చనిపోయారని పక్కనున్న వ్యక్తి చెప్పారన్న విజయసాయి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే... గుండెపోటుతో చనిపోయారని మీరెందుకు అబద్ధం చెప్పారని విజయసాయిని మీడియా ప్రశ్నించింది. దీనిపై విజయసాయి స్పందిస్తూ... వివేకా చనిపోయినట్టు ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి చెప్పాడని... వెంటనే తాను కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఫోన్ చేశానని తెలిపారు. అవినాశ్ రెడ్డి పక్కన ఉన్న మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారని... వివేకా గుండెపోటుతో చనిపోయారని సదరు వ్యక్తి తనకు చెప్పారని... అదే సమాచారాన్ని తాను మీడియాకు తెలియజేశానని విజయసాయి తెలిపారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని అవినాశ్ రెడ్డి మీకు చెప్పారా? అని ప్రశ్నించగా... ఈ విషయంపై గుచ్చిగుచ్చి అడగొద్దని కోరారు. తాను అవినాశ్ కు ఫోన్ చేసిన మాట నిజమని... అవినాశ్ పక్కనున్న వ్యక్తికి ఫోన్ ఇచ్చిన విషయం కూడా వాస్తవమని తెలిపారు. అవినాశ్ పక్కనున్న వ్యక్తి చెప్పిందే తాను మీడియాకు తెలిపానని అన్నారు. Quote
psycopk Posted January 25 Author Report Posted January 25 Vijayasai Reddy: జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని నాపై ఒత్తిడి చేశారు: విజయసాయి రెడ్డి 25-01-2025 Sat 14:48 | Andhra కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనపై కేసు నమోదు చేశారన్న విజయసాయి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారని వెల్లడి తన రాజీనామాతో కూటమికే లాభమని వ్యాఖ్య రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ కు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయసాయి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని తనపై ఎంతోమంది ఒత్తిడి చేశారని విజయసాయి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశంలో తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. తనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. కేవీ రావుతో తనకు సంబంధాలు లేవని చెప్పారు. విక్రాంత్ రెడ్డిని కేవీ రావు వద్దకు తాను పంపించలేదని అన్నారు. సీఐడీ తనను విచారణకు పిలవలేదని తెలిపారు. తన రాజీనామాతో కూటమికే లాభమని చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే తాను బలహీనుడిగా మారుతానని... అలాంటప్పుడు రాజీనామా చేస్తే తనను కేసుల నుంచి ఎందుకు తప్పిస్తారని ప్రశ్నించారు. న్యూస్ ఛానల్ పెట్టే అంశంపై పునరాలోచన చేస్తానని చెప్పారు. బెంగళూరు, విజయవాడలో ఒక్కొక్క ఇల్లు, వైజాగ్ లో ఒక అపార్ట్ మెంట్... ఇవే తన ఆస్తులని తెలిపారు. బీజేపీ ఎంపీ పదవి గురించి కానీ, గవర్నర్ పదవి గురించి కానీ తనకు ఎవరి నుంచి ఎలాంటి హామీలు లేవని చెప్పారు. Quote
psycopk Posted January 25 Author Report Posted January 25 1 minute ago, psycopk said: Vijayasai Reddy: వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని ఎందుకు చెప్పానంటే..: విజయసాయిరెడ్డి 25-01-2025 Sat 15:28 | Andhra వివేకా చనిపోయాడని తనకు ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడన్న విజయసాయిరెడ్డి అవినాశ్ కు ఫోన్ చేస్తే.. పక్కనున్న మరో వ్యక్తికి ఇచ్చారని వెల్లడి వివేకా గుండెపోటుతో చనిపోయారని పక్కనున్న వ్యక్తి చెప్పారన్న విజయసాయి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే... గుండెపోటుతో చనిపోయారని మీరెందుకు అబద్ధం చెప్పారని విజయసాయిని మీడియా ప్రశ్నించింది. దీనిపై విజయసాయి స్పందిస్తూ... వివేకా చనిపోయినట్టు ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి చెప్పాడని... వెంటనే తాను కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఫోన్ చేశానని తెలిపారు. అవినాశ్ రెడ్డి పక్కన ఉన్న మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారని... వివేకా గుండెపోటుతో చనిపోయారని సదరు వ్యక్తి తనకు చెప్పారని... అదే సమాచారాన్ని తాను మీడియాకు తెలియజేశానని విజయసాయి తెలిపారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని అవినాశ్ రెడ్డి మీకు చెప్పారా? అని ప్రశ్నించగా... ఈ విషయంపై గుచ్చిగుచ్చి అడగొద్దని కోరారు. తాను అవినాశ్ కు ఫోన్ చేసిన మాట నిజమని... అవినాశ్ పక్కనున్న వ్యక్తికి ఫోన్ ఇచ్చిన విషయం కూడా వాస్తవమని తెలిపారు. అవినాశ్ పక్కనున్న వ్యక్తి చెప్పిందే తాను మీడియాకు తెలిపానని అన్నారు. Avinash gadi bend teyandi antunada?? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.