Jump to content

Recommended Posts

Posted

The first & the only acting successor till date to have had completed 109 movies and 50+ years as an Actor in the history of WORLD CINEMA🙏

As a Hero,
As a Chairman,
As a Politician 
his commitment and dedication🙏

His Passion and dedication is unparalleled👏

#PadmaBhushanNBK

Posted

నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. దశాబ్దాలుగా కంటున్న కల నిజమయ్యింది. బాలకృష్ణకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బాలయ్య ఈ పురస్కారం అందుకోవడం ఫ్యాన్స్ కి చిరకాల జ్ఞాపకంగా నిలిచిపోనుంది. కళల విభాగంలో తెలుగు రాష్ట్రాల నుంచి పద్మభూషణ్ బాలకృష్ణ అందుకోనుండగా తమిళనాడు నుంచి అజిత్ కు అర్హత దక్కింది. ఇద్దరూ అగ్ర హీరోలే కావడం విశేషం.

 

తాతమ్మ కలతో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించాక తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ దర్శకత్వంలో ఆయనతో పాటు తెరను పంచుకుని ఆరితేరారు. సోలో హీరోగా 1984 లో సాహసమే జీవితంతో కెరీర్ మొదలుపెట్టారు. తొలి ఇండస్ట్రీ బ్రేక్ మంగమ్మ గారి మనవడుతో అందుకున్నాక వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. 

 

ముద్దుల మావయ్యతో మహిళా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాక లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్ లాంటి చిత్రాలు మాస్ లో బలమైన ఫాలోయింగ్ పెంచాయి. స్టార్ హీరోగా పీక్స్ చూస్తున్న టైంలోనే టాలీవుడ్ తొలి సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 చేసిన ఘనత బాలకృష్ణకే దక్కింది.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సమరసింహారెడ్డి చేసి పరిశ్రమకో కొత్త జానర్ ను పరిచయం చేసిన బాలయ్య వందకు పైగా సినిమాలతో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఫ్లాపులు పలకరిస్తున్న టైంలో సింహతో కంబ్యాక్ ఇచ్చి రికార్డుల వేట మొదలుపెట్టడం ఎవరూ మర్చిపోలేరు. తాజాగా డాకు మహారాజ్ తో వరసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ తో ఆరు పదుల వయసులోనూ దూకుడు మీదున్న బాలకృష్ణ హిందుపూర్ ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు ఎంపికై అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. 

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది రోగులకు జీవదానం చేస్తూ బుల్లితెరపై అన్ స్టాపబుల్ గా దూసుకుపోవడం ఆయనకే చెల్లింది. కళాకారులు ఆభరణంగా భావించే పద్మభూషణ్ బాలకృష్ణ కిరీటంలో చేరడం సినీ ప్రియులను ఆనందంలో ముంచెత్తుతోంది.

Posted

ఓ వైపు కెరీర్‌లో పీక్స్ అంటే ఏమిటో చూస్తున్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. వ‌రుస హిట్ల‌తో బాక్సాఫీసు బొనాంజాగా మారాడు. ఓటీటీ తెర‌పై `అన్ స్టాప‌బుల్‌`గా మారి విజృంభిస్తున్నాడు. ఇలాంటి ద‌శ‌లో ప్ర‌భుత్వ పుర‌స్కారం కూడా ద‌క్కింది. ఆ జోష్‌ని రెట్టింపు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ప‌ద్మభూష‌ణ్ ద‌క్కింది. ఇది బాల‌య్య అభిమానుల‌కే కాదు. తెలుగు చిత్ర‌సీమ‌కు, తెలుగు సినీ అభిమానుల‌కు, తెలుగువాళ్ల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.

దాదాపు 5 ద‌శాబ్దాల ప్ర‌యాణం బాల‌కృష్ణ‌ది. ఈ ప్ర‌యాణంలో ఎన్నో సూప‌ర్ హిట్ విజ‌యాల‌తో, ప‌రిశ్ర‌మ‌కు మూల‌స్థంభంగా నిలిచాడు. చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్ త‌రంతో పోటీ ప‌డుతూ, ఈత‌రానికీ త‌న‌దైన స్టైల్‌లో స‌వాల్ విసిరాడు బాల‌య్య‌. పెద్ద‌వాళ్లలో పెద్ద‌వాడిగా, కుర్రాళ్ల‌లో కుర్ర‌వాడిగా… ఆబాల గోపాలాన్నీ అల‌రించాడు బాల‌కృష్ణ‌. సీరియర్ హీరోల్లో బాలయ్య చేసిన‌న్ని ప్ర‌యోగాలు ఎవ‌రూ చేయ‌లేదు. చేయ‌బోరు కూడా. పౌరాణికం, సాంఘికం, జాన‌ప‌దం, సోషియో ఫాంట‌సీ, సైన్స్ ఫిక్ష‌న్‌, చారిత్ర‌కం.. ఇలా ఏ కోణాన్నీ వ‌ద‌ల్లేదు. మాస్‌, యాక్ష‌న్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్‌గా నిలిచాడు. ఫ్యాక్ష‌న్ క‌థ‌ల పేటెంట్ హ‌క్కుల్ని త‌న ద‌గ్గ‌రే ఉంచుకొన్నాడు. స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు చిత్రాల‌తో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచాడు. ఇటీవ‌ల విడుద‌లైన `డాకూ మ‌హారాజ్`తో సంక్రాంతి హీరో అనిపించుకొన్నాడు. బాల‌య్య కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్ర‌మిది.

కెరీర్ ప‌రంగా బాల‌య్య జెట్ స్పీడులో దూసుకుపోతున్నాడు. బాల‌య్య పారితోషికం ఇప్పుడు రూ.30 కోట్ల‌కు పైగానే. దానికి త‌గ్గ‌ట్టే త‌న మార్కెట్ వాల్యూ పెరిగింది. అన్ స్టాప‌బుల్ లో బాల‌య్య త‌న కొత్త కోణాన్ని ఆవిష్క‌రించుకొన్నాడు. బాల‌య్య ఇంత జోవియ‌ల్ గా, ఇంత ఫ్రెండ్లీగా ఉంటాడా? అనే సంగ‌తి ఈ షోతో అభిమానుల‌కు అర్థ‌మైంది. ఈ షో.. బాల‌య్య‌ని అభిమానులు చూసే కోణాన్నే మార్చేసింది. యువ హీరోలు కూడా బాలయ్య ద‌గ్గ‌ర చ‌నువు తీసుకొంటున్నారు. `బాలా..` అని పిలిచేంత స్నేహాన్ని సంపాదించుకొంటున్నారు. ఇది ఓ ర‌కంగా.. ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం అనే చెప్పాలి.

మ‌రోవైపు హిందూపురం ఎం.ఎల్‌.ఏగా హ్యాట్రిక్ కొట్టారు. వైకాపా హ‌వా కొన‌సాగిన ఎన్నిక‌ల్లోనూ హిందూపురంలో గెలిచి, త‌న బ‌లాన్ని చాటుకొన్నారు. 2024 విజ‌యంతో హ్యాట్రిక్ అందుకొన్నారు. బాల‌య్య‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అభిమానులు ఆశించారు. కానీ.. పార్టీ ప్ర‌యోజ‌నాలు, కూట‌మి ధ‌ర్మం దృష్టిలో ఉంచుకొని మంత్రి ప‌ద‌విని త్యాగం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా బ‌స‌వ‌తారం ద్వారా ఆయ‌న అందిస్తున్న సేవలు మ‌ర్చిపోలేనివి. రాజ‌కీయ నాయ‌కుడిగా, సేవ‌కుడిగా, క‌ళ‌కారుడిగా అన్ని విభాగాల్లోనూ త‌న‌దైన ముద్ర వేసిన బాల‌య్య ఈ పురస్కారానికి నూటిని నూరు పాళ్లూ అర్హుడే.

Posted
3 hours ago, RPG_Reloaded said:

Thu em awards raa ayya

 

T Subbi rami reddy awards laa ichestunnaru, yevadiki padithe vaadiki

Inkosari tdp power loki vasthe Bharatha Rathna kuda istharu ee yadavaki

 

 

3 hours ago, hunkyfunky3 said:

He is mentally unstable, right? 

😂😂😂

Posted
4 hours ago, RPG_Reloaded said:

Fulkas lobbying/begging vere level

Ee lafoot gadiki padma bushan award ichadu ante,

 

eee lekkana mohan babu ki bharatha rathna ichina thakkuve

balayya-bala-krishna.gif

Anduke mana Chiru ki Vibhushan icharu..😁

Posted
1 hour ago, Gundepotuu_Gummadi said:

Inka value unda e awards ki

Mental bali gaadiki ichaaka

 

Padma award ki Gaddar award unna value kuda leducake-allu-arjun.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...