ntr2ntr Posted February 5 Report Posted February 5 మంగళగిరిలోని ఎయిమ్స్‌కు కూటమి ప్రభుత్వం శాశ్వత నీటి వసతి కల్పించింది. ప్రత్యేక చొరవ తీసుకొని ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించింది. గుంటూరు ఛానల్ నుంచి మళ్లింపు కూటమి సర్కారు చొరవతో పరిష్కారం సంపులోకి వస్తున్న నీళ్లు ఈనాడు, అమరావతి: మంగళగిరిలోని ఎయిమ్స్‌కు కూటమి ప్రభుత్వం శాశ్వత నీటి వసతి కల్పించింది. ప్రత్యేక చొరవ తీసుకొని ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించింది. గత నెల 16 నుంచే రోజుకు 2.5 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తోంది. అంతకుముందు మంగళగిరి-తాడేపల్లి, విజయవాడ నగరపాలక సంస్థల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించేవారు. ఇందుకు ఎయిమ్స్ సుమారు రూ.4 కోట్లు ఖర్చు పెట్టేది. అయినా శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వం ఏనాడూ చిత్తశుద్ధితో పని చేయలేదు. ‘ఎయిమ్స్‌కు తాగునీటిని అందించడానికి వైకాపా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోలేదు’ అని నాటి కేంద్ర సహాయ మంత్రి భారతీపవార్ కూడా విమర్శించడం గమనార్హం. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన ఎయిమ్స్ నిర్మాణానికి అప్పట్లో తెదేపా ప్రభుత్వం భూములు కేటాయించి పనులు శరవేగంగా పూర్తయ్యేలా చొరవ తీసుకుంది. రూ.1,600 కోట్లకు పైగా వెచ్చించి కేంద్రం ఆసుపత్రిని నిర్మించింది. ఫలితంగా 2019 మార్చి 12న ఓపీడీ సేవలు మొదలయ్యాయి. శాశ్వత నీటి సౌకర్యం కల్పించడానికీ అప్పట్లోనే తెదేపా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టి.. మళ్లీ టెండర్లు పిలిచింది. కానీ, కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకోకపోవడంతో అటవీ శాఖ అభ్యంతరం తెలిపింది. అనుమతులు తీసుకొచ్చేందుకు గత ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు దృష్టిపెట్టి అనుమతులన్నీ వచ్చేలా చేశారు. పనులు పూర్తి చేయించారు. గుత్తేదారుకు రూ.3 కోట్ల బకాయిలూ చెల్లించారు. తరలింపు ఇలా..: కృష్ణా నీటిని గుంటూరు ఛానల్ నుంచి ఆత్మకూరు చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి సుమారు 4 కి.మీ. మేర వేసిన పైపులైన్ల ద్వారా ఎయిమ్స్‌లో నిర్మించిన సంపులోకి పంపుతున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.8.54 కోట్లు వెచ్చించింది. 1 Quote
Android_Halwa Posted February 5 Report Posted February 5 Mangalagiri aiims ki chetta butta kuda pettinaru anta kada Quote
ntr2ntr Posted February 6 Author Report Posted February 6 20 minutes ago, Android_Halwa said: Mangalagiri aiims ki chetta butta kuda pettinaru anta kada Mee tuqlaq government lo adi kooda ivvaledu government nunchi. Quote
Android_Halwa Posted February 6 Report Posted February 6 19 minutes ago, ntr2ntr said: Mee tuqlaq government lo adi kooda ivvaledu government nunchi. Idi mee babori visionary government la ivalsindi…apudu enduku iyaledu ? Visionary kada, matram telvada ? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.