ntr2ntr Posted February 7 Report Posted February 7 జగన్ సోదరి షర్మిల మరోసారి సోదరుడిపై విరుచుకుపడ్డారు. ఆయనకు క్యారెక్టర్ లేదని అయన క్యారెక్టర్ల గురించి మాట్లాడున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డితో భేటీ విషయాలపై మీడియాతో మాట్లాడిన ఆమె జగన్ చెడా మడా తిట్టేశారు. సొంత మేనల్లుడు,మేన కోడలు ఆస్తులు కాజేయ్యలని జగన్ చూస్తున్నాడని..ఇదేనా ఆయన విశ్వసనీయత.. క్యారెక్టర్ అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి తాను ప్రెస్ మీట్ పెట్టేది లేదని చెప్పారని అయినా ఒత్తిడి తెచ్చి చెప్పించారన్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడిన ప్రతి మాటా జగన్ రాసిచ్చిందేనని షర్మిల స్ఫష్టం చేశారు. విజయసాయిరెడ్డి తనకు ఆ మాట చెప్పారనన్నారు. ఆస్తుల్లో సమాన వాట ఉందని కుటుంబంలో అందరికీ తెలుసుని అయినా సొంత మేనల్లుడు, మేన కోడలు ఆస్తి కాజేయ్యాలని చూశాడన్నారు. అబద్ధాలు ఆడకూడదు అంట.. విలువలు,విశ్వసనేయత ఉండాలట.. పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం ఆలోచన చేయాలట.. వెన్నుపోటు పొడవకూడదు అంట అని జగన్ ను షర్మిల వెటకారం చేశారు. సాయి రెడ్డి చేత అబద్ధాలు చెప్పించలేదా ? ప్రజలను అవే నిజాలు అని నమ్మించ లేదా ? సొంత తల్లి మీద స్వార్థం కోసం కేసు పెట్టలేదా ? ఆస్తికోసం ఏదైనా చేయొచ్చు అనుకోలేదా ? సొంత చెల్లికి మీరు వెన్నుపోటు పొడిచిన..మీకు క్రిడిబులిటి ఉందా ? అని ప్రశ్నించారు. నాసిరకం మందు అమ్మి ప్రజల జీవితాలతో ఆడుకున్నప్పుడే మీకు క్రెడిబులిటీ లేదని అర్థం అయిందన్నారు. సొంత చిన్నాన్న ను హత్య చేసిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నప్పుడే పోయింది మీకు విశ్వసనీయత అని తేల్చేశారు. రుషికొండ ను తొలిచి 500 కోట్లతో ప్యాలెస్ కట్టినప్పుడే ..- ఆస్తులు కాజేయాలని చూసినప్పుడే సొంత తల్లిని అవమానించినప్పుడే విశ్వసనీయత పోయిందన్నారు. షర్మిల చేసిన వ్యాఖ్యలు బెంగళూరు ప్యాలెస్ లో ప్రతిధ్వనించడం ఖాయంగా కనిపిస్తోంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.