psycopk Posted February 8 Report Posted February 8 Konda Surekha: ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో... కేటీఆర్‌కు మంత్రి కొండా సురేఖ కౌంటర్ 08-02-2025 Sat 18:10 | Telangana కేటీఆర్ నుండి అలాంటి ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించిందన్న మంత్రి మీ మోదీ అంకుల్ గెలుపులో మీ సోదరి కీలక పాత్ర పోషించిందని ఎద్దేవా నెక్ట్స్ టైమ్ బెటర్ లక్ అంటూ కేటీఆర్‌కు చురక మీ మోదీ అంకుల్ గెలుపులో కీలక పాత్ర పోషించిన మీ సోదరి కవితను అభినందించాలని మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో బీజేపీ గెలిచిన నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ విజయానికి కృషి చేసిన అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీయేనని ఎద్దేవా చేశారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. కేటీఆర్ నుండి ఇలాంటి ప్రకటన తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. 2019, 2024 లోక్ సభ ఎన్నికలలో కరీంనగర్ నుండి బీజేపీ గెలిచిందన్నారు. అలాగే మీ సోదరి కవిత నిజామాబాద్ లోక్ సభ స్థానం నుండి ఓడిపోయారని గుర్తు చేశారు. ఈ విషయాలను గుర్తుంచుకొని మాట్లాడాలన్నారు. మీ మోదీ అంకుల్ గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు మీ సోదరిని అభినందించాలని మద్యం కేసును ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగానికి మించిన వారు ఎవరూ లేరని లోక్ సభ ఎన్నికల ఫలితాల ద్వారా మోదీకి అర్థమయ్యేలా రాహుల్ గాంధీ చేశారని పేర్కొన్నారు. వారి నాయకత్వం మీ కుటుంబానికి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని పదవిని కట్టబెట్టేందుకు సహాయపడిందన్నారు. అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సున్నాతో తుడిచిపెట్టుకుపోయిందని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రభావాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయవద్దని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనుకాడుతోందని చురక అంటించారు. నిజంగా అర్హులైన వారిని అభినందించడం మరిచిపోవద్దని, కనీసం నెక్ట్స్ టైమ్ బెటర్ లక్ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. Quote
psycopk Posted February 8 Report Posted February 8 Kishan Reddy: తెలంగాణలో అనుకూల వాతావరణం ఉంది... గెలుపుగా మలుచుకోవాలి: కిషన్ రెడ్డి 08-02-2025 Sat 13:13 | Telangana ఢిల్లీలో ఘన విజయం సాధించబోతున్నామన్న కిషన్ రెడ్డి ఇదే ఊపుతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని పిలుపు బీజేపీ అంటే దేశ వ్యాప్తంగా ఒక నమ్మకమని వ్యాఖ్య ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటుతోంది. 48 స్థానాల్లో ఆధిక్యతతో ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. పలువురు ఆప్ కీలక నేతలు ఓటమి బాటలో ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఢిల్లీలో ఘన విజయం సాధించబోతున్నామని చెప్పారు. ఇదే ఊపుతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. బీజేపీ అంటే దేశ వ్యాప్తంగా ఒక నమ్మకమని కిషన్ రెడ్డి చెప్పారు. నిజాయతీతో కూడిన పాలన బీజేపీతోనే సాధ్యమని అన్నారు. దేశ రాజధానిలో బీజేపీ జెండా ఎగురవేస్తున్నామని... తెలంగాణలో కూడా సానుకూల వాతావరణం ఉందని... దాన్ని గెలుపుగా మలుచుకోవాలని చెప్పారు. మరోవైపు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు జోష్ లో మునిగిపోయాయి. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది. Quote
psycopk Posted February 8 Report Posted February 8 Anna Hazare: కేజ్రీవాల్ పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు 08-02-2025 Sat 12:46 | National ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సామాజిక కార్యకర్త కేజ్రీవాల్ అధికార దాహమే ప్రస్తుత ఓటమికి కారణమని వెల్లడి లిక్కర్ స్కాంతో ఆప్ ప్రభుత్వం, కేజ్రీవాల్ పై వ్యతిరేకత ఏర్పడిందని వ్యాఖ్య ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ అధికార దాహమే ఆమ్ ఆద్మీ పార్టీని ముంచేసిందని విమర్శించారు. ఆప్ ఎదుర్కొంటున్న ప్రస్తుత దారుణ పరాభవానికి ముమ్మాటికీ కేజ్రీవాల్ వైఖరే కారణమని మండిపడ్డారు. అవినీతి రహిత పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్.. అటుపై అధికార దాహంతో చేసిన పనులతో ఢిల్లీ ఓటర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని పేర్కొన్నారు. మూడు పర్యాయాలు ఢిల్లీ సీఎం సీటులో కూర్చున్న కేజ్రీవాల్ పై ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా అవినీతి ఆరోపణలు వచ్చాయని అన్నా హజారే గుర్తుచేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కాం ఆరోపణలు కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి మచ్చగా మారాయని చెప్పారు. అందుకే ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ ను ఓడించారని అన్నా హజారే చెప్పుకొచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన అన్నా హజారేకు మద్దతుగా కేజ్రీవాల్ తన ఉద్యోగాన్ని వదులుకుని మరీ వెంటనడిచారు. అన్నా హజారేకు శిష్యుడిగా అవినీతిపై పోరాడారు. ఆ తర్వాత ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకుని దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి ఎన్నికల్లోనే చెప్పుకోదగ్గ స్థానాలను గెల్చుకుని కాంగ్రెస్ సాయంతో సీఎం సీట్లో కూర్చున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ తీసుకున్న పలు నిర్ణయాలపై రాజకీయంగా విమర్శలు వ్యక్తం కావడం, లిక్కర్ స్కాంలో జైలుపాలవడం తదితర కారణాలు ఆప్ ను ఓడించాయని అన్నా హజారే అభిప్రాయపడ్డారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.