psycopk Posted February 28 Report Posted February 28 Chandrababu: జగన్ తో జాగ్రత్త... పూర్తి అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు 28-02-2025 Fri 15:41 | Andhra గతంలో వివేకా హత్య, కోడికత్తి డ్రామా నెపంను తమపై వేశారన్న చంద్రబాబు అప్రమత్తంగా లేక ఆనాటి ఎన్నికల్లో నష్టపోయామని వెల్లడి అప్పటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఆ కుట్రలు పసిగట్టలేకపోయిందని వివరణ ఏపీ సీఎం చంద్రబాబు టీడీఎల్పీ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం... పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ తో జాగ్రత్తగా ఉండాలని... జగన్ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. వివేకా హత్య, కోడికత్తి డ్రామాల నెపం మనపై వేశారని వెల్లడించారు. ఆనాడు మనం అప్రమత్తంగా లేక ఎన్నికల్లో నష్టపోయామని వివరించారు. అప్పటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఆ కుట్రలను పసిగట్టలేకపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలోనూ కుట్రకోణం ఉందని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన ప్రమాదంపై సీసీ కెమెరా ఫుటేజ్ అడిగినా ఇవ్వలేదని ఆరోపించారు. ఇలాంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో, టీడీపీ నేతలు ఏమరుపాటుగా ఉండొద్దని సూచించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.