naidubava Posted February 28 Report Posted February 28 Source: https://x.com/Sreenivas14C/status/1894968861277200859 *కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ ఫైబర్ నెట్ లో ఏమి జరిగింది* ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (APSFL) 100% ప్రభుత్వ సంస్థగా, పరిశ్రమలు & వాణిజ్య శాఖ (I&I Department) పరిధిలో, అక్టోబర్ 2015లో కంపెనీస్ యాక్ట్, 2013 ప్రకారం స్థాపించబడింది. ఉద్యోగుల సంఖ్య : 2015లో 8 మందితో ప్రారంభం అయిన సంస్థ, 2019 అంటే చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి 111 మంది ఉద్యోగులు ఉన్నారు. 2024లో జగన్ రెడ్డి దిగిపోయే సమయానికి 1350 మంది ఉద్యోగులు ఉన్నారు. 2019-2024 మధ్య ఎక్కువ మంది అనర్హులుని చేర్చి, కేవలం జీతాల కోసమే వారిని నాటి వైసీపీ ప్రభుత్వం నియమించింది. 2024 ఎన్నికల తరువాత పరిస్థితి : * *2024 సాధారణ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఫైబర్ నెట్ కార్యాలయం సీజ్ చేసారు.* సెప్టెంబర్ చివరి నాటికి అన్ని రికార్డులు స్కాన్ చేసి భద్ర పరిచి, *2024 సెప్టెంబర్‌లో కార్యాలయం తిరిగి ప్రారంభించారు.* * అప్పటికే జరిగిన ప్రాధమిక విచారణలో, *417 మంది ఉద్యోగులని* అనర్హులుగా (Non-resourceful) లేదా సంస్థలో అనుమతు ల్లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించి వారిని *తొలగించారు.* * 2024 ఏప్రిల్ లో 1342 మంది ఉన్న ఉద్యోగుల సంఖ్య, 2024 డిసెంబర్ జీతాలు ఇచ్చే నాటికి 925కి చేరుకుంది. అంటే *డిసెంబర్ కంటే ముందే 417 మంది అనర్హులని తొలగించారు.* * మిగిలిన ఉద్యోగుల స్థితిగతులు తెలుసుకోవటానికి ఒక కమిటీ నియమించారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మెన్ గా జీవీ రెడ్డి వచ్చిన తరువాత ఏమి జరిగింది : * జీవీ రెడ్డి నవంబర్ 15న ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసారు * డిసెంబర్ 19న మొదటి సారి రివ్యూ చేసి, అదే రోజు ప్రెస్ మీట్ పెట్టారు * డిసెంబర్ 24న మరో ప్రెస్ మీట్ పెట్టి 410 మంది ఉద్యోగులను తొలగించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు * ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 21.01.2025న కమిటీ తన రిపోర్ట్ ఇచ్చింది. 2024 డిసెంబర్ నాటికి ఉన్న 925 మందిలో 200 మంది అనర్హులుగా (Non-resourceful) లేదా సంస్థలో అనుమతు ల్లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించారు. * కమిటీ ఆదేశాల ప్రకారం, ఈ *200 మంది అనర్హులని ఉద్యోగం నుంచి తీసి వేసే ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యింది.* *సెప్టెంబర్ 2024 నుంచి నవంబర్ 2024 వరకు, ఈ మూడు నెలల్లో 417 మంది ఫైబర్ నెట్ ఉద్యోగులని అనర్హులుగా గుర్తించి తొలగించారు. * 400 లేదా 200 మందిని ఒకేసారిగా తొలగించినప్పుడు వారంతా కలిసి న్యాయస్థానం తలుపు తట్టినట్లయితే ఈ తొలగింపు ప్రక్రియ మరింత జటిలం అవుతుందని, ఆ కేసు కొనసాగినన్నాళ్లు వీళ్ళందరికీ ప్రభుత్వం జీతభత్యాలు ఇవ్వాల్సి వస్తుంది అనేది నిర్వివాదాంశం. అందుకే సున్నితంగా విడి విడిగా ఒక్కొక్క కేసును పరిష్కరిస్తూ రావడంలో కొంత సమయం పడుతుంది. ఈలోపే కొన్ని అవాంఛిత ఘటనలు జరిగిపోయాయి. ఒక కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్స్ ఉద్యోగిని తొలగించినప్పుడు చట్టానికి లోబడి వారికి రెండు లేదా మూడు నెలల జీతం ఇవ్వవలసి ఉంటుంది.. కావున పలువురిని కార్పొరేషన్ తొలగించినట్లు కాకుండా వారే వ్యక్తిగత కారణాలతో రాజీనామాలు చేసే విధంగా చూసినప్పుడే వారికి పదవీ విరమణ అనంతరం రెండు లేదా మూడు నెలల జీతం ఇవ్వాల్సిన భారం ఉండదు.. ఇవి బయట చర్చించే అంశాలు కావు.. నిన్న ఏమీ లేకుండానే వీసీలను మీరు బెదిరించి రాజీనాలు చేయించారు అని వైసీపీ అబాండాలు వేయడం కళ్లారా చూసాము.. కావున ప్రభుత్వంలో జరిగే ప్రతి విషయం సోషల్ మీడియాలో చర్చలకు అర్హమైనవి కావు అనేది దయచేసి గుర్తించాలి. #APFiberNet #AndhraPradesh 1 Quote
Android_Halwa Posted February 28 Report Posted February 28 Its a yellow propaganda…They are attempting to repair the damage… Sollu puranam seppandra yedhavallara ante first vuntaru… Quote
2024 Posted February 28 Report Posted February 28 12 minutes ago, Android_Halwa said: Its a yellow propaganda…They are attempting to repair the damage… Sollu puranam seppandra yedhavallara ante first vuntaru… ninnu minchin erri REDDDD follower evadu undaru lee 1 Quote
naidubava Posted February 28 Author Report Posted February 28 1 hour ago, 2024 said: ninnu minchin erri REDDDD follower evadu undaru lee Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.