Jump to content

Babai case lo another sakshyam out.. watchman ranganna


Recommended Posts

Posted

Good example how our Justice system is functioning... 

Posted
7 hours ago, Mancode said:

Corruption vishyam lo evadu taggedele...

Bjp or ycp or congress (sunanda pushkar death, delhi 84 riots , lot of bomb blasts are allowed to happen ,instead of nabbing them for minority appeasement) 

@Teluguredu @psycontr

Corruption used to low before 1990's ,only after 1990's corruption increased multifold due to FDI inflow and low level brokers seizing opportunities to loot.

Most politicians before 1990 's used to be there just for respect and interest in politics and being among people.

Posted

482061649_3876430602596769_4011693631741

వాచ్ మెన్ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు !

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మన్‌ రంగయ్య .. కడప రిమ్స్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి మృతి చెందాడు.

అయితే ఆయన మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ రంగయ్య భార్య సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘‘నా భర్తను 2024 వరకూ పోలీసులు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత నా భర్తను హింసించారు. ఆయన కీళ్లు విరగొట్టారు. కొట్టి కొట్టి ఇలా చనిపోయేలా చేశారు. గత మూడు నెలలుగా ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకోలేదు. ఢిల్లీ నుంచి అన్నీ ప్రాంతాలు తిప్పారు. ఇప్పుడు మాకేం సంబంధం అంటున్నారు. రంగయ్య మృతికి సీబీఐ, పోలీసులే కారణం’’ అని ఆరోపించారామె.

సుశీలమ్మ ఆరోపణలపై సీఐ ఉలసయ్య స్పందించారు. ‘‘రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ పిర్యాదు చేసింది. అనుమానాస్పద కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. మృతికి కారణం ఏమిటో పోస్ట్ మార్టం నివేదికలో తెలుస్తుంది’’ అని తెలిపారు. రంగయ్య మృతదేహానికి ఇవాళే పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది.

Note :- వివేకా గారికి పిఏ గా పనిచేసిన కృష్ణారెడ్డిని కూడా గతంలో వివేకా కుమార్తె , అల్లుడు కలిసి బెదిరించి... మేము చెప్పినట్టు నువ్వు వినాలి. నువ్వు నిజాలు చెప్తే మేము జైలుకు పోవాల్సి వస్తుంది.. అని కృష్ణారెడ్డి ఫై తీవ్రంగా ఒత్తిడి తేవడం ... దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం మనకు తెలిసిందే !

వివేకా హత్య కేసు కి సంబంధించి.. దర్యాప్తు జరిపిన సిబిఐ అధికారి రామ్ సింగ్ ఏకపక్షంగా వ్యవహరించినందున ... ఆయనను గౌరవ న్యాయస్థానం ఈ కేసు విచారణ నుండి తప్పుకోవాలని కూడా ఆదేశించిన విషయం మనకు తెలిసిందే

Posted
10 hours ago, psycopk said:

 

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సాక్షి వాచ్ మన్ రంగన్న అనారోగ్యంతో మృతి 

06-03-2025 Thu 06:23 | Andhra
YS Viveka watchman ranganna passes away
 

 

  • అస్వస్థతకు గురైన రంగన్నను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన వైనం
  • గతంలోనే సాక్షిగా రంగన్న సీబీఐకి కీలక విషయాలు వెల్లడి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి, వాచ్‌మన్ రంగన్న (85) అనారోగ్యంతో కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

2019 మార్చి 15న పులివెందులలో వివేకానంద రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివేకా నివాసంలో వాచ్‌మెన్‌గా పనిచేసిన రంగన్న నుంచి సీబీఐ అధికారులు వాంగ్మూలం సేకరించారు. ఆ సమయంలో ఆయన పలు కీలక విషయాలను సీబీఐకి తెలియజేసినట్లు సమాచారం. వివేకా కేసులో రంగన్నను కీలక సాక్షిగా పేర్కొంటూ సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కూడా పలు అంశాలు పొందుపరిచింది. కేసు విచారణ సమయంలో కీలకంగా ఉపయోగపడే సాక్షి రంగన్న మృతి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

 

Watchmen andhariki Ranganna, Rangayya names yendhuku vuntaayi?

Posted
7 hours ago, Teluguredu said:

Corruption used to low before 1990's ,only after 1990's corruption increased multifold due to FDI inflow and low level brokers seizing opportunities to loot.

Most politicians before 1990 's used to be there just for respect and interest in politics and being among people.

Ok

Posted
On 3/6/2025 at 2:11 AM, Android_Halwa said:

100 years minimum anukunna ranganna, just 85 ke gone..rei jagga, endi ra idi ?

RIP Ranganna….

His age 65 years. Not 85. Aa news lo vesindhi thappu anukunta.

Posted

Viveka Murder Case: ఏ సాక్షి కథ ఎలా ముగిసింది?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు, అనుమానితులు వరుసగా మరణిస్తున్నారు. వైకాపా పాలనా కాలంలో 2019-24 మధ్య నలుగురు మృతి చెందారు.

 

వివేకా హత్య కేసులో కీలక సాక్షుల వరుస మరణాలు
వైకాపా పాలనా కాలంలోనే నలుగురి మృతి
ఈ ఏడాది ఇప్పటి వరకు ఇద్దరు
మరణాల వెనుక వివేకా హత్య కేసు నిందితుల కుట్రపై సందేహాలు

 

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు, అనుమానితులు వరుసగా మరణిస్తున్నారు. వైకాపా పాలనా కాలంలో 2019-24 మధ్య నలుగురు మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయారు. ఈ ఆరుగురివీ సహజ మరణాలేనని, అనారోగ్య కారణాలతో చనిపోయారని పైకి చెబుతున్నప్పటికీ లోతుగా చూస్తే అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి. అందరూ ఒకే తరహాలో చనిపోవటం అనేక సందేహాలకు తావిస్తోంది. కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్న వేళ ప్రధాన సాక్షులు, కేసుతో సంబంధమున్న వ్యక్తులు మరణిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షి వాచ్‌మన్‌ రంగన్న తాజాగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం, తన తండ్రికి అందించిన చికిత్సపై అనుమానాలున్నాయంటూ రంగన్న కుమారుడు కాంతారావు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ మరణాల వెనుక వివేకా హత్య కేసు నిందితుల ప్రమేయం, కుట్ర ఉందన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మరణాలన్నింటిపై సమగ్ర దర్యాప్తునకు సిద్ధమవుతోంది.


నారాయణయాదవ్‌ (52)

జగన్‌ వాహన డ్రైవర్, సాక్షి  

(మరణం 2019 డిసెంబరు 6)

 

ఆ రోజు వాహనంలో జగన్, భారతి ఏం మాట్లాడారో తెలుస్తుందనేనా?
వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతిలను హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు తీసుకొచ్చిన వాహన డ్రైవర్‌ నారాయణ యాదవ్‌ 2019 డిసెంబరులో మృతి చెందారు. అనారోగ్య కారణాలతో చనిపోయారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్‌ విచారణ వేగవంతమవుతున్న తరుణంలో ఆయన మరణించటం సందేహాస్పదంగా ఉంది. హైదరాబాద్‌- పులివెందుల ప్రయాణంలో జగన్‌మోహన్‌రెడ్డి, భారతి, అవినాష్‌రెడ్డి, ఇతరుల మధ్య వివేకా మరణానికి సంబంధించి ఫోన్‌ సంభాషణలు జరిగాయని, అవన్నీ నారాయణ యాదవ్‌ విన్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను కీలక సాక్షిగా విచారించాలి. విచారణకు పిలవకముందే ఆయన చనిపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. నారాయణ యాదవ్‌ మృతిపై పోలీసులు అసలు కేసే నమోదు చేయలేదు. అతని అంత్యక్రియలకు జగన్, భారతి హాజరయ్యారు. 


వాచ్‌మన్‌ బి.రంగన్న (65)

వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి 

(మరణం 2025 మార్చి 5)

 

రంగన్న వాంగ్మూలంతోనే కేసులో కీలక మలుపు
వివేకా నివాసం వద్ద కాపలా ఉన్న వాచ్‌మన్‌ బి.రంగన్న ఆయన హత్యలో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా చూశారు. ఎర్ర గంగిరెడ్డి, షేక్‌ దస్తగిరి, సునీల్‌ యాదవ్, ఉమాశంకరరెడ్డి ఈ హత్య చేసినట్లు ఆయన సీబీఐకి, మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలమిచ్చారు. ఆ తర్వాతే శివశంకరరెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, తదితర ముఖ్యుల ప్రమేయం బయటపడింది. వివేకా హత్య గురించి ఎవరికైనా చెబితే నరికి చంపేస్తానంటూ ఎర్ర గంగిరెడ్డి అప్పట్లో తనను బెదిరించారని కూడా రంగన్న వాంగ్మూలమిచ్చారు. వివేకా హత్య కేసులో అత్యంత కీలక సాక్షి అయిన రంగన్న రెండు రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన అస్వస్థతకు గురయ్యారంటూ తొలుత పులివెందుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. ‘మా నాన్నకు నిరుడు కాలికి గాయమైంది. పులివెందుల నుంచి కడప, తిరుపతి, హైదరాబాద్‌ వరకు తీసుకెళ్లి చికిత్స చేయించాం. తర్వాత ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో చికిత్స వివరాలు కోరినా పోలీసులు మాకివ్వలేదు. ఆ చికిత్సపై మాకు అనుమానాలున్నాయి’ అంటూ రంగన్న భార్య, కుమారుడు కాంతారావు ఆరోపించారు. పోలీసులు కూడా ఇది అనుమానాస్పద మృతేనని తేల్చి దర్యాప్తు చేస్తున్నారు. 


కల్లూరి గంగాధర్‌రెడ్డి (40) 

కీలక సాక్షి 

(మరణం 2022 జూన్‌ 9)

 

జగన్‌ క్యాంపు కార్యాలయంలో సీబీఐ తనిఖీ చేసిన కొద్దిరోజుల్లోనే.. 
వివేకా హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్‌రెడ్డి 2022 జూన్‌లో మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందారంటూ అప్పట్లో ప్రచారం చేశారు. అయితే ఆ మరణమూ అనేక సందేహాలకు తావిచ్చింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం సీబీఐ బృందాలు పులివెందులలోని జగన్‌ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇళ్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో కొలతలు, గూగుల్‌ కోఆర్డినేట్స్‌ తీసుకున్నాయి. అది జరిగిన వెంటనే.. ఈ కేసులో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు. 

  • ‘కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డితో కలిసి వివేకాను హత్య చేయించాం. ఆ నేరాన్ని నీపై వేసుకుంటే వారు రూ.10 కోట్లు ఇస్తారు. నీ జీవితాన్ని సెటిల్‌ చేస్తాం’ అంటూ ఈ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డి తనకు ఆఫర్‌ ఇచ్చారంటూ, దాన్ని తాను తిరస్కరించానని 2021 అక్టోబరు 2న గంగాధర్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత మాట మార్చారు. శివశంకరరెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ సీబీఐ తనను బలవంతం చేసిందని అప్పట్లో అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. శివశంకరరెడ్డి, ఇతర కుట్రదారుల ప్రభావానికి లోనయ్యే గంగాధర్‌రెడ్డి మాట మార్చారనే అనుమానం ఉందని శివశంకరరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణలో కోర్టుకు అప్పట్లో సీబీఐ నివేదించింది. కొన్నాళ్ల తర్వాత గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు. 

కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి (57) 

అనుమానితుడు

(మరణం 2019 సెప్టెంబర్‌ 3)

 

రక్తపు ఆనవాళ్లున్నా ఆ దిశగా దర్యాప్తే చేయకుండా కేసు మూసివేత 
వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విషపుగుళికలు సేవించి, ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ విస్తృత ప్రచారం చేశారు. శ్రీనివాసులరెడ్డి వివేకా హత్య కేసులో అనుమానితుడు. ఈ హత్య కుట్ర సంబంధిత వివరాలు అతనికి, అతని బావ పరమేశ్వరరెడ్డికి ముందే తెలుసన్న అనుమానాలున్నాయి. పరమేశ్వరరెడ్డి నార్కోఎనాలసిస్‌ పరీక్షలకు హాజరై తిరిగొచ్చిన కొద్దిరోజుల్లోనే శ్రీనివాసులరెడ్డి మరణించారు. సీబీఐ విచారణ కంటే ముందు రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్‌ ఈ కేసులో కీలక వ్యక్తుల్ని విచారిస్తున్న సమయంలో శ్రీనివాసులరెడ్డి చనిపోయారు. తన చావుకు సిట్‌లోని ఇన్‌స్పెక్టర్‌ కారణమంటూ నాటి ముఖ్యమంత్రి జగన్, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిలకు శ్రీనివాసులరెడ్డి రాశారంటున్న రెండు లేఖల్ని అప్పట్లో ఆయన కుటుంబసభ్యుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివేకా హత్య కేసులో అనుమానితులను సిట్‌ ఇన్‌స్పెక్టర్‌ లోతుగా విచారిస్తున్నవేళ.. దాన్ని నిరోధించడానికే ఇలా చేశారన్న అనుమానాలున్నాయి. శ్రీనివాసులరెడ్డి రాసినట్లుగా చెబుతున్న లేఖల్లోని దస్తూరి కూడా ఆయనది కాదన్న సందేహాలున్నాయి.

  • వైకాపా హయాంలో తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శ్రీనివాసులరెడ్డి మృతదేహంలో కాలేయానికి, కిడ్నీ మధ్య భాగం (హెపటో రీనల్‌ పౌచ్‌)లో రక్తం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నివేదిక తేల్చింది. పోలీసులు ఆ రక్తపు ఆనవాళ్లేమిటో దర్యాప్తు చేయకుండానే కేసు మూసేశారు. 

డా.వైఎస్‌ అభిషేక్‌రెడ్డి (36)

సాక్షి 

(మరణం 2025 జనవరి 10)

 

వివేకాది హత్యేనని వాంగ్మూలమిచ్చిన కొన్నాళ్లకే.. 
వివేకా హత్య కేసు కీలక సాక్షుల్లో డా.వైఎస్‌ అభిషేక్‌రెడ్డి ఒకరు. వివేకా చనిపోయినట్లు దేవిరెడ్డి శివశంకరరెడ్డి నుంచి తనకు ఫోన్‌కాల్‌ వచ్చిందని, ఘటనాస్థలానికి వెళ్లి చూడగా.. మృతదేహం చుట్టూ రక్తపు మడుగు, ఆయన నుదుటిపై గాయాలున్నట్లు గుర్తించి, ఇది హత్యేనని భావించానంటూ 2021 ఆగస్టులో అభిషేక్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. అవినాష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకరరెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డే వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ చిత్రీకరించారని వాంగ్మూలంలో ప్రస్తావించారు. స్వతహాగా వైద్యుడు, యువకుడైన అభిషేక్‌రెడ్డి ఈ వాంగ్మూలం వెలుగుచూసిన కొన్నాళ్ల తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు. దీని వెనకా అనేక అనుమానాలున్నాయి.


ఈసీ గంగిరెడ్డి (73) 

వైఎస్‌ భారతి తండ్రి

(మరణం 2020 అక్టోబరు 3)

 

వివేకా మృతదేహానికి కట్లు కట్టింది.. గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బందే
వైఎస్‌ భారతి తండ్రి, జగన్‌మోహన్‌రెడ్డి మామ అయిన ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబరులో అనారోగ్యంతో చనిపోయారు. వివేకా హత్య కుట్ర గురించి ఆయనకు తెలుసనే ఫిర్యాదులున్నాయి. వివేకా హత్యను కప్పిపుచ్చేందుకు ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బందే ఆయన మృతదేహానికి కట్లు కట్టి, బ్యాండేజీలు చుట్టారు. వివేకా హత్య తర్వాత నిందితులు గంగిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి చేతులు శుభ్రం చేసుకున్నారనే ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతీ అనుమానాస్పదంగానే ఉంది.

Posted

Tammudu ippudu cm ga unnadi nenu. Nuvvu ilanti posts vesthey cbn aney naaku administration chatha kaadu anukuntaru. Delete the post

Posted
On 3/6/2025 at 2:52 AM, appusri said:

482061649_3876430602596769_4011693631741

వాచ్ మెన్ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు !

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మన్‌ రంగయ్య .. కడప రిమ్స్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి మృతి చెందాడు.

అయితే ఆయన మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ రంగయ్య భార్య సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘‘నా భర్తను 2024 వరకూ పోలీసులు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత నా భర్తను హింసించారు. ఆయన కీళ్లు విరగొట్టారు. కొట్టి కొట్టి ఇలా చనిపోయేలా చేశారు. గత మూడు నెలలుగా ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకోలేదు. ఢిల్లీ నుంచి అన్నీ ప్రాంతాలు తిప్పారు. ఇప్పుడు మాకేం సంబంధం అంటున్నారు. రంగయ్య మృతికి సీబీఐ, పోలీసులే కారణం’’ అని ఆరోపించారామె.

సుశీలమ్మ ఆరోపణలపై సీఐ ఉలసయ్య స్పందించారు. ‘‘రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ పిర్యాదు చేసింది. అనుమానాస్పద కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. మృతికి కారణం ఏమిటో పోస్ట్ మార్టం నివేదికలో తెలుస్తుంది’’ అని తెలిపారు. రంగయ్య మృతదేహానికి ఇవాళే పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది.

Note :- వివేకా గారికి పిఏ గా పనిచేసిన కృష్ణారెడ్డిని కూడా గతంలో వివేకా కుమార్తె , అల్లుడు కలిసి బెదిరించి... మేము చెప్పినట్టు నువ్వు వినాలి. నువ్వు నిజాలు చెప్తే మేము జైలుకు పోవాల్సి వస్తుంది.. అని కృష్ణారెడ్డి ఫై తీవ్రంగా ఒత్తిడి తేవడం ... దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం మనకు తెలిసిందే !

వివేకా హత్య కేసు కి సంబంధించి.. దర్యాప్తు జరిపిన సిబిఐ అధికారి రామ్ సింగ్ ఏకపక్షంగా వ్యవహరించినందున ... ఆయనను గౌరవ న్యాయస్థానం ఈ కేసు విచారణ నుండి తప్పుకోవాలని కూడా ఆదేశించిన విషయం మనకు తెలిసిందే

Memu cheppamannatu cheppakapothey himsinche svathanthram kooda maaku ledha. Prajalu maaku 164 seats icharu. 

Posted
2 minutes ago, 7691 said:

Memu cheppamannatu cheppakapothey himsinche svathanthram kooda maaku ledha. Prajalu maaku 164 seats icharu. 

Ame cheppindhi Jagan YSRCP govt gurunchi anukunta before the elections. Ee govt case kooda file chesinattu undhi ame icchina complaint meedha.

Posted
5 minutes ago, appusri said:

Ame cheppindhi Jagan YSRCP govt gurunchi anukunta before the elections. Ee govt case kooda file chesinattu undhi ame icchina complaint meedha.

Aithey amey cheppindi correct tammudu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...