Jump to content

Sirio ki ichina Bhaskar award ki paisal sesukunnar ani Anniya angry!


Recommended Posts

Posted
 
 
eenadu.net
 

chiranjeevi: చిరు లండన్‌ పర్యటనలో గోల్‌మాల్‌.. డబ్బులు వసూలు చేయడంపై మెగాస్టార్‌ ఆగ్రహం

Eenadu
3–4 minutes

లండన్‌లో తనని కలిసేందుకు ఫ్యాన్స్‌ మీట్‌ పేరుతో డబ్బులు వసూలు చేయడంపై అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Eenadu icon

By Entertainment Team Updated : 21 Mar 2025 06:49 IST

2 min read

2003chiranjeevi1.webp

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi)ని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌- యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించారు. లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఈ క్రమంలో చిరంజీవి లండన్‌ టూర్‌ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఫ్యాన్‌ మీట్‌ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం కాస్త చిరు దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

ప్రియమైన అభిమానులారా..! యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపిన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని తాకింది. ఈ క్రమంలో ఫ్యాన్‌ మీటింగ్‌ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి అనుచిత ప్రవర్తనను నేను అస్సలు ఒప్పుకోను. దీన్ని ఖండిస్తున్నా. ఫ్యాన్స్‌ మీటింగ్‌ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే, వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండి. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు, ఎక్కడా కూడా నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించనని గుర్తించండి. మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం వెలకట్టలేనిది. నేను ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అస్సలు ఒప్పుకోను. మన ఆత్మీయ కలయికలను స్వచ్ఛంగా, స్వలాభార్జనకు దూరంగా ఉంచుదాం -ఎక్స్‌ వేదికగా చిరంజీవి

ఇక సినిమాల విషయానికొస్తే చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara) చేస్తున్నారు. త్రిష కథానాయిక. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. జూన్‌ లేదా జులైలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న సినిమా కావడంతో.. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదన్న ఉద్దేశంతో చిత్ర బృందం అన్నీ పకడ్బందీగా సిద్ధమయ్యాకే విడుదల తేదీ ప్రకటించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలోనూ చిరు నటించనున్నారు. ఇప్పటికే కథ ఓకే కాగా, పూర్తి స్క్రిప్ట్‌ను అనిల్‌ సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా దీన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మూవీ తర్వాత వెంటనే శ్రీకాంత్‌ ఓదెలతో ఓ మాస్‌ యాక్షన్‌ మూవీని చిరంజీవి చేయనున్నారు.

Published : 21 Mar 2025 00:07 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

 
 
Posted

siru thaatha nee chillara bhudhi yekkadikipoyina vadhavalaa

Posted

Mari commision matlladukunte ipoyedi kada...Chiru tatha got hurt as no one gave commision...valle mingesaru mottam ani

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...