Pavanonline Posted March 24 Report Posted March 24 6 minutes ago, psycopk said: ilantivi avasarama, repu CBN vachi reverse lo lavu ki class peekuthadu Quote
psycopk Posted March 24 Author Report Posted March 24 Anchor Shyamala: బాధ్యత గల పౌరురాలిగా ఇక అలాంటి పనులు చేయను: యాంకర్ శ్యామల 24-03-2025 Mon 14:15 | Entertainment బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసిన కేసులో విచారణకు హాజరైన శ్యామల ఇకపై బెట్టింగ్ లు ప్రమోట్ చేయనని వ్యాఖ్యల విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న శ్యామల ఆన్ లైన్ బెట్టింగ్ ను ప్రమోట్ చేశారనే కేసులో వైసీపీ నాయకురాలు, యాంకర్ శ్యామల పోలీసు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో శ్యామలను పోలీసులు దాదాపు రెండున్నర గంటలకు పైగా విచారించారు. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో శ్యామల మాట్లాడుతూ... బెట్టింగ్ ను ఇకపై ప్రమోట్ చేయనని చెప్పారు. బాధ్యతగల పౌరురాలిగా ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన వారి లోటును ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. బెట్టింగ్ లకు పాల్పడటం, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం తప్పేనని శ్యామల చెప్పారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని... విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున... మాట్లాడటం సరికాదని చెప్పారు. Quote
psycopk Posted March 24 Author Report Posted March 24 Vidala Rajani: తప్పు చేయకుంటే ఉలికిపాటు ఎందుకు?: విడదల రజనిపై ప్రత్తిపాటి పరోక్ష వ్యాఖ్యలు 24-03-2025 Mon 14:12 | Andhra గతంలో అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు దీని వెనుక ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కుట్ర ఉందన్న రజని నిజాయతీపరుడైన ఎంపీపై అవాకులు చెవాకులు పేలితే సరిపోతుందా? అంటూ ప్రత్తిపాటి ధ్వజం పల్నాడు జిల్లాలో ఓ స్టోన్ క్రషర్స్ సంస్థ మేనేజ్ మెంట్ ను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు కావడం తెలిసిందే. అయితే తనపై పెట్టింది అక్రమ కేసు అని, దీని వెనుక టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కుట్ర ఉందని విడదల రజని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. తప్పు చేయనప్పుడు ఉలికిపాటు ఎందుకుని విడదల రజనిని పరోక్షంగా ప్రశ్నించారు. అవినీతికి పాల్పడలేదనప్పుడు రాయబారాలు ఎందుకు చేస్తున్నారంటూ నిలదీశారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు అని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. నిజాయతీపరుడైన ఎంపీ మీద అవాకులు చెవాకులు పేలితే సరిపోతుందా? గతంలో అవినీతి మంత్రిగా ముద్ర వేయించుకున్న వ్యక్తి నేడు నీతులు చెబుతుండడం ఆశ్చర్యంగా ఉంది అని వ్యాఖ్యానించారు. నాడు అధికార గర్వంతో అరాచకాలు చేసి, ఇప్పుడు సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోంది అంటూ విమర్శించారు. Quote
psycopk Posted March 24 Author Report Posted March 24 Vidala Rajani: చేసేవన్నీ చేసి.. ఇప్పుడు బుకాయింపులా?: విడదల రజనిపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఫైర్ 24-03-2025 Mon 11:46 | Andhra కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధిక ధర చెల్లించి తాము భూములు తీసుకున్నామన్న కృష్ణదేవరాయలు ఐపీఎస్ అధికారులను కూడా రజని బెదిరించారని మండిపాటు అక్రమాలు చేసి.. రెడ్ బుక్ అని బుకాయిస్తున్నారని ఎద్దేవా స్టోన్ క్రషర్ యజమాని నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనిపై సీఐడీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలపై విడదల రజని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టించారని, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తన ఫోన్ డేటాను కూడా తీసే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈ క్రమంలో రజనికి శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. తాను కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారని... ఫోన్ డేటా, భూముల విషయాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. 40 ఏళ్లుగా విజ్ఞాన్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్నామని... తమది మచ్చలేని చరిత్ర అని చెప్పారు. అమరావతిలో స్థలం కోసం కూడా తాము దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూములు వేలం వేస్తే తాము అధిక ధర చెల్లించి భూమి తీసుకున్నామని చెప్పారు. భూముల వేలానికి, భూముల కేటాయింపులకు మధ్య ఉన్న తేడా ఏమిటో తెలుసుకోవాలని అన్నారు. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వులపాలు అవుతారని చెప్పారు. విడదల రజని అబద్ధాలు మాట్లాడుతున్నారని... ఆమె మాదిరి తాను అబద్ధాలు మాట్లాడలేనని అన్నారు. రెడ్ బుక్ లో పేర్లు ఉన్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విడదల రజని అంటున్నారని... ఆ వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ఐపీఎస్ అధికారి జాషువా సర్వీసు 2040 వరకు ఉందని... ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో తనకు, బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానికి మధ్య ఎలాంటి బంధుత్వం లేదని చెప్పారని తెలిపారు. 2021 ఆగస్ట్ 24న మీ (విడదల రజని) నుంచే ఫిర్యాదు వచ్చిందని.. ఆ స్టోన్ క్రషర్స్ లో అక్రమాలు జరుగుతున్నాయని మీరే చెప్పారని అన్నారు. ఐపీఎస్ అధికారులను బెదిరించింది మీరు కాదా? అని ప్రశ్నించారు. అక్రమాలు మీరు చేసి... ఇప్పుడు రెడ్ బుక్ అంటూ బుకాయింపులా? అని మండిపడ్డారు. మీ స్వార్థం కోసం అధికారులను కూడా బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విడదల రజని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తాను ఫిర్యాదు చేసినట్టు ఆమె చెబుతున్నారని... పోతారం బాషా, ఎంపీపీ శంకర్ రావు, ముత్తా వాసు, గోల్డ్ శీను, అబ్బాస్ ఖాన్, నాగయ్య వద్ద విడదల రజని డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని చెప్పారు. కేసును ఆపమని విడదల రజని రాయబారం పంపింది నిజం కాదా? అని ప్రశ్నించారు. Quote
psycopk Posted March 24 Author Report Posted March 24 Tammineni Sitaram: మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీపై ప్రభుత్వ విచారణ! 24-03-2025 Mon 07:26 | Andhra వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిగ్రీ వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విచారణ చేపట్టనున్నారు. వైసీపీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయిన తమ్మినేని నకిలీ డిగ్రీ ధ్రువీకరణ పత్రాలతో మోసం చేస్తున్నారని, దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని తాను ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు ఎమ్మెల్యే కూన రవికుమార్ నిన్న తెలిపారు. తమ్మినేని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఎన్నికల్లో నామినేషన్ వేసినట్టు ఎమ్మెల్యే ఆరోపించారు. తన ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ఎస్. సురేశ్ కుమార్ దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ను ఆదేశించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.