Jump to content

Recommended Posts

Posted

BYD cars: తెలంగాణకు బీవైడీ!

తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రాబోతోంది. చైనా విద్యుత్తు కార్ల దిగ్గజ సంస్థ బీవైడీ, హైదరాబాద్‌ సమీపంలో విద్యుత్తు కార్ల యూనిట్‌ స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.

 

భారీ పెట్టుబడుల ప్రణాళిక
హైదరాబాద్‌ సమీపంలో విద్యుత్తు కార్ల యూనిట్‌

 

ఈనాడు బిజినెస్‌ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రాబోతోంది. చైనా విద్యుత్తు కార్ల దిగ్గజ సంస్థ బీవైడీ, హైదరాబాద్‌ సమీపంలో విద్యుత్తు కార్ల యూనిట్‌ స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఈ సంస్థ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు సాగిస్తూ.. ఇటీవల తుది నిర్ణయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి కేటాయించడంతో పాటు, అన్నిరకాలుగా మద్దతు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

మూడు ప్రాంతాల పరిశీలన

హైదరాబాద్‌ పరిసరాల్లో యూనిట్‌ ఏర్పాటుకు అనువైన మూడు ప్రదేశాలను బీవైడీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడింటినీ ఆ సంస్థ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. ప్రదేశంపై తుది నిర్ణయానికి రాగానే, ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇది కార్యరూపం దాల్చితే విద్యుత్తు కార్ల విభాగంలో అతిపెద్ద ప్రైవేటు రంగ ప్రాజెక్టును, భారీ పెట్టుబడిని దక్కించుకున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది. దీంతో పాటు విద్యుత్తు కార్ల విడిభాగాలు ఉత్పత్తి చేసే అనుబంధ యూనిట్లూ దీనికి సమీపంలో ఏర్పాటయ్యే అవకాశాలుంటాయి. తద్వారా విద్యుత్తు  వాహనాల క్లస్టర్‌ హైదరాబాద్‌ సమీపంలో రూపుదిద్దుకున్నట్లు అవుతుంది. 

దేశంలో సంస్థకు తొలి యూనిట్‌ ఇదే

బీవైడీ కొన్నేళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నా, ఇక్కడ సొంత యూనిట్లు లేవు. ప్రస్తుతం బీవైడీ విద్యుత్తు కార్లను చైనా నుంచి మనదేశానికి తీసుకువచ్చి విక్రయిస్తోంది. ఇందుకోసం అధిక దిగుమతి సుంకాలు చెల్లించాల్సి రావడంతో, ప్రస్తుతం ఈ కార్ల ధర ఎక్కువగా ఉంది. ఫలితంగా ఆశించిన రీతిలో అమ్మకాలు చేయలేకపోతోంది. విద్యుత్తు కార్లను మనదేశంలో ఉత్పత్తి చేస్తే ధర తగ్గుతుంది. తద్వారా అమ్మకాలు గణనీయంగా పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మనదేశంలో సొంత యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు రెండేళ్లుగా బీవైడీ కసరత్తు చేస్తోంది. కాకపోతే చైనా పెట్టుబడులను అనుమతించే విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండటంతో ఇప్పటివరకు సాధ్యం కాలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో, బీవైడీ ప్రాజెక్టుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా విద్యుత్తు బస్సుల కార్యకలాపాలు సాగిస్తున్న ఎంఈఐఎల్‌ గ్రూపు సంస్థ  ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌తో ఎన్నో ఏళ్లుగా బీవైడీకి సాంకేతిక భాగస్వామ్యం ఉంది. బీవైడీ టెక్నాలజీతోనే విద్యుత్తు బస్సులను ఉత్పత్తి చేసి, దేశవ్యాప్తంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సరఫరా చేస్తోంది. తన విద్యుత్తు కార్ల యూనిట్‌ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రాన్ని బీవైడీ ఎంచుకోడానికి ఇదీ ఒక కారణమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


బ్యాటరీ ప్లాంట్‌ కూడా

నదేశంలో కార్ల అసెంబ్లింగ్‌ ప్లాంటుతో పాటు 20 గిగావాట్ల బ్యాటరీ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలనేది బీవైడీ ప్రణాళికగా ఉంది. అయిదు నుంచి ఏడేళ్లలో ఏటా 6 లక్షల విద్యుత్తు కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించే స్థాయికి తన కార్యకలాపాలను విస్తరించాలని ఈ సంస్థ భావిస్తోంది. ఇందుకోసం దశల వారీగా భారీ పెట్టుబడి పెట్టేందుకు బీవైడీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకలాపాల్లో అమెరికా విద్యుత్తు కార్ల దిగ్గజం టెస్లాను బీవైడీ మించుతోంది. గతేడాది టెస్లా ఆదాయం 97.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8.40 లక్షల కోట్లు) అయితే, బీవైడీ ఆదాయం 107 బి. డాలర్లు/సుమారు రూ.9.20 లక్షల కోట్లు కావడం గమనార్హం. చైనా, ఐరోపా దేశాల్లో టెస్లా అమ్మకాలు తగ్గుతుంటే, బీవైడీ అమ్మకాలు పెరుగుతున్నాయి. కేవలం 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే విద్యుత్తు కార్ల బ్యాటరీని పూర్తిగా ఛార్జి చేయగలిగే 1 మెగావాట్‌ ఫ్లాష్‌ ఛార్జర్‌ను ఈ సంస్థ ఇటీవల విడుదల చేసింది. దీంతో ఒకసారి ఛార్జి చేసి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయొచ్చు. విద్యుత్తు వాహనాల తీరుతెన్నులను ఈ టెక్నాలజీ సమూలంగా మార్చివేస్తుందని అంచనా వేస్తున్నారు.

  • Like 1
Posted

Trillions of investment…Billion in revenue…jobs in lakhs…

ila okka PPT kuda padaledu…ala ela vastadi ?

  • Haha 2
Posted
39 minutes ago, Android_Halwa said:

Trillions of investment…Billion in revenue…jobs in lakhs…

ila okka PPT kuda padaledu…ala ela vastadi ?

Adi ap lo an a tg lo no ppt just starting with foundation laying and jcb doing work we believe I work rather than  ppt 

No matter who is in power tg is ready for business automatic mode kcr ktr gumpu mestri no matter  they keep koming from 1970's 

To till date 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...