Jump to content

Recommended Posts

Posted

Earthquake-మయన్మార్‌, బ్యాంకాక్‌ల‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిన భ‌వ‌నాలు.. వైర‌ల్ వీడియో 

28-03-2025 Fri 13:39 | International
Massive Earthquake Strikes Myanmar and Bangkok Buildings Collapse
 

 

  • 7.7 తీవ్రతతో భూకంపం 
  • భ‌యాందోళ‌న‌తో ఇళ్లు, కార్యాల‌యాల నుంచి బ‌య‌టికి ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు
  • ఒళ్లు గ‌గుర్పొడిచే వీడియోలు నెట్టింట వైర‌ల్
శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్క‌సారిగా భారీ ప్ర‌కంప‌న‌లు రావ‌డంతో భారీ భ‌వ‌నాలు పేక మేడ‌ల్లా కుప్ప‌కూలాయి. ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌తో ఇళ్లు, కార్యాల‌యాల నుంచి బ‌య‌టికి ప‌రుగులు తీశారు. ఇందుకు సంబంధించిన ఒళ్లు గ‌గుర్పొడిచే వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

ఇక భూకంప కేంద్రం సాగింగ్ నగరానికి వాయువ్యంగా 16 కిలోమీట‌ర్ల‌ దూరంలో 10 కిలోమీట‌ర్ల‌ లోతులో ఉందని యూఎస్‌ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని నివేదికలు పేర్కొన్నాయి.

ఇక ఈ భూకంపం కార‌ణంగా పొరుగున ఉన్న థాయ్‌లాండ్ రాజ‌ధాని బ్యాంకాక్‌లో తీవ్ర ప్రకంపనలు సంభవించాయి. దీంతో అక్క‌డ‌ కొన్ని మెట్రో, ఇత‌ర‌ రైలు సేవలు నిలిపివేశారు. అలాగే చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయని బీజింగ్ భూకంప సంస్థ తెలిపింది.

థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా పరిస్థితిని సమీక్షించడానికి ఎమ‌ర్జెన్సీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. యునాన్‌లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతను నమోదు చేసిందని చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ వెల్ల‌డించింది.
Posted

Narendra Modi: మయన్మార్, థాయిలాండ్ లో భూకంపంపై ప్రధాని మోదీ స్పందన 

28-03-2025 Fri 14:17 | National
PM Modi Responds to Myanmar Thailand Earthquake
 

 

  • ఆగ్నేయాసియా దేశాలను కుదిపేసిన భూకంపం
  • మయన్మార్ లో 7.7 తీవ్రతతో భూకంపం
  • 12 నిమిషాల వ్యవధిలో 6.4 తీవ్రతతో మరో భూకంపం
  • సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న ప్రధాని మోదీ 
  • భూకంప బాధిత దేశాలతో సంప్రదింపులు జరపాలని విదేశాంగశాఖకు ఆదేశం
ఆగ్నేయాసియా దేశాలు మయన్మార్, థాయిలాండ్ నేడు భారీ భూకంపంతో వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి భారీ భవనాలు సైతం నెలకొరిగాయి. మయన్మార్ లో ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూలిపోయిన ఓ భవనం శిథిలాల్లో 43 మంది చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. 

ఈ భూకంపంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. సహాయ చర్యలపై భూకంప బాధిత దేశాలను సంప్రదించాలని ప్రధాని మోదీ విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. 

కాగా, మయన్మార్ ను రెండు వరుస భూకంపాలు కుదిపేశాయి. 12 నిమిషాల వ్యవధిలో ఈ రెండు భూకంపాలు సంభవించినట్టు రికార్డయింది. మొదట వచ్చిన భూకంపం తీవ్రత 7.7 కాగా... రెండోసారి వచ్చిన భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. థాయిలాండ్ లో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అటు, బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ 7.3 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. 

భారత్ లోని పలు ప్రాంతాల్లోనూ మయన్మార్ భూకంప ప్రభావం కనిపించింది. కోల్ కతా, మేఘాలయా, ఇంఫాల్ లో ఓ మోస్తరు ప్రకంపనలు వచ్చాయి. మేఘాలయాలోని ఈస్ట్ గారో హిల్స్ లో 4.0 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.
Posted

Sastagrahakutami effect starts...

  • Sad 1
Posted
24 minutes ago, johnydanylee said:

Sastagrahakutami effect starts...

Solar eclipse 

Posted
45 minutes ago, fasak_vachadu said:

Solar eclipse 

 

1 hour ago, johnydanylee said:

Sastagrahakutami effect starts...

America/mexico lo kuda undhi annaaru..

Posted

That was buildign under construction.

Idhi padiunte beebatsham undedhi.

 

Another one.

Paina unnollakki picchalu pack ayindali.

 

 

Posted

Infra damage baaga ayinatu vundi….

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...