psycopk Posted March 28 Author Report Posted March 28 Chandrababu Naidu: ఇది పూజారి ఇచ్చిన రింగ్ కాదమ్మా!: సీఎం చంద్రబాబు 28-03-2025 Fri 18:29 | Andhra మద్రాస్ ఐఐటీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం టెక్నాలజీ ఆవశ్యకతను వివరించిన ఏపీ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మద్రాస్ ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ విద్యార్థిని సృజన... సీఎం చంద్రబాబును ఓ ప్రశ్న అడిగింది. తాను తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన అమ్మాయినని పరిచయం చేసుకున్న సృజన... ప్రతి ఇంట్లో టెక్నాలజీ డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ ఏఐ, ఎంఎల్ (మెషీన్ లెర్నింగ్) నేర్చుకోవాలి అన్నారు కదా... ఏఐ, తదితర టెక్నాలజీలను మరింత అభివృద్ధి పరిచేందుకు విద్యావ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అటువంటి విద్యా వ్యవస్థల్లో ఐఐటీలను ఎలా భాగస్వాములను చేస్తారు? అని ప్రశ్నించింది. అందుకు చంద్రబాబు బదులిచ్చారు. నువ్వు ఎప్పుడు పుట్టావమ్మా అని అ అమ్మాయిని అడిగారు. ఆ అమ్మాయి 1997లో సర్ అని వెల్లడించింది. అయితే నువ్వు పుట్టడానికి రెండేళ్ల ముందే సీఎంను అయ్యాను.... నీది ఏ జిల్లా అని అడిగారు. కరీంనగర్ అని ఆ విద్యార్థిని వెల్లడించింది. అక్కడ్నించి చంద్రబాబు తన ప్రసంగం కొనసాగించారు. "నువ్వు హైదరాబాద్ ను చూసి ఉంటావు... ఎంత డెవలప్ అయిందో తెలుసు కదా. ఎవరికైనా సరే ఆలోచనలు అనేవి ఉండాలి... వాటిని ఆచరణలో పెట్టాలి. భవిష్యత్ అంతా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానిదే. ఐటీ గురించి పెద్దగా ఎవరికీ తెలియని రోజుల్లో నేను ఐటీ గురించి మాట్లాడాను. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే చాలామందికి తెలియదు. ప్రస్తుతం భారతదేశంలో 68 శాతం మంది ఏఐని ఉపయోగిస్తున్నారు. అంతెందుకు... హైదరాబాద్ ను ఎవరు డెవలప్ చేశారు? అని గూగుల్ అంకుల్ ని అడగండి... ఏఐ సాయంతో సమాధానం వస్తుంది. చాలామంది తెలిసో, తెలియకో ఏఐని వినియోగిస్తుంటారు. రియల్ డేటా ఉండాలే కానీ ఏదైనా సాధ్యమే. ఇప్పుడన్నీ సెన్సార్ల సాయంతో అనేక పనులు చక్కబెడుతున్నాం. శరీరంలో గ్లూకోజ్ శాతం ఎంత ఉందో కూడా సెన్సార్లు చెప్పేస్తాయి. దాన్నిబట్టి మనం ఆహారం తీసుకుంటే సరిపోతుంది. నా చేతి వేలికి ఉన్న రింగ్ చూడండి... ఇది ఏ పూజారి ఇచ్చిన ఉంగరమో కాదు... ఏ మూఢ నమ్మకాలతో ధరించిన వస్తువో కాదు. ఇదొక మానిటరింగ్ డివైస్. ఉదయం లేవగానే నా శరీరం సంసిద్ధతను ఈ రింగ్ చెప్పేస్తుంది. స్లీప్ స్కోర్, హార్ట్ బీట్... ఇలా అనేక అంశాలను ఈ రింగ్ వెల్లడిస్తుంది. దాన్ని బట్టి నేను నడుచుకుంటాను" అని వివరించారు. 1 Quote
psycopk Posted March 28 Author Report Posted March 28 Chandrababu: బ్రిటీష్ వాళ్లు ఒక్క ఇంగ్లీష్ ని మాత్రమే వదిలేసి... అంతా తీసుకుపోయారు: మద్రాస్ ఐఐటీలో చంద్రబాబు 28-03-2025 Fri 15:33 | Andhra యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్న చంద్రబాబు కమ్యూనికేషన్ రంగంలో ప్రైవేట్ సంస్థల ఎంట్రీ గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్య అందరం కలిసి కృషి చేస్తే ఇండియా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందన్న బాబు కొంతకాలంగా భారత్ వృద్ధిరేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2014లో ప్రపంచంలో పదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుందని చెప్పారు. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తోందని అన్నారు. మద్రాస్ ఐఐటీలో నిర్వహించిన 'ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025' కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మద్రాస్ ఐఐటీ ఎన్నో విషయాలలో నెంబర్ వన్ గా ఉందని చంద్రబాబు కితాబునిచ్చారు. ఎన్నో రకాల ఆన్ లైన్ కోర్సులు కూడా అందిస్తోందని చెప్పారు. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ లలో 80 శాతం సక్సెస్ అవుతున్నాయని తెలిపారు. స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాన్ని అందుకుందని చెప్పారు. మద్రాస్ ఐఐటీలో 35 నుంచి 40 శాతం మంది తెలుగు విద్యార్థులే ఉన్నారని అన్నారు. ఐఐటీలను స్థాపించడం దేశ విద్యారంగంలో గొప్ప ముందడుగు అని చెప్పారు. 1991లో తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్ అభివృద్ధి బాట పట్టిందని చంద్రబాబు అన్నారు. అదే సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు చేపట్టిందని... ఆ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. బ్రిటీష్ వాళ్లు ఒక్క ఇంగ్లీష్ ను మాత్రమే మనకు వదిలేసి... మన దేశం నుంచి అంతా తీసుకుపోయారని అన్నారు. 1990లలో కమ్యూనికేషన్ రంగంలో బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ మాత్రమే ఉండేవని... ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేట్ సంస్థల ఎంట్రీ ఇవ్వడం ఒక గేమ్ ఛేంజర్ అని చెప్పారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను కలుస్తానని చెప్పినప్పుడు రాజకీయ నాయకులతో తనకు సంబంధం లేదని ఆయన చెప్పారని... ఆ తర్వాత ఆయనను ఒప్పించి అపాయింట్ మెంట్ తీసుకున్నానని, 45 నిమిషాలు మాట్లాడానని తెలిపారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టాలని కోరానని చెప్పారు. ఇప్పుడు అదే మైక్రోసాఫ్ట్ కు తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్నారని కొనియాడారు. మన దేశానికి ఉన్న గొప్ప వరం జనాభా అని చంద్రబాబు చెప్పారు. చాలా దేశాలు జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్నాయని... మన దేశానికి మరో 40 ఏళ్ల వరకు ఆ సమస్య లేదని అన్నారు. అందరం కలిసి కృషి చేస్తే త్వరలోనే భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని చెప్పారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.