ntr2ntr Posted March 29 Report Posted March 29 తెలుగుదేశం పార్టీ..! -------------------------- తెలుగోడి పార్టీ ! ఎమర్జన్సీ అనంతరం కాంగ్రెస్ ఘోరపరాజయం పాలై..కలగూరగంప గా ముద్ర పడిన జనతా పార్టీ విఫలమై..తిరిగి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అడ్డా! యన్టీఆర్ పార్టీ పెడతారంట..! వార్తలు వచ్చాయి..పుకార్లు షికార్లు చేసాయి..! 1982..మార్చి 29..పార్టీ ఆవిర్భావం..పేరు ప్రకటించారు..యన్టీఆర్! తెలుగుదేశం..! యన్టీఆర్ అభిమానుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. యన్టీఆభిమానులం కాకపోయినా..కాంగ్రెస్ వ్యతిరేకత ఆవైపు ఆకర్షించింది. యన్టీఆర్ చైతన్యరధం రాష్ట్రం చుట్టేయటానికి బయలుదేరింది. అన్నగారి పర్యటన సాగుతున్నన్ని రోజులు..నడివేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినట్టు..జనజాతర మొదలయింది. ఆయన ప్రత్యర్ధులు అది సినిమా ఆకర్షణగానే భావించారు..అలాగే వ్యాఖ్యానించేవారు. ఆయన పర్యటనకు ఆటంకాలు కల్పించారు. వసతి దొరక్కుండా చూసేవారు. పత్రికల్లో వార్తలు..!యన్టీఆర్..జనం..జనం..ప్రభంజనం..! బళ్ళకు హెడ్ లైట్ స్టిక్కర్లు..తెలుగుదేశం పిలుస్తుంది రా! కదలిరా ! ఖాకీ డ్రెస్ లో యన్టీఆర్..మాటల తూటాలు..ఉర్రూతలూగించే ప్రసంగాలు. చైతన్యరధయాత్ర సాగుతుండగానే ఎన్నికలు వచ్చేసాయి. పార్టీ జెండాలు ..బేడ్జీలు..స్టిక్కర్లు..ప్రయివేటు వ్యాపారులు ముద్రించి అమ్మేవారు..! కార్యకర్తలు జెండా కొనుక్కుని మరీ మోసారు. ఎన్నికలు ముగిసాయి..కాంగ్రెస్ వారి దింపుడు కళ్ళం ఆశ చావలేదు. సినీ గ్లామరుకి ఓట్లు పడవని వారికి నమ్మకం..! అమ్మ బొమ్మకే ఓటేస్తారని అచంచల విశ్వాసం వారికి..! కౌంటింగ్ రోజు..సాయంత్రం..గాలి తోలటం మొదలయింది. మొదటి ఫలితం షాద్ నగర్..కాంగ్రెస్ కైవసం! కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం..! రేడియో వార్తలు..ఫలితాల సరళి వెల్లడవుతున్నది. ఒక్కో జిల్లా..వరుసగా ఆధిక్యతలు చెబుతూ వస్తున్నారు. జిల్లాలకు జిల్లాలు తుడుచిపెట్టుకుపోయాయి. వేళ్ళూనుకున్న కాంగ్రెస్ మహావృక్షాలు..కూలిపోయాయి. కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది పాట రేడియోలో వేస్తున్నారు. అన్నగారి పాటలతో హోరెత్తిపోయింది. ఒక్కో నియోజక వర్గం ఆధిక్యతలు చెబుతుంటే..జనం స్పందన జేజేలు..ప్రత్యర్ధుల హాహాకారాలు..ఆర్తనాదాలు. యన్టీఆర్ ప్రభంజనాన్ని ..ఈ రీతి విజయాన్ని వారు ఊహించలేదు. దాదాపు అర్ధరాత్రికే మూడింట రెండొంతులు పైగా స్దానాలు కైవసం చేసుకుని..విజయం సంపూర్ణమని నిర్ధారించబడింది. ఇప్పటి లాగే అప్పుడు కూడా విషపుత్రికలు..అబద్దపు పత్రికలు ఉండేవి. దాదాపు అన్ని పత్రికలు..ప్రధాన శీర్షికలు..తెలుగుదేశం ప్రభంజనం..తెలుగుదేశం సూపరు హిట్టు అని పెడితే..ఒకటి రెండు పత్రికలు..ఇంకా లెక్కింపు కొనసాగుతున్నట్టు..టీడీపి ఘనవిజయాన్ని తక్కువ చేసి చూపించటానికి ప్రయత్నం చేసారు. డాక్టర్లు..ఇంజినీర్లు..లాయర్లు..!పట్టభద్రులు..బడుగుబలహీన వర్గాలకు చెందిన కొత్తరక్తం రాజకీయాల్లో అరంగేట్రం చేసారు. తెలుగురాజకీయాల్లో..తెలుగుదేశం పార్టీ తో నవశకం ప్రారంభమయింది. సామాజిక విప్లవం...! బడుగుబలహీన వర్గాల వేదికయింది. తెలుగు వాడి ఆత్మగౌరవానికి..ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయింది. నలభై మూడు సంవత్సరాలు..! పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ..! *తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు...నాయకులకు శుభాకాంక్షలు! 1 1 Quote
Jimmyfallon Posted March 30 Report Posted March 30 3 hours ago, Redarya said: MG raa LKB BJ raa KKLK 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.