Jump to content

Recommended Posts

Posted

 

Vanajeevi Ramayya: గుండెపోటుతో వనజీవి రామయ్య కన్నుమూత 

12-04-2025 Sat 07:43 | Telangana
Vanajeevi Ramayya Padma Shri Awardee Passes Away
 

           

మొక్కల ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. జీవితమంతా మొక్కలు నాటి పెంచిన ఆయన ఇంటి పేరే వనజీవి అయింది. రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి. కోటికిపైగా మొక్కలు నాటిన రామయ్య సరికొత్త రికార్డు సృష్టించారు. 2017లో రామయ్యను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

 

 

 

Posted

Vanajeevi Ramayya: వనజీవి రామయ్య మృతిపై చంద్రబాబు సంతాపం 

12-04-2025 Sat 12:23 | Andhra
Chandrababu Naidu Condoles the Death of Vanajeevi Ramayya
 

-- 

పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక లేరనే వార్త విని తీవ్ర విచారానికి లోనయ్యానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు వనజీవి రామయ్య ఒక్కరే కోటి మొక్కలు నాటడం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. మొక్కలు నాటుతూ అడవులను సృష్టించిన రామయ్య సేవలు అమోఘమని కొనియాడారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు.

నేటి తరానికి రామయ్య ఆదర్శప్రాయుడని, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఆయన చేసిన కృషి అసామాన్యమని చెప్పారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వనజీవి రామయ్య కుటుంబానికి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Posted

 

Vanajeevi Ramayya: వనజీవి రామయ్య మృతిపట్ల ఏపీ ఉపముఖ్యమంత్రి సంతాపం 

12-04-2025 Sat 13:13 | Andhra
AP Deputy CM Condoles Vanajeevi Ramayyas Death
 

 

  • రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తామన్న పవన్ కల్యాణ్
  • ఆ దంపతులు చేసిన వనయజ్ఞంతో ఎన్నో తరాలకు మేలన్న పవన్ 
  • ఆరు దశాబ్దాల పాటు అలుపెరగని కృషి చేశారన్న డిప్యూటీ సీఎం
ఆరు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వనజీవి రామయ్య మరణం తీరని లోటని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వనజీవి మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. వనజీవి రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. 

‘పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం. తన జీవిత కాలంలో సుమారు కోటి మొక్కలు నాటారు. ఆయన కన్నుమూశారని తెలిసి చింతించా. వృక్షో రక్షతి రక్షిత: అనే పెద్దల మాటలోని వారసత్వాన్ని ప్రజలకు తెలియజేసేందుకు రామయ్య పడిన తపన సమాజానికి ఎంతో మేలు చేస్తోంది. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటుతూ, విత్తనాలు జల్లుతూ పచ్చదనం పెంచడానికి రామయ్య, ఆయన సతీమణి చేసిన వనయజ్ఞం ఎన్నో తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిస్తుంది. ఓసారి ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఉన్న రామయ్యను పరామర్శించా. అప్పుడు కూడా ఆయన పర్యావరణ పరిరక్షణపైనే మాట్లాడారు. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు కృషి చేస్తాం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తాం’’ అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 

 

 

Posted

Vanajeevi Ramayya: వనజీవి రామయ్య మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన 

12-04-2025 Sat 14:05 | Telangana
PM Modi Condoles the Death of Environmentalist Vanajeevi Ramayya
 

 

  • గుండెపోటుతో కన్నుమూసిన వనజీవి రామయ్య
  • ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన పర్యావరణ ప్రేమికుడు
  • సంతాప సందేశం వెలువరించిన ప్రధాని మోదీ 
ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య ఈ ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. మొక్కలు నాటడమే పరమావధిగా భావించిన రామయ్య మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారని కీర్తించారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితం ఇచ్చారని కొనియాడారు. 

"రామయ్య అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ, భవిష్యత్ తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో రామయ్య కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను... ఓం శాంతి" అంటూ మోదీ తన సంతాప సందేశం వెలువరించారు.
Posted

 

Ramaiah: రామయ్య మరణం తెలంగాణకు తీరని లోటు: బండి సంజయ్ 

12-04-2025 Sat 13:02 | Telangana
Ramaiahs Death An Irreparable Loss to Telangana Says Bhandi Sanjay
 

 

  • గుండెపోటు కారణంగా వనజీవి రామయ్య మృతి
  • రామయ్య మృతిపై విచారం వ్యక్తం చేసిన బండి సంజయ్
  • జీవిత కాలంలో కోటికి పైగా మొక్కలు నాటారని కితాబు
తన జీవితాన్ని మొక్కలు నాటడానికే అంకితం చేసిన వనజీవి రామయ్య గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. తన జీవిత కాలంలో కోటికి పైగా మొక్కలను నాటి, పర్యావరణ పరిరక్షణకు అపారమైన సేవలు అందించారని కొనియాడారు. రామయ్య తన కుటుంబ సభ్యులకు సైతం చెట్ల పేర్లను పెట్టి, పర్యావరణంపై తన ప్రేమను చాటుకున్నారని చెప్పారు. 

రామయ్య చేసిన సేవలను గుర్తించిన మోదీ ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని తెలిపారు. ఆయన మరణం తెలంగాణకు, పర్యావరణ సమాజానికి తీరని లోటు అని చెప్పారు. వనజీవి బిరుదుతో ప్రసిద్ధిగాంచిన రామయ్య మరణం బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 

 

 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...