Jump to content

Tapudu pracharam ani munda mopi edupu enduku charyarlu evi tdp?? Cheta kakapote accept the blame


Recommended Posts

Posted

Kollu Ravindra: అలాంటి వ్యక్తి కోసం... గోవులు మృతి చెందాయని భూమన ఆరోపించడం సిగ్గుచేటు: మంత్రి కొల్లు రవీంద్ర 

12-04-2025 Sat 22:40 | Andhra
Minister Kollu Ravindra Condemns Bhumanas Allegations on TTD
 

 

  • టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని భూమన ఆరోపణలు
  • మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్
  • విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం
రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని జగన్ రెడ్డి మరియు ఆయన అనుచరులు కుట్ర పన్నుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. గత ఐదేళ్లలో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చిన వ్యక్తి కోసం గోశాలలో ఆవులు మృతి చెందాయంటూ కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భూమన ఉద్దేశాలను ప్రజలు గమనించాలి

నాస్తికుడినని చెప్పుకునే కరుణాకర్ రెడ్డి ఇప్పుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, దీని వెనుక ఆయన ఉద్దేశాన్ని ప్రజలు గమనించాలని రవీంద్ర అన్నారు. లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కరుణాకర్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వెంకటేశ్వరస్వామిని నల్లరాయి అని దుర్భాషలాడిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలు చూపిస్తూ గోశాలలో 100 ఆవులు చనిపోయాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గోశాలను 250 మందికి పైగా పర్యవేక్షిస్తూ, జీయో ట్యాగింగ్ ద్వారా గోవులను సంరక్షిస్తుంటే, జీయోట్యాగింగ్ జరగడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన సదుపాయాలతో, ప్రతిరోజు బ్లీచింగ్ చల్లుతూ, గోవులను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్న కరుణాకర్ రెడ్డి, చైర్మన్‌గా పనిచేసినప్పుడు ప్లాస్మా టీవీల కుంభకోణం, తాళిబొట్ల కుంభకోణం, డాలర్ల మాయం వంటి వాటికి పాల్పడింది నిజం కాదా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. తిరుమల ఖజానాను దారి మళ్లించి కొల్లగొట్టింది వాస్తవం కాదా? కోవిడ్ సమయంలో స్వామి వారి లడ్డూ ప్రసాదాలను దారి మళ్లించింది నిజం కాదా? కరుణాకర్ రెడ్డి తన కుమార్తె వివాహాన్ని క్రైస్తవ పద్ధతుల్లో జరిపింది నిజం కాదా? అని నిలదీశారు. అలాంటి వ్యక్తి తిరుమల దేవస్థానం గురించి, హిందూ మత ఆచారాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

తిరుమల ప్రతిష్ట కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి అన్నదాన ట్రస్ట్ ప్రారంభించారని, అక్కడ ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అది ఎన్టీఆర్ కృషి వల్లే అని ఆయన అన్నారు. 

విగ్రహం తల తీస్తే పట్టించుకున్నారా?

గత ఐదేళ్లు హిందుత్వంపై దాడి జరిగితే జగన్ రెడ్డి ఎప్పుడూ నోరు మెదపలేదని, అంతర్వేది రథం తగలబెట్టినా పట్టించుకోలేదని, రామతీర్థంలో రాములవారి విగ్రహం తలను దుండగులు తీసేస్తే పట్టించుకోలేదని, విజయవాడ అమ్మవారి గుడిలో వెండి సింహాలు దొంగిలిస్తే చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. నేడు తప్పుడు ప్రచారాలతో కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

పాస్టర్ చనిపోతే ఒక మతానికి అంటగట్టాలని చూశారు

భక్తులకు సక్రమంగా సౌకర్యాలు కల్పిస్తూ, భక్తులు ఆనందంగా ఉండేలా చూస్తుంటే, వైసీపీ మూకలు టీటీడీని అల్లరి చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక పాస్టర్ యాక్సిడెంట్‌లో చనిపోతే, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఒక మతానికి అంటగట్టాలని చూశారని, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆయన అన్నారు. దీనిపై పాస్టర్ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి పోలీసులపై, ప్రభుత్వంపై నమ్మకం ఉందని చెబితే సైలెంట్ అయ్యారని ఆయన గుర్తు చేశారు. 

రాష్ట్రంలో ముస్లింలను రెచ్చగొట్టాలని చూశారని, పార్లమెంటులో అనుకూల ఓటింగ్ వేసి బయటకు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Posted

Of course….criminal case file chestaru…

Animal fat ani abadham seppinolla mida emi caselu pettali mari ?

Posted
51 minutes ago, Android_Halwa said:

Of course….criminal case file chestaru…

Animal fat ani abadham seppinolla mida emi caselu pettali mari ?

Last time pink diamond ani lepinapudu deeshit ni lopala vesi savara teyalsindi… cbn did a mistake 

Posted
26 minutes ago, psycopk said:

Last time pink diamond ani lepinapudu deeshit ni lopala vesi savara teyalsindi… cbn did a mistake 

Inkenni mistakes chestadu vaa CbN ? Lopala enduku veyaledu ? 

  • Upvote 1
Posted
4 hours ago, Android_Halwa said:

Inkenni mistakes chestadu vaa CbN ? Lopala enduku veyaledu ? 

Andukue Jaggad great. Tana party vallu emi chesina blind eye. Pakkollu chesthe iraga denge vadu. 
 

Ravali Jagan

Posted

J. Syamala Rao: భూమన ఆరోపణలు... విజిలెన్స్ నివేదికలతో టీటీడీ ఈవో కౌంటర్ 

14-04-2025 Mon 13:57 | Both States
Vigilance Reports Expose Irregularities in TTD says EO
 

 

  • మాజీ చైర్మన్ భూమన ఆరోపణలు అవాస్తవమన్న ఈవో శ్యామలరావు
  • గోశాలలో గతంలోనే అవకతవకలు.. పాత విజిలెన్స్ నివేదికల వెల్లడి
  • పురుగులు పట్టిన దాణా, గడువు తీరిన మందుల వాడకం గతంలో జరిగాయని ఆరోపణ
  • గోవుల మరణాల సగటు సాధారణమే... దాచిపెట్టడం లేదని వివరణ 
  • ప్రసాదాలు, నెయ్యి నాణ్యత పెంచామని స్పష్టీకరణ 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత ప్రభుత్వ పాలనలో పలు విభాగాల్లో భారీ ఎత్తున అవకతవకలు, తీవ్రమైన నిర్లక్ష్యం చోటుచేసుకున్నాయని టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) జె. శ్యామలరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై, ముఖ్యంగా గోశాల నిర్వహణ, ఐటీ విభాగం, కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై పలు కీలక విషయాలను ఆధారాలతో సహా వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీలో వ్యవస్థల ప్రక్షాళనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

టీటీడీ గోశాలల నిర్వహణపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలను ఈవో శ్యామలరావు తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలు అవాస్తవమని, హిందువుల మనోభావాలను, టీటీడీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. గోశాలలో చోటుచేసుకున్న తీవ్ర నిర్లక్ష్యం, అవకతవకలు తమ హయాంలో జరిగినవి కావని, 2021 మార్చి నుంచి 2024 మార్చి మధ్య కాలంలో గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయని స్పష్టం చేశారు. ఇందుకు ఆధారంగా గత విజిలెన్స్ నివేదికలను, ఫోటోలు, వీడియోలను ఆయన మీడియాకు చూపించారు.

"గోవులు తాగే నీరు నాచు పట్టినా, పురుగులు పట్టినా ఎవరూ పట్టించుకోలేదు. పురుగులు పట్టిన, దుర్వాసన వస్తున్న నాణ్యత లేని దాణా పెట్టారు. లేబుల్స్ లేని, గడువు తీరిన మందులను వినియోగించారు. గోశాల ప్రాంగణంలో మందులు ఎక్కడపడితే అక్కడ పడేశారు" అని విజిలెన్స్ నివేదికల ఆధారంగా ఈవో ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో మరణించిన గోవుల వివరాలను (సప్రెషన్ ఆఫ్ డెత్స్) కూడా దాచిపెట్టారని, అసలు గోవులు లేని గోశాలకు దాణా సరఫరా చేసినట్లు చూపి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 

అనారోగ్యంతో ఉన్న పశువులను వేరుగా ఉంచకుండా మిగతా వాటితో కలిపి ఉంచడం, కనీసం విజిలెన్స్ అధికారులను కూడా తనిఖీలకు అనుమతించకపోవడం వంటివి గతంలో జరిగాయని నివేదికలను ఉటంకిస్తూ తెలిపారు. ఈ నివేదికలపై గతంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తాము ఇప్పుడు ప్రక్షాళన చర్యలు చేపట్టామని ఈవో తెలిపారు.

గత మూడు నెలల్లో 100కు పైగా గోవులు చనిపోయాయన్న ఆరోపణను ఖండిస్తూ, జనవరి-మార్చి మధ్య 43 గోవులు మరణించాయని, ఇది గత సంవత్సరాల సగటుకు (నెలకు సుమారు 15) అనుగుణంగానే ఉందని తెలిపారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా సహజ మరణాలు సంభవిస్తాయని, వీటిని దాచిపెట్టడం లేదని, పోస్టుమార్టం నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. 

ఇదే సమయంలో 59 దూడలు జన్మించాయని కూడా ఈవో శ్యామలరావు తెలిపారు. గోశాలల్లో సిబ్బంది కొరత ఉందని అంగీకరించి, ఖాళీగా ఉన్న 135 పోస్టులను భర్తీ చేయడానికి కమిటీ వేశామని తెలిపారు. ప్రస్తుత గోశాలల పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని, ఎవరైనా పరిశీలించుకోవచ్చని ఈవో అన్నారు.

టీటీడీ ఐటీ విభాగంలోనూ గత హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జీఎం స్థాయి అధికారి నియామకం జరిగిందని ఈవో ఆరోపించారు. ఐటీ విభాగం వైఫల్యం కారణంగానే ఒకే దళారి ఏకంగా 50 సార్లు ఆర్జిత సేవా టికెట్లను పొందగలిగారని తెలిపారు. స్వామివారికి వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలులో, అన్నప్రసాదం తయారీలో నాణ్యత లోపించిందని, గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన దాతను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని తెలిపారు. ప్రస్తుతం నాణ్యమైన నందిని నెయ్యిని వాడుతున్నామని, అన్నప్రసాదాల నాణ్యతను కూడా గణనీయంగా మెరుగుపరిచామని అన్నారు. 

ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, కేవలం రూ.3 కోట్ల విలువైన సరుకులకు ఏకంగా రూ.25 కోట్లు చెల్లించినట్లు గుర్తించామని శ్యామలరావు పేర్కొన్నారు. వివాదాస్పద వైష్ణవి డెయిరీకి గత మార్చిలో ఇచ్చిన పాల సేకరణ టెండర్‌ను నాణ్యతా లోపాల కారణంగా రద్దు చేశామని వెల్లడించారు.

తాను జూన్ 2024లో ఈవోగా బాధ్యతలు స్వీకరించే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశానని, టీటీడీలో వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిని సరిదిద్దాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని శ్యామలరావు గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్ది, టీటీడీలో ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టామని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వ్యవస్థలను గాడిలో పెట్టి, పారదర్శకమైన పాలన అందించడమే తమ లక్ష్యమని ఈవో స్పష్టం చేశారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...