Jump to content

Recommended Posts

Posted

Chandrababu Naidu: అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడు అంటూ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్ 

20-04-2025 Sun 08:58 | Andhra
Pawan Kalyan Wishes Chandrababu Naidu on 75th Birthday
 

 

  • నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు వేడుకలు
  • ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి
  • పవన్ కల్యాణ్ 
  • కుటుంబ సభ్యులతో యూరప్ లో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడు అంటూ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై, శాంతిభద్రతలు క్షీణించిపోయిన రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపచేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమని అన్నారు. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని మరోసారి తెలిపారు.

నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమని పవన్ కొనియాడారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వజ్రోత్సవ జన్మదిన శుభసమయాన ఆయనకు సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ అన్నారు.

కాగా, చంద్రబాబు నాయుడు ఈరోజు యూరప్‌లో కుటుంబ సభ్యుల మధ్య 75వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. మరోపక్క ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు చేయాలని మంత్రి అనం రామనారాయణ రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 
Posted

Chandrababu Naidu: హ్యాపీ బర్త్ డే అండీ.. చంద్రబాబుకు భువనేశ్వరి పుట్టిన రోజు శుభాకాంక్షలు 

20-04-2025 Sun 08:55 | Andhra
Bhuvaneswaris touching birthday message for Chandrababu Naidu
 

 

  • నేడు చంద్రబాబు 75వ పుట్టిన రోజు
  • మీకు తోడుగా ఉండటం గర్వంగా ఉందన్న భువనేశ్వరి
  •  ‘ఎక్స్’ వేదికగా భువనేశ్వరి విషెస్
నేడు వజ్రోత్సవ (75వ) పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలండీ’ అంటూ ఎక్స్ వేదికగా ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు.

‘‘మన ఆంధ్రప్రదేశ్ కుటుంబం పట్ల మీకున్న అంతులేని మక్కువతో మీరు నా ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నారు. మీ బలం, మీ దార్శనికత నన్ను ప్రతిరోజూ మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతున్నాయి. మీకు తోడుగా ఉండటం చాలా గర్వంగా ఉంది. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. నా ప్రేమతో మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటాను’’ అని భువనేశ్వరి రాసుకొచ్చారు. కాగా, చంద్రబాబు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
20250420fr68046c8c7899f.jpg
Posted

Chandrababu Naidu: అరుదైన నాయకుడు మీరు అంటూ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ 

20-04-2025 Sun 09:39 | Andhra
MegaStar Wishes Chandrababu Naidu on 75th Birthday
 

 

  • నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు వేడుకలు
  • ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మెగా స్టార్ చిరంజీవి 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు, నేతలు, సెలబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకుడు మీరు అంటూ చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. ఆ భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 
  • Haha 1
Posted

Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్ 

20-04-2025 Sun 09:54 | Andhra
Andhra CM Chandrababu Naidu Receives Birthday Wishes from Governor Abdul Nazeer
 

 

  • నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు 
  • ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన  గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ 
  • ప్రజా సేవలో సుదీర్ఘ కాలం ఉండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు, నేతలు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సామాజిక మాధ్యమాల వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, ప్రజాసేవలో సుదీర్ఘ కాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని గవర్నర్ అబ్దుల్ నజీర్ ట్వీట్ చేశారు. 
Posted

 

Chandrababu Naidu: నేడు చంద్రబాబు 75వ బర్త్ డే.. సంస్కరణలు, సాంకేతికత, స్థితప్రజ్ఞత కలబోసిన సుదీర్ఘ ప్రస్థానం 

20-04-2025 Sun 09:58 | Both States
Chandrababu Naidu Enters 75th Year  A Long Journey of Reforms Technology and Statesmanship
 

 

  • నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 75వ జన్మదినం
  • నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం
  • హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర, టెక్-సావీ పాలన
  • ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలో బాబు.. అక్కడే పుట్టినరోజు వేడుకలు
  • జన్మదిన కానుకగా మెగా డీఎస్సీ (16,347 పోస్టులు) నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తన 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా, హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలిపిన దార్శనికుడిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, ఆయన పుట్టినరోజునే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం.

చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1950, ఏప్రిల్ 20న జన్మించిన చంద్రబాబు నాయుడు, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1970లలో కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. 1983లో తన మామ, ఎన్.టి. రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరడం ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపు. 1984 సంక్షోభ సమయంలో పార్టీని నిలబెట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించారు.

1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ఆయన అప్రతిహతంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1995 సెప్టెంబర్ 1న, తన 45వ ఏట తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత, 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, 2019 వరకు పనిచేశారు. 2019 ఎన్నికలలో ఓటమి, 2023 సెప్టెంబర్‌లో నైపుణ్యాభివృద్ధి కేసులో అరెస్టు (నవంబర్ 2023లో బెయిల్) వంటి సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమిని విజయపథంలో నడిపించి, నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

చంద్రబాబు నాయుడు పాలన అనగానే ముందుగా గుర్తుకొచ్చేది హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి ఐటీ, సేవల రంగ కేంద్రంగా తీర్చిదిద్దడం. ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలకు ప్రాధాన్యతనిచ్చారు. 1998లో హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీలను ప్రారంభించి, హైదరాబాద్‌ను టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ఏర్పాటుతో నగరానికి ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరై, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి ప్రపంచ నేతలతో సమావేశమై హైదరాబాద్ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం ప్రపంచ బ్యాంకు నుంచి నేరుగా రుణం పొందిన తొలి భారత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపారు. ఆయన దార్శనికతకు గుర్తింపుగా టైమ్ మ్యాగజైన్ (1999) "సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్"గా, ఇండియా టుడే పోల్‌లో "ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం"గా ఎంపికయ్యారు.

2014-19 మధ్య విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించే బృహత్తర ప్రాజెక్టును చేపట్టారు. ఈ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

చంద్రబాబు నాయుడు తన సమకాలీన రాజకీయ నాయకులకు భిన్నంగా, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. ఆయనను 'సైబర్ బాబు'గా పిలవడం పరిపాటి. పార్టీ కార్యకలాపాలను కంప్యూటరీకరించడం వంటివి ఆయన ముందుచూపునకు నిదర్శనం. 75 ఏళ్ల వయసులోనూ యువ నాయకులకు దీటుగా పనిచేస్తారని, అత్యంత క్రమశిక్షణతో వ్యవహరిస్తారని పేరుంది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తన ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకోవడం, అభివృద్ధి ద్వారా ప్రజలకు సంపద సృష్టించి, ప్రయోజనాలు అందరికీ చేరేలా చూడాలనే తపన ఆయనను దశాబ్దాలుగా ప్రజా జీవితంలో నిలబెట్టాయి.

20250420fr680472d0a6e66.jpgముఖ్యమంత్రి చంద్రబాబు తన 75వ జన్మదినాన్ని కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 17న ప్రారంభమైన ఐదు రోజుల పర్యటనలో ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో ఆయన జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. కుప్పంలో మహిళలు ఫింగర్ ప్రింట్ ఆర్ట్‌తో తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు.

అన్నిటికంటే ముఖ్యంగా, ఎన్నికల హామీని నెరవేరుస్తూ 16,347 ఉపాధ్యాయ పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఆయన పుట్టినరోజున  విడుదల చేయడం వేలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు అసలైన కానుకగా నిలుస్తోంది.

ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, సంస్కరణవాదిగా, దార్శనికుడిగా తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్ అభివృద్ధి నమూనా దేశంలోని అనేక నగరాలకు ఆదర్శంగా నిలిచింది. రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా, మొక్కవోని దీక్ష, పరిస్థితులకు అనుగుణంగా మారే తత్వంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా కొనసాగుతున్నారు. 75వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో, ఆయన సుదీర్ఘ ప్రస్థానం, అభివృద్ధి పట్ల నిబద్ధత ఎందరికో స్ఫూర్తిదాయకం. 

 

 

 

Posted

YS Jagan: సీఎం చంద్ర‌బాబుకు వైఎస్ జ‌గ‌న్ బ‌ర్త్ డే విషెస్ 

20-04-2025 Sun 10:00 | Andhra
Chandrababu Naidus 75th Birthday YS Jagan Extends Wishes
 

 

  • నేడు సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు
  • ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లువెత్తుతున్న బ‌ర్త్ డే విషెస్ 
  • ‘ఎక్స్’ వేదికగా సీబీఎన్‌కు జ‌గ‌న్ జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు   
నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సీబీఎన్‌కు జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అటు కేంద్ర‌మంత్రులు, మంత్రులు ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెబుతున్నారు.  

తాజాగా ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదికగా చంద్ర‌బాబుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "హ్యాపీ బ‌ర్త్ డే నారా చంద్ర‌బాబు నాయుడు గారూ! మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను!" అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
Posted

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు 

20-04-2025 Sun 10:45 | Andhra
PM Modi Greets Andhra Pradesh CM Chandrababu Naidu on his Birthday
 

–– 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మిత్రుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. భవిష్యత్‌ రంగాలపై దృష్టి సారించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Posted

Nara Lokesh: నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. చంద్రబాబుకు లోకేశ్ బ‌ర్త్‌డే విషెస్‌ 

20-04-2025 Sun 11:04 | Andhra
Nara Lokeshs Birthday Wishes for Chandrababu Naidu
 

    

నేడు వజ్రోత్సవ (75వ) పుట్టిన రోజు జరుపుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సీబీఎన్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తాజాగా చంద్రబాబునాయుడికి ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

"నాన్నగారికి శుభాకాంక్షలు. నా స్ఫూర్తి నారా చంద్ర‌బాబు నాయుడు గారూ. వెరీ హ్యాపీ బ‌ర్త్ డే" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓ ఆస‌క్తిక‌ర వీడియోను కూడా జోడించారు. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...