Jump to content

Recommended Posts

Posted
చంద్రబాబు గారు సీయంగా ఉండగా పూర్తి చేసిన, పనులు వేగవంతం చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు. #HBDLegendCBN #ChandrababuNaidu #AndhraPradesh సిద్ధాపురం ఎత్తిపోతలు అడవిపల్లి రిజర్వాయరు మారాల రిజర్వాయరు చెర్లోపల్లి రిజర్వాయరు మడకశిర బ్రాంచి కెనాల్‌ ముచ్చుమర్రి ఎత్తిపోతల గోరుకల్లు రిజర్వాయరు అవుకు టన్నెల్‌ పులికనుమ ఎత్తిపోతలు పులికుర్తి ఎత్తిపోతలు కుప్పం బ్రాంచి కెనాల్‌ రాష్ట్ర రహదారి నెం.1 (చిత్రావతి నదిపై) గండికోట రిజర్వాయరు భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ శారదా నదిపై ఆనకట్ట కండలేరు ఎత్తిపోతలు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పెద్దపాలెం ఎత్తిపోతల పథకం కొండవీటి వాగు పంపింగ్‌ సిస్టమ్‌: చినసాన ఎత్తిపోతల పథకం గుండ్లకమ్మ రిజర్వాయరు కొరిశపాడు ఎత్తిపోతల పథకం పోగొండ రిజర్వాయరు ఎర్ర కాలువ ఆధునీకరణ నెల్లూరు బ్యారేజీ సంగం బ్యారేజీ వంశధార ప్రాజెక్టు - హిరమండలం రిజర్వాయరు వంశధార- నాగావళి అనుసంధానం పట్టిసీమ పోలవరం 76% పనులు గండికోట-సీబీఆర్‌ ఎత్తిపోతల చిన్నసాన ఎత్తిపోతల పెదపాలెం ఎత్తిపోతల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార ఫేజ్- 1, 2 తోటపల్లి బ్యారేజ్ మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రైవాడ రిజర్వాయర్ తారకరామతీర్థ సాగర్ తాడిపూడి పుష్కర లిఫ్ట్ చింతలపూడి ఎత్తిపోతల వెలిగొండ ప్రాజెక్టు-హెడ్‌ రెగ్యులేటర్‌ కృష్ణా డెల్టా ఆధునికీకరణ గోదావరి డెల్టా ఆధునికీకరణ గోదావరి కృష్ణా పెన్నా ఫ్లడ్ నియంత్రణ గోదావరి పెన్నా నదుల అనుసంధానం మద్దువలస స్టేజ్ -2 నాగావళి ఫ్లడ్ మల్లె మడుగు రిజర్వాయరు బాలాజీ రిజర్వాయరు వేణుగోపాల సాగర్‌ రిజర్వాయరు సోమశిల స్వర్ణముఖి రిజర్వాయర్‌ శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ నెట్టెంపాడు గాలేరు-నగరి సుజలస్రవంతి హంద్రీ నీవా బొంతు ఎత్తిపోతల దత్తి రాజేరు రక్షిత మంచినీటి పథకం ఆర్డీఎస్ కుడి కాలువ రాజోలీబండ కుడి కాలు శ్రీరాం సాగర్ ప్రియదర్శిని జూరాల కల్వకుర్తి ఎత్తిపోతల ఆలీసాగర్ ఎత్తిపోతల లెండి ప్రాజెక్ట్ ద్వారా నిజామాబాద్ కి నీరు దుమ్ముగూడెం ప్రాజెక్ట్ వేదవతి ఎత్తిపోతల మధవరం ఎత్తిపోతల కుంభలనూరు ఎత్తిపోతల బూదుర ఎత్తిపోతల చట్నిహల్లి ఎత్తిపోతల కోస్గి ఎత్తిపోతల గుండ్రేవుల రిజర్వాయర్ నీవా కలువ పై లిఫ్ట్ మిడ్ పెన్నార్ దక్షిణ కాలువ ఆధునీకరణ కేసీ కెనాల్ ఆధునీకరణ కనుపూరు కలువ రామతీర్ధం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గుంటూరు చానెల్ పొడిగింపు — #HBDLegendCBN
Translate post
 
 
Image
 
Image
Posted

Chandrababu Naidu: చంద్రబాబు గురించి ఈ విషయం ఒకరిద్దరికే తెలుసు: పెమ్మసాని 

20-04-2025 Sun 17:04 | Andhra
Chandrababu Naidus Secret Act of Kindness Revealed by Union Minister
 

 

  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • విషెస్ తెలియజేసిన కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
  • అమెరికాలో చాలామందికి చంద్రబాబు ఫీజులు కడుతుంటారని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి కేంద్ర సహాయ మంత్రి, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అమెరికాలో చాలామందికి చంద్రబాబు ఫీజులు కడుతుంటారని తెలిపారు. ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లిన ఎంతో మంది తెలుగు విద్యార్థులకు చంద్రబాబు ఆర్థికంగా అండగా నిలిచారని, వారి ఫీజులు చెల్లించి ఆదుకున్నారని పెమ్మసాని పేర్కొన్నారు. అయితే, ఈ సహాయం గురించి చాలామందికి తెలియదని, ఒకరిద్దరికి మాత్రమే తెలుసని అన్నారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పెమ్మసాని ఈ విషయాలు వెల్లడించారు..

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ... చంద్రబాబు కేవలం రాజకీయ నాయకుడే కాదని, ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన మార్గదర్శి అని కొనియాడారు. ముఖ్యంగా అమెరికాలో చదువుకోవాలనే ఆశతో వచ్చి, ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిస్తే చంద్రబాబు వెంటనే స్పందించేవారని తెలిపారు. అనేక మంది విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించి వారి చదువులకు ఆటంకం కలగకుండా చూశారని వివరించారు. ఇది ఆయన సేవా దృక్పథానికి, విద్యార్థుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమని అన్నారు.

అంతేకాకుండా, చంద్రబాబును 'నిలువెత్తు నిఘంటువు' (Living Dictionary) గా అభివర్ణించిన పెమ్మసాని, ఆయన నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ముఖ్యంగా అమెరికాలో స్థిరపడే సమయంలో ఆ స్ఫూర్తి ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. అమరావతి వంటి బృహత్తర ప్రాజెక్టును చేపట్టాలనే సంకల్పం, శ్రమదానం, జన్మభూమి వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వంటివి ఆయన దార్శనికతకు నిదర్శనాలని కొనియాడారు.

ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వెడల్పు విషయంలో చంద్రబాబు దూరదృష్టిని పెమ్మసాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్రం 70 మీటర్ల వెడల్పుకు అనుమతిస్తే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా దాన్ని 140 మీటర్లకు పెంచాలని చంద్రబాబు పట్టుబట్టారని, ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా  సీతారామన్ తో అర్ధరాత్రి ఒంటిగంటకు సమావేశమై ఒప్పించారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ముందుచూపు, పట్టుదల తనను ఎంతగానో ప్రభావితం చేశాయని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన ప్రసంగాలతో కూడిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ ఏపీ అసెంబ్లీ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూనే పైవ్యాఖ్యలు చేశారు.
Posted

Chandrababu Naidu: చంద్రబాబు నిజమైన టైమ్ ట్రావెలర్.. ఎవరైనా అంగీకరించాల్సిందే!: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 

20-04-2025 Sun 17:28 | Andhra
Chandrababu Naidu A True Time Traveler Says Deputy Speaker Raghu Rama Krishna Raju
 

 

  • నేడు చంద్రబాబు జన్మదినం
  • అసెంబ్లీ హాల్ లో చంద్రబాబు ప్రసంగాల పుస్తకం ఆవిష్కరణ
  • హాజరైన రఘురామకృష్ణరాజు
  • చంద్రబాబు భవిష్యత్తును ముందుగానే ఊహించగలరని కితాబు
నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా  అసెంబ్లీ హాల్ లో జరిగిన చంద్రబాబు ప్రసంగాల పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు విజన్‌ను ఎంతటి వ్యతిరేకులైనా అంగీకరించాల్సిందేనని అన్నారు. భవిష్యత్తును ముందుగానే ఊహించగల నిజమైన 'టైమ్ ట్రావెలర్' చంద్రబాబు అని అభివర్ణించారు. 

మహాత్మా గాంధీలోని ఓర్పు, సుభాష్ చంద్రబోస్‌లోని విప్లవ ధోరణి చంద్రబాబులో కనిపిస్తాయని, అయితే సహనం, ఓర్పు ఎక్కువగా ప్రదర్శిస్తూ అప్పుడప్పుడు విప్లవ స్ఫూర్తిని కూడా చూపిస్తారని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉన్నా కూడా వీడియో, టెలికాన్ఫరెన్సుల ద్వారా రాష్ట్ర వ్యవహారాలను సమీక్షిస్తారని, ఆయన పనితీరు అలాంటిదని రఘురామ వివరించారు. ఇంతటి గొప్ప నాయకుడితో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆలస్యమైనా, ఇప్పుడు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విజనరీ లీడర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వెల్లడించారు.

చంద్రబాబు తత్వాన్ని అర్థం చేసుకున్న వారు ఎవరైనా గొప్పగా రాణిస్తారని ఆయన అన్నారు. దురభిమానులు కాకుండా, మంచి అభిమానులు కలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని తాను చాలామందికి చెప్పానని వివరించారు. పార్టీలోని నాయకులంతా చంద్రబాబు వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తారని పేర్కొన్నారు. 

చంద్రబాబుకు సమయపాలనపై అంత పట్టింపు ఉండదేమోనని తాను కూడా మొదట్లో భావించానని, కానీ దాని వెనుక ఉన్న కారణాన్ని తర్వాత గ్రహించానని రఘురామ తెలిపారు. చిన్నవారు చెప్పే కొత్త విషయాలను సైతం ఎంతో శ్రద్ధగా వింటారని, ఆ క్రమంలో సమయాన్ని కూడా మరచిపోతారని, ఆయనొక నిత్య విద్యార్థి అని కొనియాడారు. ఈ నేర్చుకునే తత్వం వల్ల ఒకరిద్దరికి సమయం విషయంలో ఇబ్బంది కలిగినా, రాష్ట్రానికి మాత్రం భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.
Posted

Chandrababu Naidu: చంద్రబాబు 75వ పుట్టినరోజు... మంత్రి ఆనం హోమం... వేద పండితులకు ఆర్థిక సాయం 

20-04-2025 Sun 18:37 | Andhra
Chandrababu Naidus 75th Birthday Minister Performs Homam helps Vedic Scholars
 

 

  • నేడు చంద్రబాబు 75వ పుట్టినరోజు
  • నెల్లూరులో పలు కార్యక్రమాలు చేపట్టిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం
  • 599 మంది వేదపండితులకు రూ.53.91 లక్షల ఆర్థిక చేయూత
ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రి సంక్షేమం కోరుతూ ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన వేద పండితులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, కార్యక్రమానికి హాజరైనవారికి వస్త్రాలు, ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రంలో ఆగమ శాస్త్రం అభ్యసించి, వేద పారాయణం చేస్తున్న 599 మంది పండితులను గుర్తించి వారికి ఆర్థిక చేయూతను అందించారు. నెలకు రూ. 3,000 చొప్పున జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన గౌరవ సంభావన (నిరుద్యోగ భృతిగా పేర్కొన్నారు) కింద మొత్తం రూ. 53.91 లక్షల విలువైన చెక్కులను మంత్రి ఆనం పంపిణీ చేశారు. ఈ నిధులను మూడు నెలల కాలానికి కలిపి ఒకేసారి అందించినట్లు తెలుస్తోంది.

అనంతరం, హోమం కార్యక్రమానికి హాజరైన సుమారు 8 వేల మంది ప్రజలకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చీరలు, పంచెలు అందజేశారు. వీటితో పాటు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా పంపిణీ చేశారు. 
Posted

 

Chandrababu Naidu: మీరు చూపిన అభిమానం, ఆప్యాయతతో మనసు ఉప్పొంగింది: సీఎం చంద్రబాబు 

20-04-2025 Sun 19:32 | Andhra
Chandrababu Naidus 75th Birthday Gratitude and Future Vision
 

 

  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • 75వ జన్మదినం వేళ శుభాకాంక్షల వెల్లువ
  • ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
  • తెలుగుజాతి అభ్యున్నతికి పునరంకితం అవుతానని ప్రకటన
  • ప్రపంచంలోనే శక్తిమంతంగా తెలుగుజాతి ఉండాలని పునరుద్ఘాటన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయిలో నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నేతలు, టీడీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు సైతం చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. 

ప్రజలు చూపిన అభిమానం, ఆప్యాయతతో మనసు ఉప్పొంగిందని పేర్కొన్నారు. తెలుగుజాతి అభ్యున్నతికి పునరంకితం అవుతానని తన పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు సంకల్పం ప్రకటించారు. ప్రపంచంలోనే శక్తిమంతంగా తెలుగుజాతి ఉండాలన్నది తన అభిమతమని పునరుద్ఘాటించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ లో ఈ మేరకు పోస్టు చేశారు. 

"నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. 

75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో నాకు ఎల్లప్పుడూ తోడునీడగా ఉండి, నన్ను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం… అపురూప అవకాశం. 

మీ ఆదరాభిమానాలు, నాపై మీరు ఉంచిన నమ్మకం నాలో బాధ్యతను, నిబద్ధతను మరింత పెంచాయి. తెలుగు సమాజ పురోగతి కోసం అలుపులేకుండా పనిచేసేలా మీరంతా నాలో ఉత్సాహం నింపారు. మీ భవిష్యత్ కలలు, ఆకాంక్షలను సాకారం చేయాడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని నా జన్మదినం రోజున వినమ్రంగా తెలియజేస్తున్నాను. 

స్వర్ణాంధ్ర-2047 విజన్ మీ అందరి ఆకాంక్షల సమాహారం. మీ మద్దతుతో, మీ సహకారంతో, సమిష్టి కృషితో ఆ కలను నిజం చేస్తాను. నా ప్రతీ అడుగు, నా ప్రతీ ఆలోచన, ప్రతీ కార్యక్రమం మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే. అందరికీ అవకాశాలు కల్పించేలా, ప్రతి పౌరుడి భవిష్యత్తుకు భరోసా నిచ్చేలా పాలన అందిస్తాను. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ ఆవిష్కరణలకు , అవకాశాలకు కేంద్రంగా మలచాలనేది నా తపన. ‘థింక్ గ్లోబల్లీ-యాక్ట్ గ్లోబల్లీ’ విధానంతో రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుకుందాం .

సమాజంలో అసమానతలు పోవాలి. పేద-ధనిక వర్గాల మధ్య అంతరాలు తగ్గాలి. పేదరికం లేని సమాజం స్థాపించాలనేదే నా సంకల్పం. అందుకే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం... మూడు దశాబ్దాల నాడు నేను ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ సమాజంలో ఎంతో మార్పుతెచ్చింది. ఈసారి తీసుకువచ్చిన ‘పీ4’తో రాష్ట్రంలో పేద కుటుంబాలను... స్వర్ణ కుటుంబాలుగా చేయాలనేది నా ప్రయత్నం. ప్రతి సంపన్న వ్యక్తి పేదవాడి శ్రేయస్సు కోసం పాటుపడాలి. వ్యక్తి శ్రేయస్సే... సమాజ శ్రేయస్సుగా నేను విశ్వసిస్తాను. జనం మన బలం... జనాభా సమర్ధ నిర్వహణ ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించవచ్చు.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు సాధిస్తున్న విజయాలు మనకెంతో గర్వకారణంగా నిలుస్తున్నాయి. అత్యధిక తలసరి ఆదాయం ఆర్జిస్తున్నవారిలో ముందువరుసన ఉన్నాం. మనం కలిసికట్టుగా పనిచేస్తే మరిన్ని తిరుగులేని విజయాలు సాధించగలం. 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తెలుగు జాతిని నిలపాలన్నదే నా అభిలాష.

ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం తెలుగు ప్రజల రక్తంలోనే ఉంది. దేశభక్తి చాటేలా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు చేయిచేయి కలుపుదాం. నాతో పాటు, అందరూ ఇందులో భాగస్వాములు అయ్యేలా ఆహ్వానిస్తున్నాను.

నా పుట్టినరోజు సందర్భంగా మారుమూల పల్లె నుంచి దేశ, విదేశాల వరకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు....అందరికీ మరోసారి ధన్యవాదాలు" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

 

 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...