Jump to content

Recommended Posts

Posted
అర్సా క్లస్టర్ దుకాణం ముయ్యండి!
CBN గారికి, లోకేష్ గారికి నా సలహా
==============
ఈ రోజు టీడీపీ మిత్రులు అర్సా (ఉర్సా కాదట) క్లస్టర్ కంపెనీ యాజమాన్యంతో అనుమానాల నివృత్తి కోసం కాన్ఫరెన్స్ కాల్ లింక్ పంపితే జాయిన్ అయ్యాను. దాదాపు అన్ని తెలుగు టీవీ చానల్లు జాయిన్ అయ్యాయి
ముందుగా టీడీపీ నాయకత్వానికి అభినందనలు. ఈ విధంగా పారదర్శకంగా కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ప్రమోటర్లతో మాట్లాడించడం నాకు తెలిసి ఏ ప్రభుత్వమూ చెయ్యలేదు. మొదటి సారి ప్రభుత్వం చొరవ తీసుకుని సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసింది. సంతోషం!
ఇక కాల్ విషయానికి వద్దాం.
ఇందులో ముఖ్యంగా ముగ్గురు మాట్లాడారు- జే తల్లూరి, సతీష్ అబ్బూరి, ఎరిక్ వార్నర్ (Caucasian American)
జే తల్లూరి తనను తాను ఒక ప్రమోటర్-గా పరిచయం చేసుకున్నారు. తాము ఒక ప్రమోటర్ల గ్రూప్ అని, వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమని చెప్పారు. ఎవరు ఈ పెట్టుబడిదారులు అంటే, పేర్లు చెప్పలేం అన్నారు. Non disclosure ఒప్పందం (NDA) మూలంగా పెట్టుబడి పెట్టే వాళ్ళ వివరాలు చెప్పలేం అన్నారు. తను మాత్రం 200 కోట్లు పెట్టుబడి పెడుతున్నాను అన్నారు.
సతీష్ అబ్బూరి మాట్లాడుతూ, అర్సా క్లస్టర్ భారత దేశంలో కొత్తగా స్థాపించిన కంపెనీ అని చెప్పారు. అమెరికాలోని పేరెంట్ సంస్థ పేరేంటి అని అడిగితే, అక్కడ కూడా అర్సా క్లస్టర్ అనే పేరుతోనే రిజిస్టర్ అయిందన్నారు. అమెరికాలోని అర్సా క్లస్టర్ ఎప్పుడు స్థాపించారు అంటే అది కూడా స్టార్ట్ అప్ అనీ, సంవత్సరం కిందే స్తాపించాం అన్నారు. మీ వెబ్సైట్ ఏంటి అని అడిగితే ursacloud dot com అన్నారు. అదేంటి మీ కంపెనీ పేరు అర్సా క్లస్టర్ కదా అని అడిగితే కన్విన్సింగ్ సమాధానం రాలేదు.
మీరు ప్రభుత్వ భూమి లీజ్ కి తీసుకుంటున్నారా కొంటున్నారా అంటే, ఎకరం 50 లక్షలకు కొంటున్నాం అన్నారు. సాక్షి రాసినట్లు అక్కడ ధర ఎకరం 50 కోట్లు లేదన్నారు.
ఈ గొడవంతా ఎందుకు, మీరు సంతకం పెట్టిన MOU బహిరంగం చేస్తే సరిపోతుంది కదా అని అడిగితే, ప్రభుత్వాన్ని అడిగి చేస్తాం అన్నారు.
మీరు కేశినేని చిన్ని కలిసి చదువుకున్నారా, అని అడిగితే, కాదు నాకు సీనియర్ అని చెప్పారు. కేశినేని నాని ఆరోపించినట్లు మీరు చిన్ని 21st century లో పార్టనర్లా అని అడిగితే, ముమ్మాటికీ కాదన్నారు.
అక్కడితో కాల్ ముగిసింది
=
అనుమానాలు నివృత్తి చెయ్యడానికి zoom కాల్ పెట్టడం అభినందనీయం. కానీ ఈ కాల్ అనుమానాలు నివృత్తి చేయకపోగా మరిన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ఇండియా సంస్థ వెనుక అమెరికాలో భారీ సంస్థ లేదని స్పష్టం అయింది. వేల కోట్ల పెట్టుబడి పెట్టే భారీ ఇన్వెస్టర్లు ఉన్నారు అని జే తల్లూరి గారు నమ్మబలికారు కానీ, ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు.
ఈ రోజు బయటకు వచ్చిన విషయం, జే తల్లూరి ఎంపీ సీఎం రమేష్ గారి బంధువు అని. అలాగే సతీష్ అబ్బూరి, ఎంపీ కేశినేని చిన్ని ఒకటే కాలేజ్ లో చదువుకున్నారని.
ఇది కాక వీళ్ళు పది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సత్తా ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు చూపలేదు. వాళ్ళ అమెరికా కంపెనీ వెబ్సైట్ కూడా కేవలం సంవత్సరం క్రితం కొన్నారు. వెబ్సైట్ పేరు కంపెనీ పేరు వేరు.
ఇవీ సమస్యలు.
ఈ నేపథ్యంలో, బాబు గారికి లోకేష్ గారికి నా సలహా... మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి.
1)అర్జెంటుగా ఈ MOU cancel చెయ్యండి. మీకు ఇందులో పాత్ర లేకపోతే, వెంటనే దర్యాప్తుకు ఆదేశించండి. ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పండి. ప్రజలు మీ నిజాయితీని అభినందిస్తారు.
2) కాదు, మీరు ఈ సంస్థ గురించి లోతుగా అధ్యయనం చేసే ఈ కంపెనీకి భూమి ఇవ్వాలని నిర్ణయించి ఉంటే, వెంటనే మీరు చేసుకున్న MOU కాపీలు, ఈ కంపెనీ మీద మీరు చేసిన background చెక్, ఇతర పత్రాలు అన్నీ విడుదల చెయ్యండి.
ఇవి రెండూ చెయ్యకుండా, జగన్ దొంగ అన్న సాకు చెప్పి ముందుకు వెళ్తే మాత్రం, ఇది మీరు చెరుపలేని మచ్చగా మిగులుతుంది. వచ్చే ఎన్నికల్లో దెబ్బ కొట్టే అవకాశం ఉంది.
Posted

నిబంధనల ప్రకారమే ఉర్సా కి కేటాయింపులు, రూ.5,728 కోట్లు పెట్టుబడితో,  2,500 ఉద్యోగాలు టార్గెట్,  రెండేళ్ళలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని నిబంధన. చేయని పక్షంలో, ప్రాజెక్ట్ రద్దు చేసి భూములు వెనక్కితీసుకొని, వాళ్ళ డబ్బులు తిరిగి ఇవ్వదు ప్రభుత్వం అని గవర్నమెంట్ చెప్తుంది.

ఇంత సొళ్ళు చెప్పే బదులు ఆ ప్రాజెక్టు కాన్సెల్ చేయడం బెట్టర్. జై తాళ్ళూరి లాంటి మేస్త్రీలు పెట్టె ప్రాజెక్టులు గురుంచి ఒకటి రెండు సార్లు ఆలోచించాలి. కావాలి అంటే మార్కెట్ రేట్ ప్రకారం వాళ్ళనే కొనుక్కొని ప్రాజెక్టు పెట్టుకోమని చెప్పాలి. ప్రభుత్వం తరుపున అనుమతులు వరకి ఇవ్వడం. వాళ్ళు క్రియేట్ చేసే జాబ్ల సంఖ్యని బట్టి కొద్దిపాటి ప్రోత్సాహాలు ఇవ్వడం బెట్టర్.

లేదంటే మీకే నష్టం.

@futureofandhra @psycopk

 

Posted

aa anni cheppestaru..evaru investor,,,,evariki binami ani....open ga....  idhi-yaaparam-bramhi.gif

Posted
Just now, Spartan said:

aa anni cheppestaru..evaru investor,,,,evariki binami ani....open ga....  idhi-yaaparam-bramhi.gif

Jai Thalluri, Saitsh Abburi ante binami kakapovacchu. Iddharu thega balisina canidates. But prabhutvham lo unna peddhalatho relations unnattu anipisthundhi. Ee jai Talluri dhi Palwancha anukunta. Davos lo anukunta TG govt tho kooda oka MoU chesukunnadu.

Posted
Just now, appusri said:

Jai Thalluri, Saitsh Abburi ante binami kakapovacchu. Iddharu thega balisina canidates. But prabhutvham lo unna peddhalatho relations unnattu anipisthundhi. Ee jai Talluri dhi Palwancha anukunta. Davos lo anukunta TG govt tho kooda oka MoU chesukunnadu.

obvious.

ఎవరు ఈ పెట్టుబడిదారులు అంటే, పేర్లు చెప్పలేం అన్నారు. Non disclosure ఒప్పందం (NDA) మూలంగా పెట్టుబడి పెట్టే వాళ్ళ వివరాలు చెప్పలేం అన్నారు.

Posted
Just now, Spartan said:

obvious.

ఎవరు ఈ పెట్టుబడిదారులు అంటే, పేర్లు చెప్పలేం అన్నారు. Non disclosure ఒప్పందం (NDA) మూలంగా పెట్టుబడి పెట్టే వాళ్ళ వివరాలు చెప్పలేం అన్నారు.

Yes. Andhuke cancel cheyyali, iddharu balisina candidates, black money untundhi. Typical mestri batch.

  • appusri changed the title to URSA Cloud Zoom call details

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...