Jump to content

Recommended Posts

Posted

KCR: ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్, కేటీఆర్, కవిత 

23-04-2025 Wed 10:24 | Telangana
KCR KTR Kavitha Condemn Jammu and Kashmir Terrorist Attack
 

 

  • జమ్మూకశ్మీర్ లో భీకర ఉగ్రదాడిలో 26 మంది మృతి
  • ఉగ్రదాడి వార్త తనను కలచివేసిందన్న కేసీఆర్
  • కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్న మాజీ సీఎం
జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత అమానవీయ చర్య అని అన్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కశ్మీర్ పర్యటనకు వచ్చిన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారన్న వార్త తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొని అండగా నిలవాలని కోరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి మారణకాండలు పునరావృతం కాకుండా కేంద్రం కఠినమైన చర్యలు చేపట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. 26 మంది పర్యాటకులు మరణించడంపై ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పర్యాటకుల ప్రాణాలు తీయడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ అన్నారు. ఈ పాశవిక దాడిలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. కశ్మీర్‌లో ఉగ్రవాదానికి స్థానం లేదనే బలమైన సందేశాన్ని కేంద్రం ఇవ్వాలని కేటీఆర్ అన్నారు.

ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ... అమాయకులైన పర్యాటకులను ఉగ్రవాదులు బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కవిత, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
Posted

Jr NTR: హృదయ విదార‌కం.. ఉగ్ర‌దాడిపై సినీ సెలబ్రెటీల దిగ్భ్రాంతి 

23-04-2025 Wed 08:03 | Entertainment
Jr NTR Heartbroken Over Pahalgam Terrorist Attack
 

 

  • పహల్గాంలో ఉగ్ర దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ‌ భారత్
  • ఈ ఘటనపై సినీ సెలబ్రెటీల దిగ్భ్రాంతి
  • 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన‌ చిరంజీవి, ఎన్‌టీఆర్, మంచు విష్ణు    
కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా... మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స‌మాచారం. 

ఈ ఘటనపై సినీ సెలబ్రెటీలు సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎక్స్ వేదిక‌గా మెగాస్టార్ చిరంజీవి, జూనియ‌ర్ ఎన్‌టీఆర్, మంచు విష్ణు స్పందించారు. ఇది భ‌యంక‌ర‌మైన‌, హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌గా చిరు పేర్కొన్నారు. అలాగే పహల్గాం దాడి బాధితుల గురించి తెలిసి హృదయం ద్రవించిపోయింద‌ని తార‌క్‌ అన్నారు. పహల్గాంలో జరిగిన పిరికి దాడి హృదయ విదారకం అని మంచు విష్ణు తెలిపారు. 

జమ్మూక‌శ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న దారుణమైన దాడి భయంకరమైనది, హృదయ విదారకమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వ‌క‌ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి జ‌రిగిన‌ నష్టాన్ని ఏదీ పూరించలేదు. వారి కోసం నా సంతాపం, ప్రార్థనలు అని చిరంజీవి ట్వీట్ చేశారు.  

“పహల్గాం దాడి బాధితుల గురించి తెలిసి హృదయం ద్రవించిపోయింది. దాడిలో మృతిచెందిన‌ వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. శాంతి, న్యాయం కోసం ప్రార్థిస్తున్నా” అని తార‌క్ రాసుకొచ్చారు. 

"పహల్గాంలో జరిగిన పిరికి దాడి హృదయ విదారకం. త‌మ‌వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి స‌మ‌యంలో మనం మరింత బలంగా నిలబడాలి. ఈ దుఃఖ స‌మ‌యంలో ఐక్యంగా, స్ఫూర్తితో ఉండాలి. ఉగ్రవాదం మనల్ని ఎప్పటికీ విభజించలేదు. జై హింద్" అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.
Posted

Ramcharan: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది: రామ్‌చ‌ర‌ణ్ 

23-04-2025 Wed 06:57 | Entertainment
Ram Charan Shocked by Pahalgham Terrorist Attack
 

   

క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో జ‌రిగిన‌ ఉగ్ర‌దాడిపై గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ స్పందించారు. ఈ ఉగ్ర ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌న్నారు. ఇది చాలా బాధ‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌గా పేర్కొన్నారు. ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా చెర్రీ పోస్ట్ పెట్టారు. 

"ప‌హ‌ల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా బాధించింది. ఇటువంటి సంఘటనలకు మన సమాజంలో చోటు లేదు. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి. ఈ కష్ట సమయాన్ని తట్టుకుని నిలబడే మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని దేవుడు బాధిత కుటుంబాలకు ఇవ్వాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను" అని చ‌ర‌ణ్ పేర్కొన్నారు. 
Posted

Pahalgham Terrorist Attack: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి... ప్ర‌ధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్‌ 

23-04-2025 Wed 06:36 | International
Donald Trumps Phone Call to PM Modi Amidst Pahalgham Terror Attack
 

 

  • మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన విష‌యాన్ని తెలిపిన‌ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ
  • ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిని ఆయ‌న‌ తీవ్రంగా ఖండించినట్లు వెల్ల‌డి
  • ఉగ్ర‌వాద పోరులో యూఎస్‌, ఇండియా ఒక‌రికొక‌రు క‌లిసి పోరాడుతాయ‌న్న ట్రంప్‌
  • క‌శ్మీర్ ఉగ్ర ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసిందంటూ ట్రంప్ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌
  • ఫోన్ చేసి మ‌ద్ద‌తుగా మాట్లాడ‌డంతో ట్రంప్ కు ధ‌న్య‌వాదాలు తెలిపిన ప్ర‌ధాని మోదీ 
క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో జ‌రిగిన‌ ఉగ్ర‌దాడి విష‌య‌మై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో ఫోన్ లో సంభాషించారు. ఈ సంద‌ర్భంగా ఉగ్ర‌దాడిని ఆయ‌న తీవ్రంగా ఖండించిన‌ట్లు భార‌త విదేశాంగ శాఖ వెల్ల‌డించింది. మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన విష‌యాన్ని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ అధికార ప్ర‌తినిధి ర‌ణ‌ధీర్ జైస్వాల్ ఎక్స్ (ట్విట్ట‌ర్) ద్వారా తెలియ‌జేశారు. 

"ప్ర‌ధాని మోదీకి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్ర‌దాడిలో చ‌నిపోయిన వారికి ఆయ‌న సంతాపం తెలిపారు. ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డిన వారిని చ‌ట్టం ముందుకు తీసుకురావ‌డానికి త‌మ పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్ర‌వాద పోరులో యూఎస్‌, ఇండియా ఒక‌రికొక‌రు క‌లిసి పోరాడుతాయి. ఉగ్ర ఘ‌ట‌న‌ను ట్రంప్ తీవ్రంగా ఖండించారు" అని ర‌ణ‌ధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు. 

అంత‌కుముందు ఇదే విష‌య‌మై డొనాల్డ్ ట్రంప్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. క‌శ్మీర్ ఉగ్ర ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌ని పేర్కొన్నారు. మృతిచెందిన వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌ధాని మోదీకి, భార‌త ప్ర‌జ‌ల‌కు త‌మ పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని పేర్కొన్నారు.  

ఇక‌, ట్రంప్ ఫోన్ చేసి మ‌ద్ద‌తుగా మాట్లాడ‌డంతో ప్ర‌ధాని మోదీ ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. మ‌రోవైపు 2 రోజుల ప‌ర్య‌ట‌న కోసం సౌదీ అరేబియా వెళ్లిన మోదీ త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి హూటాహూటిన జెడ్డా నుంచి భార‌త్‌కు తిరుగుప‌య‌న‌మ‌య్యారు.    
Posted

Pahalgam Terrorist Attack: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిలో హైద‌రాబాద్ ఎస్ఐబీ ఆఫీస‌ర్‌ మృతి 

23-04-2025 Wed 06:08 | National
Hyderabad SIB Officer Killed in Pahalgam Terrorist Attack
 

   

క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో జ‌రిగిన‌ ఉగ్ర‌దాడిలో హైద‌రాబాద్ వాసి మ‌నీశ్ రంజ‌న్ మృతిచెందారు. ఆయ‌న కోఠిలోని స‌బ్సిడ‌రీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)లో సెక్ష‌న్ ఆఫీస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. కుటుంబ‌స‌భ్యులతో క‌లిసి ప‌హ‌ల్గాం ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌గా ఉగ్ర‌వాదులు ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు. భార్య‌, పిల్ల‌ల ఎదురుగానే ఆయ‌న‌ను కాల్చి చంపిన‌ట్లు స‌మాచారం. మ‌నీశ్ ఐడీ కార్డు చూసి మ‌రీ కాల్పులు జ‌రిపార‌ని తెలుస్తోంది. బీహార్‌కు చెందిన మ‌నీశ్‌... ఉద్యోగ రీత్యా హైద‌రాబాద్‌లో ఉంటున్నారు. 

ఇక, మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఉగ్ర‌దాడిలో దాదాపు 26 మంది ప‌ర్యాట‌కులు మృతిచెందిన‌ట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌ను అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ స‌హా ప‌లువురు దేశాధినేత‌లు తీవ్రంగా ఖండించారు. 
Posted

JD Vance: తాను భారత్ లో పర్యటిస్తుండగానే ఉగ్రదాడి జరగడం పట్ల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందన 

22-04-2025 Tue 22:36 | International
JD Vance Responds to Terrorist Attack During India Visit
 

 

  • జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో భీకర ఉగ్రదాడి
  • 26 మంది వరకు ఉగ్ర ఘాతుకానికి బలి
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జేడీ వాన్స్
జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్‌లో మంగళవారం నాడు జరిగిన భీకర ఉగ్రదాడి పట్ల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన బాధితుల కుటుంబాలకు తన తరపున, తన భార్య ఉష తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం తాము భారతదేశంలో పర్యటిస్తున్నామని వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా భారతదేశపు అనిర్వచనీయమైన సౌందర్యం, ఇక్కడి ప్రజల ఆత్మీయత తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. "గత కొద్ది రోజులుగా మేము ఈ దేశం, ఇక్కడి ప్రజల అందంతో ఎంతగానో ప్రభావితమయ్యాం" అని వాన్స్ వ్యాఖ్యానించారు.

అయితే, ఇంతటి అందమైన దేశంలో ఇలాంటి ఘోరమైన ఉగ్రదాడి జరగడం అత్యంత విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ఈ భయానక దాడితో దుఃఖంలో ఉన్న వారికి మా ప్రార్థనలు అండగా ఉండాలని కోరుకుంటున్నాం" అని జేడీ వాన్స్ తెలిపారు. బాధితుల కుటుంబాలు త్వరగా ఈ విషాదం నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పహల్గామ్‌లో జరిగిన ఈ తీవ్రవాద చర్య నేపథ్యంలో భారత ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నట్లు వాన్స్ వెల్లడించారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ను వాన్స్ పంచుకున్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...