Undilaemanchikalam Posted April 27 Report Posted April 27 Telangana CS: తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు.. భారీగా IASల బదిలీ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావును నియమించింది. హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30 పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త సీఎస్ నియామకంపై గత కొంత కాలంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. సీనియారిటీ జాబితా ప్రకారం.. రామకృష్ణారావుతోపాటు ఆరుగురు అధికారులు రేసులో నిలిచారు. వారందరి పేర్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును సీఎస్‌గా నియమించాలని నిర్ణయించింది. ఈయన 2014 నుంచి ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం, కేంద్ర నుంచి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల దృష్ట్యా ఆయన్ని సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారీగా ఐఏఎస్‌ల బదిలీలు మరోవైపు, రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్ - శశాంక్ గోయల్ ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ సెల్ సీఈవో- జయేశ్ రంజన్ పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్యకార్యదర్శి- సంజయ్ కుమార్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ - స్మితా సబర్వాల్ కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ - దానకిశోర్ పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి (హెచ్‌ఎండీఏ వెలుపల)- టీకే శ్రీదేవి పట్టణాభివృద్ధి కార్యదర్శి (హెచ్‌ఎండీఏ పరిధి) - ఇలంబర్తి జీహెచ్‌ఎంసీ కమిషనర్ - ఆర్వీ కర్ణన్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ - కె.శశాంక జెన్‌కో సీఎండీ - ఎస్. హరీశ్ రాష్ట్రమానవ హక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవో - నిఖిల ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ - సంగీతం సత్యనారాయణ దేవాదాయశాఖ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఈవో - ఎస్. వెంకటరావు సెర్ప్ అదనపు సీఈవో - పి. కాత్యాయనీదేవి ఇండస్ట్రీ, ఇన్వెస్టిమెంట్ సెల్ అదనపు సీఈవో - ఈవీ నర్సింహారెడ్డి జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ - హేమంత్‌సహదేవ్ రావు టీజీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ - ఫణీంద్రారెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ - కధిరవన్ హైదరాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) - విద్యాసాగర్ హెచ్‌ఎండీఏ సెక్రటరీ - ఉపేందర్ రెడ్డి Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.