Jump to content

***** BREAKING : Simhachalam lo goda kooli 8 people died *****


Recommended Posts

Posted

Simhadri Appanna Swamy: సింహాద్రి చందనోత్సవంలో ప్రమాదం .. ఏడుగురు భక్తుల మృతి 

30-04-2025 Wed 07:49 | Both States
Seven Pilgrims Die in Simhadri Chandanotsavam Tragedy
 

 

  • సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి 
  • రూ.300 టికెట్ కౌంటర్ వద్ద కూలిన సిమెంట్ గోడ 
  • ఏడుగురు భక్తులు మృతి, నలుగురికి గాయాలు
  • సహాయక చర్యలు నిర్వహిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం
  • ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించిన హోంమంత్రి అనిత
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవ వేడుకల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రూ.300 టికెట్ కౌంటర్ వద్ద గాలివాన కారణంగా గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.

సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం అర్ధరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్ పై సిమెంటు గోడ కూలిపోయింది.

వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
Posted
19 minutes ago, psycopk said:

 

Jagan Mohan Reddy: సింహాచలం ఘటన బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాసేపట్లో విశాఖకు వెళుతున్న జగన్ 

30-04-2025 Wed 12:47 | Andhra
Jagan to Visit to Simhachalam Victims
 

 

  • సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి ఏడుగురు మృతి... పలువురికి గాయాలు
  • కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను, బాధిత కుటుంబాలను పరామర్శించనున్న జగన్
  • ఈ ఘటనపై ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్
వైసీపీ అధినేత జగన్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. బాధితులను, మృతుల కుటుంబీకులను జగన్ పరామర్శించనున్నారు.

తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి వైఎస్ జగన్ విశాఖపట్నం చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన నేరుగా కింగ్ జార్జ్ ఆసుపత్రికి (కేజీహెచ్) వెళతారు. అక్కడ, సింహాచలం దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, అలాగే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి తన సానుభూతిని తెలియజేయనున్నారు.

సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన ఈ విషాద ఘటనపై వైఎస్ జగన్ ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రూ. 300 టికెట్ క్యూలైన్‌పై గోడ కూలి భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. స్వామి వారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇలాంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన కోరారు.

Ee times kuda vellu undalsindi 11 reddy

 

Posted
1 hour ago, psycopk said:

Ee times kuda vellu undalsindi 11 reddy

 

labour santa anta launch chesadu jaggadu sevam kanipincha gane

Shyamala: మ‌రోసారి డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌పై శ్యామ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు 

30-04-2025 Wed 17:06 | Andhra
Pawan Kalyan Faces Shyamalas Scathing Remarks After Simhachalam Temple Tragedy
 

 

  • సింహాచలం ఘ‌ట‌న నేప‌థ్యంలో వైసీపీ అధికార ప్ర‌తినిధి తీవ్ర విమ‌ర్శ‌లు
  • ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ ఏమైందంటూ ప్ర‌శ్నించిన శ్యామ‌ల‌ 
  • కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వ‌రుస సంఘ‌ట‌న‌లంటూ విమ‌ర్శ‌
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘ‌ట‌న‌ తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, ఈ ఘటన నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పిఠాపురం పీఠాధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ ఏమైంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. 

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నుంచి హైంద‌వులు విశ్వాసం కోల్పోయేలా, హైంద‌వ ధ‌ర్మానికి వ్య‌తిరేకంగా వ‌రుస సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని శ్యామ‌ల అన్నారు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం విష‌యంలో జ‌గ‌న్‌పై  సీఎం చంద్ర‌బాబు అబ‌ద్ద‌పు ప్ర‌చారం చేసిన‌ప్ప‌టి నుంచి స్వామివారు క‌న్నెర్ర చేసిన‌ట్టు ఉంద‌ని ఆరోపించారు. ఆ త‌ర్వాతనే వ‌రుస ఘ‌ట‌న‌లు భ‌య‌పెడుతున్నాయ‌ని అన్నారు. 

వైకుంఠ ఏకాద‌శి టికెట్ల కోసం జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఆరుగురు భ‌క్తులు చ‌నిపోవ‌డం, 40 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ‌డం... టీటీడీ గోశాల‌లో వంద‌కు పైగా గోవులు మృతిచెంద‌డం, శ్రీకుడుమంలో తాబేళ్లు మృత్యువాత ప‌డ‌డం వాటిని ఈఓ కార్యాల‌యం వెనుక కాల్చివేయ‌డం ఇలా వ‌రుస ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయ‌ని ఆమె విమ‌ర్శించారు. 

తిరుమ‌ల కొండ‌పై మందు, ఎగ్ బిర్యానీలు దొర‌క‌డం క‌ల‌క‌లం సృష్టించింద‌న్నారు. ఈరోజు సింహాచ‌లం గోడ కూలి ఏడుగురు భ‌క్తులు చ‌నిపోయార‌ని, 20 రోజుల కింద క‌ట్టిన గోడ ఎలా కూలిపోయింద‌ని శ్యామ‌ల ప్ర‌శ్నించారు. కూట‌మి నేత‌ల కాసుల క‌క్కుర్తితోనే గోడ కూలింద‌ని ఆరోపించారు. ఈరోజు కూట‌మి ప్ర‌భుత్వం నిజ‌స్వ‌రూపం ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంద‌ని విమ‌ర్శించారు. 
Posted
13 hours ago, BattalaSathi said:
eee CBN ki itta bhakthulu sachi povadaniki endhi vayya link @Android_Halwa
 
 

Simhachalam: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి

Eenadu
3–4 minutes

 సింహాచలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రూ.300 టికెట్‌ క్యూలైన్‌పై గోడకూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు. 

Eenadu icon

By Andhra Pradesh News Team Updated : 30 Apr 2025 04:52 IST

2 min read

33630042025simhachalam2a.webp

సింహాచలం: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్‌ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆరు మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. మరో రెండు మృతదేహాలను శిథిలాల కింద గుర్తించారు.    

33630042025simhachalam2b.webp

నిజరూపంలో దర్శనమిస్తున్న అప్పన్న..

వరహా లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తున సింహగిరికి పోటెత్తారు. వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరుచేశారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, తితిదే పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రొటోకాల్‌, అంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేశారు.  

30vsp-1b_1.webp

సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న హోంమంత్రి అనిత

 
 

Few days back oka news choosa
Vangalapudi Anitha, ila cheppindi
"ikkada 5 ministers undi anni arrangements choostunnamu"
wtf what she was doing...

Posted
3 minutes ago, rako said:

Few days back oka news choosa
Vangalapudi Anitha, ila cheppindi
"ikkada 5 ministers undi anni arrangements choostunnamu"
wtf what she was doing...

daani bondha..adho bible reading ministeru..adhi mallee Simhachalam Chandanotsvaaniki arragements choodadam..saripoyindhi...

Posted

Simhachalam 

Chandana Utsavam

Giri Pradikshana

year on year crowd peragatame kani taggedi emi ledu

asalu ee VVIP protocol gallaku imp days lo darshanam teeseyyali anni temples

vella valla normal ppl ki bokka tappa upayogam emi undadu

 

At one point TTD taruvata highest land banks unde temple ani cheppevallu , ippudu lekkalu evadiki teliyadu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...