psycopk Posted May 17 Author Report Posted May 17 K. Dhanunjaya Reddy: ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ఈ నెల 20 వరకు రిమాండ్ 17-05-2025 Sat 22:41 | Andhra మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి జూన్ 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేసిన సీఐడీ ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో పనిచేసిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఏ31 నిందితుడిగా ఉన్న సీఎంవో మాజీ కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, ఏ32 నిందితుడిగా ఉన్న మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలకు ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి సీఐడీ అధికారులు వీరిద్దరినీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అనంతరం వారిని నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, నిందితులిద్దరికీ రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ఈ మద్యం కుంభకోణం కేసులో రాష్ట్ర నేరపరిశోధన విభాగం (సీఐడీ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు మొత్తం ఏడుగురు వ్యక్తులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. గతంలో రాజ్ కసిరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్‌రెడ్డి, దిలీప్, గోవిందప్ప బాలాజీలను అరెస్టు చేయగా, తాజాగా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టుతో ఈ సంఖ్య ఏడుకు చేరింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు, ఈ కుంభకోణంలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు అత్యంత కీలకమైన పాత్ర పోషించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. వారి పాత్రపై మరింత లోతుగా విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. Quote
Copilot Posted May 17 Report Posted May 17 Aaq bochulee thaatha, oka 10 days lo news be like supremcourt nundi oorata. they are white pearls, nuvvu thinnav meemu thinnam ani bajana anthe gaa? Quote
psycopk Posted May 18 Author Report Posted May 18 Nara Lokesh: ప్రధాని మోదీ నుంచి సలహాలు తీసుకున్నా: మంత్రి లోకేశ్ 18-05-2025 Sun 06:09 | Andhra నిన్న కుటుంబసమేతంగా ప్రధానిని కలిసిన మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా ‘యువగళం’ కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ ఈ భేటీ అనంతరం 'ఎక్స్' వేదికగా లోకేశ్ పోస్ట్ ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా శనివారంనాడు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. ఇటివల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో ఢిల్లీ రావాలని మంత్రి లోకేశ్‌ను ఆహ్వానించిన సందర్భంగా ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘యువగళం’ కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. 2024 ఎన్నికలకు ముందు లోకేశ్ చేపట్టిన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్‌లో పొందుపరిచారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని దానిపై సంతకం చేసి లోకేశ్‌కు అందజేశారు. ఇక, ఈ భేటీలో ప్రధాని మోదీ, లోకేశ్ దంపతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుమారుడు దేవాన్ష్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని సరదాగా ముచ్చటించారు. మోదీతో భేటీపై లోకేశ్ ట్వీట్ ప్రధాని మోదీతో భేటీ అనంతరం మంత్రి లోకేశ్ 'ఎక్స్' వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. "ఈరోజు గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో కుటుంబసమేతంగా కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఏపీ పురోగతికి ప్రధానమంత్రి అందించిన మద్దతుకు కృతజ్ఞతలు. జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో ప్రధాని నిర్ణయాత్మక నాయకత్వానికి ధన్యవాదాలు. 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో రాష్ట్రం దేశానికి ఏ విధంగా తోడ్పడాలో ప్రధాని నుంచి సలహాలు తీసుకున్నా" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.