psycopk Posted May 21 Report Posted May 21 Mithun Reddy: భయపెట్టి పాలించాలనుకుంటున్నారు... మద్యం కుంభకోణం జరగలేదు: మిథున్ రెడ్డి 21-05-2025 Wed 15:52 | Andhra ఏపీలో అరాచక పాలన సాగుతోందన్న ఎంపీ మిథున్ రెడ్డి ఇంటింటికీ రేషన్ వాహనాల రద్దు సరికాదని వ్యాఖ్య సంక్షేమ పథకాలు ఆపారని ఆగ్రహం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పరిపాలించాలనుకోవడం అవివేకమని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ మిథున్ రెడ్డి పలు కీలక ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిలిపివేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, ప్రజల దృష్టిని మరల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే వాహనాలను రద్దు చేయడం సరైన చర్య కాదని హితవు పలికారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి మద్యం కుంభకోణం జరగలేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కట్టుకథలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, మద్యం కుంభకోణం జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ప్రచారమేనని కొట్టిపారేశారు. అనంతపురం జిల్లాలో గ్రామీణాభివృద్ధికి సేవలందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థకు అందే విదేశీ నిధులను నిలిపివేయడం దుర్మార్గమైన చర్య అని మిథున్ రెడ్డి అన్నారు. దీనివల్ల ఎంతోమంది పేదలకు అందే సాయం ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు లైనింగ్ పనుల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. ఈ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగవని అభిప్రాయపడ్డారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.