psycopk Posted May 22 Report Posted May 22 YS Jagan: విజయసాయిరెడ్డి... చంద్రబాబుకు లొంగిపోయారు: జగన్ తీవ్ర ఆరోపణలు 22-05-2025 Thu 13:44 | Andhra కూటమికి మేలు చేసేందుకే విజయసాయి రాజ్యసభకు రాజీనామా చేశారన్న జగన్ మూడున్నరేళ్ల పదవీకాలాన్ని ప్రలోభాలకు లోనై వదులుకున్నారని విమర్శలు వైసీపీకి బలం లేదని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్య అలాంటి వ్యక్తి చేసే ప్రకటనలకు విలువ ఉండదని స్పష్టీకరణ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోయారని, ఆయన కూటమికి మేలు చేసేందుకే కీలక నిర్ణయాలు తీసుకున్నారని జగన్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, "విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు చేసే ప్రకటనలకు ఏం విలువ ఉంటుంది? ఆయన చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి" అని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి రెడ్డికి ఇంకా మూడున్నర సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉందని, అయినప్పటికీ కేవలం చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ప్రయోజనం చేకూర్చేందుకే ఆయన తన పదవికి రాజీనామా చేశారని జగన్ ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి తగినంత ఎమ్మెల్యేల బలం లేనందున, విజయసాయిరెడ్డిని మళ్లీ రాజ్యసభకు పంపించే అవకాశం లేదన్న విషయం ఆయనకు కూడా తెలుసని జగన్ అన్నారు. "తన రాజీనామా వల్ల చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని తెలిసి, తన మూడున్నరేళ్ల పదవీకాలాన్ని ఆ కూటమికి, ప్రలోభాలకు లోనై అమ్ముకున్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం విలువ ఉంటుంది?" అని జగన్ ప్రశ్నించారు. Quote
psycopk Posted May 22 Author Report Posted May 22 https://www.instagram.com/reel/DJ8dgy7JPTI/?igsh=MTJ4aHh2dno3cTQxOQ== Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.