psycopk Posted May 27 Author Report Posted May 27 Vidadala Rajini: పిన్నెల్లి సోదరులపై కేసు... పోలీసులపై విడదల రజని ఫైర్ 27-05-2025 Tue 14:59 | Andhra మాచర్ల హత్య కేసులో పిన్నెల్లి సోదరులను అన్యాయంగా ఇరికించారన్న రజని హత్యకు గురైనవారు, నిందితులు ఇద్దరూ టీడీపీ వారేనని ఎస్పీ చెప్పారని గుర్తు చేసిన రజని రాజకీయ ఒత్తిళ్లతోనే పిన్నెల్లి సోదరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని విమర్శ ఎఫ్ఐఆర్ నుంచి పిన్నెల్లి సోదరుల పేర్లను తక్షణమే తొలగించాలని వైసీపీ డిమాండ్ మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలను అన్యాయంగా ఇరికించారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ, పల్నాడు జిల్లా పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ చర్యకు పాల్పడ్డారని విమర్శించారు. విడదల రజని మాట్లాడుతూ, "మాచర్ల ఘటనలో హత్యకు గురైన వ్యక్తి, హత్య చేసిన వారు ఇద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందినవారేనని ఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ స్వయంగా ప్రాథమిక విచారణ అనంతరం వెల్లడించారు. మృతుడికి, తోట చంద్రయ్య కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే, రాజకీయ జోక్యం తర్వాత పిన్నెల్లి సోదరుల పేర్లను ఈ కేసులో చేర్చడం దారుణం" అని అన్నారు. ఇది టీడీపీలోని ఆధిపత్య పోరులో భాగమేనని, దానికి పిన్నెల్లి సోదరులకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలిపారు. "మొదట మృతుడి కుటుంబ సభ్యులు కూడా ఇది రాజకీయ కక్షల వల్ల, టీడీపీలోని అంతర్గత గొడవల వల్లే జరిగిందని చెప్పారు. కానీ, ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత పరిస్థితి మారింది. రాజకీయ ఒత్తిళ్లతో ఈ కేసును పిన్నెల్లి సోదరులకు అంటగట్టారు. ఇది రెడ్ బుక్ పాలనకు పరాకాష్ఠ కాదా?" అని రజని ప్రశ్నించారు. తక్షణమే ఎఫ్ఐఆర్ నుంచి పిన్నెల్లి సోదరుల పేర్లను తొలగించాలని వైసీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. పోలీసుల తీరును తప్పుబడుతూ, "పోలీసులంటే మాకు గౌరవం ఉంది. కానీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ కాస్తా, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్‌గా మారిందనిపిస్తోంది. పోలీసులు తమ యూనిఫాంకు ఉన్న విలువను కాపాడుకోవాలి. పల్నాడు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సానుభూతిపరులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. గురజాలలో హరికృష్ణ అనే బీసీ యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నరసరావుపేటలో గోపిరెడ్డి గారిపై అక్రమ కేసులు పెట్టారు... చిలకలూరిపేటలో నన్ను ఏవిధంగా వేధించారు?" అని రజని ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రభుత్వాలు శాశ్వతం కాదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, అధికార పార్టీ మెప్పు కోసం చట్టాన్ని అతిక్రమించవద్దు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో మేం కూడా చట్టపరంగా పోరాడతాం. అప్పుడు మిమ్మల్ని బాధ్యుల్ని చేస్తాం. మీ ఉద్యోగ ధర్మాన్ని పాటించండి" అని విడదల రజని పోలీసులకు హితవు పలికారు. పిన్నెల్లి సోదరుల విషయంలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. Quote
psycopk Posted May 27 Author Report Posted May 27 Alla Ramakrishna Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కేపై సీఐడీ కేసు నమోదు 27-05-2025 Tue 15:01 | Andhra మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు ఆర్కేను 127వ నిందితుడిగా చేర్చిన సీఐడీ ఇప్పటికే ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. 2021లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదైంది. ఈ దాడి కేసులో ఆయన్ను 127వ నిందితుడిగా సీఐడీ పోలీసులు చేర్చారు. వివరాల్లోకి వెళితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో, 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, ఈ దాడి కేసును కూటమి ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్ అయ్యారు. Quote
psycopk Posted May 27 Author Report Posted May 27 Kodali Nani: కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు: నాని కుటుంబ సభ్యులు 27-05-2025 Tue 15:48 | Andhra శస్త్ర చికిత్స తర్వాత హైదరాబాద్ లోని నివాసంలో ఉంటున్న కొడాలి నాని ఇటీవల ఓ వివాహ రిసెప్షన్ కు హాజరైన నాని నాని కోలుకున్నారనే భావనతో ఆయనను కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ శ్రేణులు మాజీ మంత్రి కొడాలి నానికి ఇటీవల శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, ఆయనను పరామర్శించేందుకు గుడివాడ నియోజకవర్గం నుంచి గానీ, ఇతర ప్రాంతాల నుంచి గానీ అభిమానులు, వైసీపీ శ్రేణులు హైదరాబాద్ రావద్దని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. శస్త్రచికిత్స అనంతరం కొడాలి నానికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని, ఎక్కువ మంది వ్యక్తులను కలిస్తే ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచించినట్లు శశిభూషణ్ తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇటీవల కొడాలి నాని తప్పనిసరి పరిస్థితుల్లో ఓ సన్నిహిత మిత్రుడి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారని, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన ఆరోగ్యం కుదుటపడిందని కొందరు భావిస్తున్నారని... ఈ క్రమంలోనే పలువురు ఆయనను పరామర్శించేందుకు హైదరాబాద్ వస్తున్నట్లు తెలిసిందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది శ్రేయస్కరం కాదని అన్నారు. మరో రెండు నెలల్లో కొడాలి నాని పూర్తి ఆరోగ్యంతో అందరికీ అందుబాటులోకి వస్తారని శశిభూషణ్ స్పష్టం చేశారు. అప్పటివరకు అందరూ సహకరించాలని కోరారు. కాగా, కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం, మెరుగైన వైద్యం కోసం ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. ముంబైలో ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. Quote
psycopk Posted May 27 Author Report Posted May 27 Gali Janardhana Reddy: గాలి జనార్దనరెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి బెంగళూరుకు తరలింపు 27-05-2025 Tue 14:49 | Telangana ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దోషి గాలి జనార్దనరెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి బెంగళూరుకు తరలింపు పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లిన బెంగళూరు పోలీసులు బెంగళూరులో పెండింగ్‌లో పలు కేసులు ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషిగా తేలిన గాలి జనార్దనరెడ్డిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి బెంగళూరు నగరానికి తరలించారు. బెంగళూరులో ఆయనపై పలు కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో, అక్కడి పోలీసులు పీటీ వారెంట్ ఆధారంగా ఆయన్ను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకువెళ్లారు. గాలి జనార్దనరెడ్డి ఓబుళాపురం మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసులో శిక్ష పడటంతో కొంతకాలంగా చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉంటున్నారు. అయితే, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కూడా ఆయన పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడి కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్‌తో బెంగళూరు పోలీసులు చంచల్‌గూడ జైలు అధికారులను సంప్రదించారు. అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం గాలి జనార్దనరెడ్డిని తమ వెంట బెంగళూరుకు తీసుకెళ్లారు. Quote
megadheera Posted May 27 Report Posted May 27 24 minutes ago, psycopk said: Gali Janardhana Reddy: గాలి జనార్దనరెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి బెంగళూరుకు తరలింపు 27-05-2025 Tue 14:49 | Telangana ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దోషి గాలి జనార్దనరెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి బెంగళూరుకు తరలింపు పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లిన బెంగళూరు పోలీసులు బెంగళూరులో పెండింగ్‌లో పలు కేసులు ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషిగా తేలిన గాలి జనార్దనరెడ్డిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి బెంగళూరు నగరానికి తరలించారు. బెంగళూరులో ఆయనపై పలు కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో, అక్కడి పోలీసులు పీటీ వారెంట్ ఆధారంగా ఆయన్ను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకువెళ్లారు. గాలి జనార్దనరెడ్డి ఓబుళాపురం మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసులో శిక్ష పడటంతో కొంతకాలంగా చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉంటున్నారు. అయితే, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కూడా ఆయన పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడి కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్‌తో బెంగళూరు పోలీసులు చంచల్‌గూడ జైలు అధికారులను సంప్రదించారు. అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం గాలి జనార్దనరెడ్డిని తమ వెంట బెంగళూరుకు తీసుకెళ్లారు. Veedu inka lopale unnada? Eppudo baitiki vachi TV interview Lu kuda ichadu kada Quote
mettastar Posted May 27 Report Posted May 27 50 minutes ago, psycopk said: Gali Janardhana Reddy: గాలి జనార్దనరెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి బెంగళూరుకు తరలింపు 27-05-2025 Tue 14:49 | Telangana ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దోషి గాలి జనార్దనరెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి బెంగళూరుకు తరలింపు పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లిన బెంగళూరు పోలీసులు బెంగళూరులో పెండింగ్‌లో పలు కేసులు ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషిగా తేలిన గాలి జనార్దనరెడ్డిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి బెంగళూరు నగరానికి తరలించారు. బెంగళూరులో ఆయనపై పలు కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో, అక్కడి పోలీసులు పీటీ వారెంట్ ఆధారంగా ఆయన్ను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకువెళ్లారు. గాలి జనార్దనరెడ్డి ఓబుళాపురం మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసులో శిక్ష పడటంతో కొంతకాలంగా చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉంటున్నారు. అయితే, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కూడా ఆయన పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడి కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్‌తో బెంగళూరు పోలీసులు చంచల్‌గూడ జైలు అధికారులను సంప్రదించారు. అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం గాలి జనార్దనరెడ్డిని తమ వెంట బెంగళూరుకు తీసుకెళ్లారు. Idoka loophole emo .. banglore police station lo veedi manushulu undi untaru .. AC room set chesi untaru veedi kosam 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.