Jump to content

Recommended Posts

  • Replies 53
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    46

  • ARYA

    3

  • futureofandhra

    2

  • yslokesh

    1

Posted
1 hour ago, ARYA said:

 

who ever tweeted this he must be an idiot

jonnalu good for health

 

 

Posted
Just now, futureofandhra said:

who ever tweeted this he must be an idiot

jonnalu good for health

 

 

So you’re calling NTR an idiot? 
@psycopk 

  • Haha 1
Posted
7 minutes ago, ARYA said:

So you’re calling NTR an idiot? 
@psycopk 

as i said who ever tweeted

ntr wanted to give food to poor

these idiots spoiling ntr name

Posted
9 minutes ago, futureofandhra said:

as i said who ever tweeted

ntr wanted to give food to poor

these idiots spoiling ntr name

So you are saying ntr followers are idiots

Posted
4 hours ago, futureofandhra said:

who ever tweeted this he must be an idiot

jonnalu good for health

 

 

Thats how Conspiracy theory works.

After WW-2, too much Nitrogen and Ammonia were left unused in Europe, they started rice & sugar cultivation at industrial scale afterwards..

Plus instead of whole-grain flour, companies in Europe started using husk&chaff free grains for longer storage and tasty food.

Hence these Pizzas, Burgers, candies, chocos, biscuits - pretty much every food item we eat today.

And then entered the Diabetes into common pool of genetics.

.

.

In that way Anna gooru added to it & contributed to the health issues the current generation is facing today.

Posted

 

Pawan Kalyan: ఎన్టీఆర్ కు ఘన నీరాజనం అర్పించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 

28-05-2025 Wed 14:32 | Andhra
Pawan Kalyan Pays Tribute to NTR on 102nd Birth Anniversary
 

 

  • ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాళి
  • తెలుగు సంస్కృతి, సినిమా, సామాజిక సేవల్లో ఎన్టీఆర్ ది చెరగని ముద్ర అని కితాబు
  • ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడిగా ఎన్టీఆర్‌ను అభివర్ణించిన పవన్ కల్యాణ్, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

"తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నీరాజనం. ఎన్టీఆర్ గారు తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారు. మాయాబజార్, మిస్సమ్మ, సంపూర్ణ రామాయణం వంటి అనేక చిత్రాలలో అజరామర నటనతో చిరస్థాయిగా నిలిచిపోయారు. 

"సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు" అనే అక్షర సత్య ఆలోచన, రాజకీయాల పట్ల ఎన్టీఆర్ గారి దృక్కోణాన్ని తెలియచేస్తుంది. రెండు రూపాయలకు కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులో వాటా, విద్యావకాశాల విస్తరణలో భాగంగా ఎంసెట్ ప్రవేశ పరీక్షను ప్రారంభించడం, ఈ రోజు మహానాడు జరిగే కడప ప్రాంతానికి నీళ్లు అందించే తెలుగుగంగ ప్రాజెక్ట్ వంటి అనేక చారిత్రక నిర్ణయాలతో ఎన్టీఆర్ గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. 

ఆయన స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం కాన్సర్ ఆసుపత్రి ప్రజా సేవలో ఆయన విజన్‌ను ఈ రోజుకీ కొనసాగిస్తోంది. ఈ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గారి ఆదర్శాలను స్మరించుకుంటూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని, సమైక్యతను కాపాడుకుంటూ, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలి అని ఆకాంక్షిస్తున్నాను" అంటూ  పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 

 

 

 

Posted

NTR: మరణించినా తెలుగుజాతి గుండె చప్పుడు ఎన్టీఆర్: పయ్యావుల కేశవ్ 

28-05-2025 Wed 11:36 | Andhra
NTR Still Echoes in Telugu Hearts Says Payyavula Keshav
 

 

  • కడపలో కొనసాగుతున్న టీడీపీ మహానాడు-2025
  • సభికులను ఉద్దేశించి మాట్లాడిన సీనియర్ నేత
  •  రాష్ట్ర రాజకీయాలు, పార్టీ అంశాలపై ప్రస్తావించినట్లు సమాచారం
  • పయ్యావుల ప్రసంగానికి పార్టీ వర్గాల్లో ప్రాధాన్యత
కడప జిల్లాలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు-2025 రెండో రోజు కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మహానాడు రెండో రోజున జరిగిన సభలో పయ్యావుల కేశవ్ తన వాగ్దాటిని ప్రదర్శించారు. పార్టీలో కీలక నేతగా, మంచి వక్తగా, సమకాలీన అంశాలపై లోతైన విశ్లేషణ చేయగల నేతగా పేరున్న ఆయన.. మహానాడు వేదిక నుంచి పార్టీ కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు వంటి అంశాలను ప్రస్తావించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేలా, వారిలో నూతనోత్సాహం నింపేలా ఆయన ప్రసంగం సాగింది. 

పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పిస్తూ రెండోరోజు కార్యక్రమం ప్రారంభమవుతున్నట్టు చెప్పారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మహోన్నత శిఖరాలపై నిలబెట్టిన మహనీయుడు, మరణించినా తెలుగుజాతి గుండె చప్పుడుగా నిలిచిన మహోన్నతుడు, అనితర సాధ్యమైనటువంటి చరిత్ర సృష్టించిన ప్రజా నాయకుడు, తెలుగు గడ్డమీదే కాకుండా యావత్ దేశంలోనూ తెలుగు కీర్తిపతాకను రెపరెపలాడించిన మహోన్నతుడు, నిజాయతీ, నిబద్ధతకు నిలువెత్తు స్వరూపం, తెలుగుజాతి చరిత్రను తిరగరాసి, వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అధికారాన్ని అందించిన మహోన్నతుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన నటించిన సినిమా సంచలనమని, ఆయన రాజకీయం రారాజకీయమని అన్నారు. అటువంటి మహానుభావుడికి ఘనమైన నివాళి అర్పిస్తున్నట్టు పేర్కొన్నారు.
Posted

NTR: మహానాడు వేదికపై ఎన్టీఆర్ కు చంద్రబాబు నివాళి 

28-05-2025 Wed 11:27 | Andhra
Chandrababu Pays Tribute to NTR at Mahanadu Venue
 

 

  • తెలుగుజాతి గుండెల్లో పెట్టుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్
  • రెండు రంగాల్లో రారాజుగా రాణించడం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన ఘనత
  • సమాజంలో అన్ని వర్గాలు కీర్తించే నాయకుడని కొనియాడిన చంద్రబాబు
తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదిక పైనుంచి నివాళులు అర్పించారు. ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన ఘనత అని చెప్పారు. సాధారణ రైతు బిడ్డగా పుట్టిన ఎన్టీఆర్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా రాణించారని గుర్తు చేశారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన నాయకుడు ప్రపంచంలో ఎన్టీఆర్ మాత్రమేనని చంద్రబాబు చెప్పారు.

పదవికి కొత్త భాష్యం..
అధికారం అంటే బాధ్యత అని, పదవి అంటే సేవ చేసే అవకాశమని, పాలకులు అంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాలే మార్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగి స్థాయి నుంచి తెలుగు సినీరంగంలో ఎవరెస్టుగా ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం అనితర సాధ్యమని, మన కళ్లముందు కనిపించిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ జీవితమేమీ పూలపాన్పు కాదని, నిరంతరం పోరాటాలతోనే ఆయన ఎదిగారని చెప్పుకొచ్చారు. స్వీయక్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలని చంద్రబాబు తెలిపారు.

పసుపు జెండా శాశ్వతం..
43 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని చంద్రబాబు చెప్పారు. ఈ జెండా శాశ్వతంగా ఉంటుందని, తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంటారని అన్నారు. సినీ రంగంలో 33 ఏళ్లు, రాజకీయ రంగంలో 13 ఏళ్ల పాటు ఎన్టీఆర్ అద్వితీయ చరిత్ర సృష్టించారని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం చూస్తూ ఏ సంకల్పం చేసినా దానిని సాధించే శక్తి, సామర్థ్యం మీకు వస్తుందని చంద్రబాబు వివరించారు.

ఆయన ప్రసంగమే ఓ గర్జన..
చైతన్యరథంపై రాష్ట్రంలో తిరుగుతూ ఎన్టీఆర్ గర్జించారని చెప్పారు. ఎన్టీఆర్ ప్రసంగిస్తుంటే గర్జించినట్లే ఉండేదని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాని ఘనతలు ఎన్నో ఆయన అలవోకగా సాధించారని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ అంటే పేదలకు భరోసా అని, యువతకు భవిష్యత్తు అని, కార్మిక లోకానికి అండ అని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

సుపరిపాలనకు ఆద్యులు ఎన్టీఆర్..
సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన తో పాలనలో కొత్త ఒరవడికి ఎన్టీఆర్ ఆద్యులుగా నిలిచారని చంద్రబాబు చెప్పారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని రెండు రూపాయలకు కిలో బియ్యం తెచ్చారని, అందరికీ పక్కా ఇళ్లు, బడుగులకు జనతా వస్త్రాలు అందించారని గుర్తు చేశారు. వృద్ధాప్య పెన్షన్లు, రూ.50కే హార్స్‌ పవర్‌ విద్యుత్‌, గురుకుల పాఠశాలల ఏర్పాటు, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ఆస్తి హక్కు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం... ఇలా సంక్షేమాన్ని- అభివృద్ధిని సమతుల్యం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. పటేల్‌ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, సింగిల్ విండో విధానానికి రూపకల్పన చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది ఎన్టీఆరేనని గుర్తుచేశారు.

రాజకీయాల్లోకి రాకముందు కూడా..
ఎన్టీఆర్ నిరంతరం ప్రజల కోసమే ఆలోచించేవారని, రాజకీయాల్లోకి రాకముందు కూడా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ ముందుకొచ్చి సాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. 1952 సంవత్సరంలో రాయలసీమలో కరువు వచ్చినప్పుడు,1962లో భారత్‌ చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు ఎన్టీఆర్ జోలె పట్టి విరాళాలు సేకరించారని చెప్పారు. 1965లో భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు, 1972లో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు, 1977లో దివిసీమ ఉప్పెన సంభవించినప్పుడు... వేల మంది మృత్యువాత పడి, లక్షలాది మంది నిరాశ్రయులైతే ఎన్టీఆర్ స్వయంగా దివిసీమ వెళ్లి సేవా కార్యక్రమాలు చేపట్టారు. 

ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేద్దాం...స్వర్ణాంధ్ర సాధిద్దాం..
ఈ నాలుగు దశబ్దాల్లో ఎన్నో మైలురాళ్లు దాటొచ్చామని చంద్రబాబు తెలిపారు. ఎన్నో విజయాలు, మరెన్నో అనుభవాలు మూటగట్టుకున్నామని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలు ముందుకు తీసుకువెళ్తున్నామని, ఆయన స్ఫూర్తితోనే సంక్షేమానికి, సంస్కరణలకు, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం కోసం ఎన్టీఆర్ తపించారని, ఆయన ఆశయ సాధన కోసం పీ4 విధానాన్ని తీసుకువచ్చామన్నారు. దీని ద్వారా జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. ఆర్ధిక అసమానతలు తగ్గించి జీవన ప్రమాణాలు పెంచుతామని వివరించారు. పార్టీ సిద్దాంతాల్లో నూతనత్వాన్ని తెచ్చేందుకు తీసుకొచ్చిన 6 సూత్రాలు గేమ్ చేంజర్ అవుతాయని అన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో 2047 నాటికి తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
Posted

Ashok Gajapathi Raju: ఎన్‌టీఆర్‌ ఆశయాలను కొనసాగిస్తున్న చంద్రబాబు బాటలో అందరం నడవాలి: అశోక్ గజప‌తి రాజు 

28-05-2025 Wed 11:27 | Andhra
Ashok Gajapathi Raju Speech at TDP Mahanadu in Kadapa
 

 

  • క‌డ‌ప‌లో రెండో రోజు టీడీపీ మ‌హానాడు స‌భ‌లు
  • మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజప‌తి రాజు ప్రసంగం
  • తెలుగువారి ఘనతను చాటి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అంటూ ప్ర‌శంస‌
  • ఆ ఘనతను స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకు ఆదర్శంగా ఉండాలని పిలుపు
క‌డ‌ప‌లో రెండో రోజు టీడీపీ మ‌హానాడు స‌భ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఎన్‌టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా నేత‌లు ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. అనంత‌రం మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజప‌తి రాజు ప్రసంగించారు. తెలుగువారి ఘనతను చాటి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని అన్నారు. ఆ ఘనతను స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకు ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

జీవించాక మరణించక తప్పదు.. మరణించినా ప్రజల గుండెల్లో నిలబడటం చాలా గొప్ప విషయం అన్నారు. అలా ఉన్న వ్యక్తే అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఎన్‌టీఆర్‌ ఆశయాలను కొనసాగిస్తున్న నారా చంద్రబాబు బాటలో అందరం నడవాలని అశోక్ గజప‌తి రాజు తెలిపారు. మహాత్ములని స్ఫూర్తిగా తీసుకొని నడిచిన నందమూరి నేడు మనందరికి స్ఫూర్తిగా నిలిచారన్నారు.

పసుపు అంటే పుణ్యమైన రంగు.. ఆ చక్రం శ్రమ జీవులకోసం, ఆ నాగలి రైతులకోసం ఆ గుడిసే అందరికి ఇళ్లకోసం ఇది పేదలకోసం పుట్టిన జెండా.. ప్రజలకోసం నిలిసిన పార్టీ అని చెప్పారు. ఆత్మగౌరవంతో ఉండాలని ఎన్టీఆర్ ఆకాంక్షించేవారని ఈ సంద‌ర్భంగా మాజీ కేంద్ర మంత్రి గుర్తు చేశారు. మనం నిర్భయంగా పనిచేయగలితే మన ఆత్మగౌరవాన్ని పెంచుకోగలుగుతామ‌న్నారు. 

నాడు అన్నగారిపై కూడా  అక్రమ కేసులు పెట్టార‌ని, అయినా ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు వెళ్లి సమాధానం ఇచ్చార‌ని తెలిపారు. అలాగే చంద్రబాబును అక్రమంగా 52 రోజులు జైల్లో పెట్టినా ఆయన అధైర్య పడలేదన్నారు. గత ప్రభుత్వం లాంటి పాలన‌ను తానేప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఉన్నంత వరకు తెలుగుదేశం ఉంటుంద‌న్నారు. 

ప్రజలకోసం పనిచేసే పార్టీ.. ఆత్మగౌరవాన్ని పెంచే పార్టీ టీడీపీ అని తెలిపారు. ఎక్క‌డున్నా తెలుగువారి కీర్తిని చాటి చెప్పాల‌న్నారు. భవిష్యత్తు మన యువకులది.. అందరు కలిసి పనిచేయాలని అశోక్ గజప‌తి రాజు పిలుపునిచ్చారు.  
Posted

Jr NTR: మరొక్కసారి ఈ గుండెను తాకిపో తాతా: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగం 

28-05-2025 Wed 11:01 | Entertainment
Jr NTR emotional tribute to NTR on his birth anniversary
 

 

  • నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు
  • హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
  • పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలు ఆయనను ఘనంగా స్మరించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఎన్టీఆర్ సమాధి వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రత్యేక పూజలు చేసి, పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను" అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పలువురి హృదయాలను తాకిందని, అభిమానులు "జోహార్ ఎన్టీఆర్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 
Posted

 

NTR: ఎన్టీఆర్ కు ప్రధాని మోదీ నివాళి 

28-05-2025 Wed 10:22 | Andhra
PM Modi Pays Tribute to NTR
 

 

  • గొప్ప దార్శనికుడని ఎన్టీఆర్ ను కొనియాడిన మోదీ
  • ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు వెల్లడి
  • నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్న ప్రధాని
నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన నటించిన పాత్రలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ ఆయనకు నివాళులర్పించారు. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ విశిష్ట నటుడని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేసిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందామని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. 

 

 

 

Posted

Chandrababu Naidu: చరిత్ర సృష్టించిన మహనీయుడు ఎన్టీఆర్: చంద్రబాబు 

28-05-2025 Wed 09:38 | Andhra
Chandrababu Pays Tribute to NTR on Birth Anniversary
 

 

  • నేడు ఎన్టీఆర్ జయంతి
  • నివాళి అర్పించిన చంద్రబాబు
  • ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, మండల వ్యవస్థ ఎన్టీఆర్ ఘనతేనన్న సీఎం
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఒక సంఘ సంస్కర్త అని, సంక్షేమానికి సరికొత్త మార్గం చూపిన మహనీయుడని కొనియాడారు. పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే మూడు ప్రాథమిక అవసరాలు తీర్చడమే తన జీవిత లక్ష్యంగా భావించిన ధీరోదాత్తుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు ప్రశంసించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం పలికిన దార్శనికుడు ఎన్టీఆర్. అన్నగా ఆయన ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు కల్పించారు. మండల వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలనను ప్రజల ముంగిటకు చేర్చారు. పక్కా ఇళ్ల నిర్మాణ పథకంతో పేదలకు అండగా నిలిచారు. కిలో రెండు రూపాయలకే బియ్యం అందించి పేద ప్రజల ఆకలి తీర్చిన గొప్ప మనసున్న నేత" అని అన్నారు.

"నా తెలుగు జాతి ప్రపంచ యవనికపై సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నదే ఎన్టీఆర్ ఏకైక సంకల్పం. ఆయన చరిత్రలో ఒక స్థానం సంపాదించుకోవడమే కాదు, స్వయంగా చరిత్రనే సృష్టించిన చిరస్మరణీయుడు. ఈనాటికీ తెలుగుదేశం పార్టీ ఉజ్వలంగా ప్రకాశిస్తోందంటే అది ఆయన దివ్యాశీస్సుల బలమే. ఆ మహనీయుడి ఆశయాలను, సంకల్పాన్ని నెరవేర్చడానికి మేమంతా అహర్నిశలూ శ్రమిస్తూనే ఉన్నాం. సమసమాజ స్థాపన దిశగా మా ప్రయాణం కొనసాగుతోంది" అని ముఖ్యమంత్రి వివరించారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...