Jump to content

Recommended Posts

Posted

Kasi Reddy: లిక్కర్ స్కామ్... జైల్లో ఉన్న రాజ్ కసిరెడ్డిని విచారిస్తున్న ఈడీ అధికారులు 

28-05-2025 Wed 14:23 | Andhra
Liquor Scam ED Interrogates Key Accused Kasi Reddy
 

 

  • లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ
  • డబ్బు ఎలా మళ్లించారు, ఎవరెవరికి చేరిందనే కోణంలో దర్యాప్తు
  • సిట్ అధికారులతో నిన్న ఈడీ అధికారుల భేటీ
మద్యం కుంభకోణం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తమ దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి)ని విచారించేందుకు ఈ ఉదయం ఈడీ అధికారులు విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. రాజశేఖర్ రెడ్డి నుంచి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు ఈడీ అధికారులు ఇప్పటికే కోర్టు నుంచి అనుమతి పొందారు.

మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన సొమ్మును ఎలా దారి మళ్లించారు, ఈ నగదు ఎవరెవరి చేతులు మారింది, ఎప్పుడెప్పుడు ఈ లావాదేవీలు జరిగాయి అనే అంశాలపై ఈడీ అధికారులు రాజ్ కసిరెడ్డిని ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న ఈడీ బృందం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులతో సమావేశమైంది. కేసు పూర్వాపరాలను సిట్ అధికారులు ఈడీకి వివరించారు. ఇకపై ఈ కేసు విచారణలో పరస్పరం సహకరించుకోవాలని ఇరు దర్యాప్తు సంస్థలు నిర్ణయించుకున్నాయి.

మద్యం కుంభకోణంలో ఏ-1 నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డితో పాటు ఇతర నిందితులు, మద్యం వ్యాపారులు, కొందరు మాజీ అధికారులు సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా, ఈ అక్రమ లావాదేవీల ద్వారా వచ్చిన ముడుపులు చివరకు ఎవరికి చేరాయనే విషయంపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంచనాలను బలపరిచేందుకు పక్కా ఆధారాలను సేకరించాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. 

రాజ్ కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న క్యాష్ హ్యాండ్లర్ల ద్వారా వసూలైన డబ్బు ఎన్ని దశలు దాటి, ఎవరికి చేరిందనే విషయంపై ఇటీవల అరెస్టు చేసిన ముగ్గురు కీలక వ్యక్తుల విచారణలో మరిన్ని వివరాలు బయటపడినట్లు సమాచారం. గత ఐదేళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగా చక్రం తిప్పారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓఎస్‌డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు ఇప్పటికే విచారించారు. సిట్ సేకరించిన ఈ వివరాల ఆధారంగా ఈడీ తన దర్యాప్తును ముందుకు తీసుకెళ్లనుంది.
Posted

 

Sajjala Bhargava Reddy: పోలీసు విచారణకు హాజరైన సజ్జల భార్గవరెడ్డి 

28-05-2025 Wed 11:32 | Andhra
Sajjala Bhargava Reddy Attends Police Inquiry
 

 

  • పవన్, లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యల కేసు
  • మంగళగిరి రూరల్ పీఎస్ కు వచ్చిన భార్గవ్
  • భార్గవ్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి విచారణకు హాజరయ్యారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు ఆయన వచ్చారు. కేసు విచారణకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన పోలీసులు రమ్మన్న సమయం కంటే ముందుగానే పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం భార్గవ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  

 

 

 

Posted

 

Sanjay: ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు 

28-05-2025 Wed 10:10 | Andhra
IPS Sanjay Suspension Extended for Six More Months
 

 

  • గత ప్రభుత్వంలో అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన సంజయ్
  • నిధుల దుర్వినియోగం అభియోగాలపై గత ఏడాది డిసెంబర్ 3న సస్పెండ్ చేసిన ప్రభుత్వం 
రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ సస్పెన్షన్‌ను మరో ఆరు నెలల పాటు పొడిగించింది. నవంబర్ 27 వరకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీగా, సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగంపై గత ఏడాది డిసెంబర్ 3న ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ గడువు ఈ నెల 31తో ముగియనుంది.

ఏసీబీ కేసు దర్యాప్తు పెండింగ్‌లో ఉండటం, సాక్షులను ఇంకా విచారించాల్సి ఉండటంతో సంజయ్ సస్పెన్షన్‌ను మరికొన్నాళ్లు పొడిగించాలని రివ్యూ కమిటీ నిర్ణయించింది. దీని ఆధారంగా తాజాగా ఆయన సస్పెన్షన్‌ను పొడిగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.  

 

 

 

Posted

Nandigam Suresh: నందిగం సురేశ్ ను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న తుళ్లూరు పోలీసులు

28-05-2025 Wed 14:58 | Andhra
Nandigam Suresh Taken into 3 Day Custody by Tulluru Police

 

  • ఇసుకపల్లి రాజు కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్ విచారణ
  • సురేశ్ ను పోలీసు కస్టడీకి ఇచ్చిన మంగళగిరి కోర్టు
  • గుంటూరు సబ్ జైలు నుంచి తుళ్లూరు పీఎస్‌కు నందిగం సురేశ్

టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పోలీసులు ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు. మంగళగిరి కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం, తుళ్లూరు పోలీసులు ఆయనను మూడు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకుని విచారించనున్నారు.

గుంటూరు జిల్లా సబ్ జైలులో రిమాండులో ఉన్న నందిగం సురేశ్ ను విచారణ నిమిత్తం తుళ్లూరు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాబోయే మూడు రోజుల పాటు లోతుగా ప్రశ్నించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.

నందిగం సురేశ్ ను మే 18వ తేదీ సాయంత్రం తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసి, మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం, న్యాయమూర్తి ఆయనకు జూన్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా, గతంలో ఓ మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ మూడు నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఇటీవలే ఆయన ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...