psycopk Posted June 1 Report Posted June 1 Alla Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి తప్పే.. కానీ నా ప్రమేయం లేదు: సీఐడీ విచారణలో ఆళ్ల రామకృష్ణారెడ్డి 01-06-2025 Sun 08:30 | Andhra దాడి ఘటన తప్పేనని, పెద్దల ఆదేశాలు లేకుండా జరగదని ఆర్కే అన్నట్లు గుసగుసలు దాడి జరిగినప్పుడు తాను పొలంలో ఉన్నానని సీఐడీకి వివరణ లోకేశ్‌పై గెలిచినందుకే కేసులో ఇరికించారని మీడియా ముందు ఆర్కే ఆవేదన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కేసులో మంగళగిరి మాజీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) శనివారం సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో 127వ నిందితుడిగా ఉన్న ఆయన, తన మిత్రుడితో కలిసి స్కూటర్‌పై గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం తన న్యాయవాది సమక్షంలో విచారణకు వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ విచారణలో సీఐడీ అధికారులు ఆర్కేను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆర్కే ఏం చెప్పారంటే..? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విచారణ సందర్భంగా కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. "మీ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేగా మీకు తెలియదా?" అని అధికారులు ప్రశ్నించగా, పార్టీలో జరిగే కొన్ని విషయాలు మాత్రమే తనకు తెలుస్తాయని, దాడి విషయం తనకు తెలియదని ఆర్కే సమాధానమిచ్చినట్లు సమాచారం. "దాడిని మీరెందుకు ఖండించలేదు?" అన్న ప్రశ్నకు, ఆ ఘటన పట్ల తాను తీవ్ర మనస్తాపం చెందానని, అందుకే దానిపై ఎక్కడా మాట్లాడలేదని, కనీసం ప్రెస్‌నోట్ కూడా విడుదల చేయలేదని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటన పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా తప్పిదమేనని ఆర్కే అంగీకరించినట్లు సమాచారం. ఆ సమయంలో తాను పొలంలో ఉన్నానని, కావాలంటే తన సెల్‌ఫోన్‌ను పరిశీలించి లొకేషన్ చెక్ చేసుకోవచ్చని ఆయన అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది. దాడి జరిగి మూడేళ్లు గడిచినా విచారణ ఎందుకు ముందుకు సాగలేదన్న ప్రశ్నకు, తాను కేసులో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని ఆర్కే స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తం మీద అధికారులు ఆర్కేను 38 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. విచారణ అనంతరం ఆర్కే ఏమన్నారంటే.. సీఐడీ విచారణ ముగిసిన అనంతరం ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. "దాడి జరిగిన రోజు తాను పొలంలో ఉన్న విషయాన్ని అధికారులకు స్పష్టంగా చెప్పాను. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు ఇచ్చాను. ఘటన జరిగిన ఏడాది తర్వాత నన్ను ఈ కేసులో చేర్చడం దారుణం. ఈ దాడిలో నా పాత్ర ఏమాత్రం లేదని తెలిసినా, గతంలో నారా లోకేశ్‌పై గెలిచినందుకే నన్ను ఈ కేసులో ఇరికించారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నేను తీవ్రంగా వ్యతిరేకించాను. అందుకే ఇప్పుడు రాజకీయ కక్షతో ఛార్జిషీట్ దాఖలు చేసే ముందు నన్ను నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాను" అని ఆర్కే వివరించారు. Quote
psycopk Posted June 1 Author Report Posted June 1 Bosedk follower https://www.instagram.com/reel/DKTsYdjsXdE/?igsh=bXNmenYxZ29iMm9v Quote
psycopk Posted June 1 Author Report Posted June 1 Nara Lokesh: ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం ఇది: ఏపీ మంత్రి నారా లోకేశ్ 01-06-2025 Sun 07:03 | Andhra గత ప్రభుత్వం ఖాళీగా వదిలివేసిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలి ఏడాదిలోనే తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న నారా లోకేశ్ మెయిన్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్ధులకు ఆల్ ద బెస్ట్ అంటూ లోకేశ్ శుభాకాంక్షలు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల జాతర మొదలైందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. గత ప్రభుత్వం ఖాళీగా వదిలివేసిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలి ఏడాదిలోనే తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక పరీక్షలు పూర్తి చేయగా, ఆదివారం మెయిన్ పరీక్ష నిర్వహించబోతున్నామన్నారు. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ అంటూ లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. Quote
Android_Halwa Posted June 1 Report Posted June 1 Intaki....TDP office ni enduku attack chesinaru ? Ante...nippu lekunda poga raadu kada...trying to recollect what exactly happened so much so that the YCP cadre had to attack TDP office... @psycopk Emaindi asalu ? emana gurtu vunda ? Quote
jalsa01 Posted June 1 Report Posted June 1 1 hour ago, Android_Halwa said: Intaki....TDP office ni enduku attack chesinaru ? Ante...nippu lekunda poga raadu kada...trying to recollect what exactly happened so much so that the YCP cadre had to attack TDP office... @psycopk Emaindi asalu ? emana gurtu vunda ? Alanti bevarse panulu chestene kada psyco kallalo padedi... mamul ga unte vadu dekhadu.. okadu cbn inti medhaki velli minister iyyadu .. so party office medha ki oote edo istadu ani aasa Quote
Android_Halwa Posted June 1 Report Posted June 1 33 minutes ago, jalsa01 said: Alanti bevarse panulu chestene kada psyco kallalo padedi... mamul ga unte vadu dekhadu.. okadu cbn inti medhaki velli minister iyyadu .. so party office medha ki oote edo istadu ani aasa Areyrey….!!! Endo mee gnapaka shakthi roju roju ki baaga taggipotundi…May be AI baaga use chesi chesi vadaksina burra peddaga vadatledu anukunta…anduke chesina penta ae matram gurtu vundatledu Intaki, TDP office enduku attack chesinaru ? Okasari gurtu techuko…chusdam entha sharp vundo memory… Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.