psycopk Posted June 3 Report Posted June 3 Raghurama Krishnam Raju: జగన్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు: రఘురామకృష్ణరాజు 03-06-2025 Tue 14:58 | Andhra గంజాయి బ్యాచ్ ను కలవడమేంటని జగన్ కు రఘురామ ప్రశ్న పోలీసులపై హత్యాయత్నం చేసినవారికి జగన్ అండదండలా? అని మండిపాటు నన్ను కస్టడీలో కొట్టించింది జగనే అంటూ తీవ్ర వ్యాఖ్యలు వైసీపీ అధినేత జగన్ తీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను జగన్ పరామర్శించడం దిగజారుడు ఓట్ల రాజకీయాలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. "రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవనేది జగన్ లాంటి వారిని చూసే పుట్టింది. గంజాయి బ్యాచ్‌ను పరామర్శించి ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు" అని రఘురామ వ్యాఖ్యానించారు. పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులకు జగన్ అండదండలు అందించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి చర్యల ద్వారా జగన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. గతంలో తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు, జగనే తనను కస్టడీలో కొట్టించారని రఘురామ సంచలన ఆరోపణ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌ను చూసి జాలిపడటం తప్ప ఏమీ చేయలేమని ఆయన అన్నారు. "నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైసీపీ నేతల అదృష్టం" అంటూ రఘురామ ఎద్దేవా చేశారు. జగన్ వైఖరి రాష్ట్ర ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఆయన చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. Quote
psycopk Posted June 3 Author Report Posted June 3 YS Jagan: తెనాలిలో జగన్‌కు నిరసన సెగ 03-06-2025 Tue 13:42 | Andhra తెనాలిలో జగన్ పర్యటనలో ఉద్రిక్తత ఆయన పర్యటనపై దళిత, ప్రజా సంఘాలు నిరసన ఐతా నగర్లో రౌడీ షీటర్లను పరామర్శించడానికి వస్తున్నారంటూ అభ్యంతరం గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఆయన పర్యటనపై దళిత, ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. ఐతా నగర్లో రౌడీ షీటర్లను పరామర్శించడానికి వస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశాయి. జగన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో నల్లబెలూన్లతో దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. జగన్‌కు వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు నినాదాలు చేశారు. తెనాలిలో సామాన్యులపై దాడులు, మహిళలపై వేధింపులు, గంజాయి విక్రయాలకు పాల్పడిన ముఠా సభ్యులను పరామర్శించేందుకు జగన్ వస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, తెనాలిలో దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులపై కొందరు పోలీసులు ఇటీవల దాడి చేశారన్న ఆరోపణలపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో జగన్ ఇవాళ తెనాలిలో పర్యటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏప్రిల్ 25న తెనాలిలో జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులపై కొందరు పోలీసులు అత్యంత దారుణంగా దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ యువకులు దళిత, మైనారిటీ వర్గాలకు చెందినవారని తెలుస్తోంది. గంజాయి కలిగి ఉన్నారనే అనుమానంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌తో ఈ యువకులకు వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత రద్దీగా ఉండే రోడ్డుపై అందరూ చూస్తుండగా పోలీసులు వారిని కింద కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మే 26న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.