psycopk Posted June 4 Author Report Posted June 4 Atchannaidu: ప్రజాస్వామ్యానికి కొత్త దిశను ఇచ్చిన రోజు జూన్ 4: అచ్చెన్నాయుడు 04-06-2025 Wed 17:23 | Andhra ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ప్రకటన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని వెల్లడి తొలి ఏడాదిలోనే 700కు పైగా అభివృద్ధి, సంక్షేమ హామీలు అమలు చేశామని స్పష్టం రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని ధీమా జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మార్గదర్శకమైన రోజని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన ఈ రోజు ప్రజాస్వామ్యానికి కొత్త దిశను చూపిందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది కేవలం ప్రభుత్వ విజయం మాత్రమే కాదని, ప్రజా సేవ చేయాలనే సంకల్పానికి ప్రజలు ఇచ్చిన బలమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తొలి ఏడాదిలోనే అసాధారణ కృషి చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. "రాష్ట్రంలో ఏ శాఖను పరిశీలించినా అప్పులు, అర్జీలే దర్శనమిచ్చే దుస్థితి నుంచి బాధ్యతలు స్వీకరించిన మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రతిష్ఠ, అనుభవం, కఠోర శ్రమతో మొదటి సంవత్సరంలోనే 700కు పైగా అభివృద్ధి, సంక్షేమ హామీలను అమలు చేసింది" అని మంత్రి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన పలు కీలక కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. "తొలి నెలలోనే రూ.3 వేల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచాం. పేదవారి ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాం. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. రికార్డు స్థాయిలో 54 లక్షల టన్నుల ధాన్యం సేకరించి, రైతులకు 24 గంటల్లోనే డబ్బులు చెల్లించాం" అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అంతేకాకుండా, 20 వేల కిలోమీటర్ల రోడ్లను గుంతలు లేకుండా మరమ్మతులు చేశామని, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందికరంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిచ్చామని అన్నారు. మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని రూ.20 వేలకు పెంచామని, సేద్యానికి ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్‌ను, 80 శాతం రాయితీతో రైతులకు విత్తనాలను పంపిణీ చేశామని గుర్తుచేశారు. రూ.9.40 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా 6 లక్షల ఉద్యోగాల కల్పనకు బాటలు వేశామని చెప్పారు. "ఇలా ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వని హామీలను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు సాగుతోంది" అని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వ పనితీరు వల్ల నేడు పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందని, గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయని, రాత్రి వేళల్లో మహిళలు క్షేమంగా ఇళ్లకు చేరుకుంటున్నారని, యువత మాదకద్రవ్యాలకు దూరమయ్యారని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. పాలనలో వినూత్నంగా 'మిత్ర-వాట్సాప్ గవర్నెన్స్', డ్రోన్ల వినియోగం వంటి సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ విజయాలన్నీ ప్రజల భాగస్వామ్యం వల్లే సాధ్యమయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. "మీ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములై తెలుగువారి కీర్తిని మరోసారి ప్రపంచానికి పరిచయం చేద్దాం" అని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. Quote
psycopk Posted June 4 Author Report Posted June 4 Pawan Kalyan: జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది: పవన్ కల్యాణ్ 04-06-2025 Wed 14:37 | Andhra ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది పూర్తి ప్రజా తీర్పుతో నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన రోజు జూన్ 4: పవన్ గత తప్పిదాలు సరిదిద్దుతూ, స్వర్ణాంధ్ర దిశగా పాలన: డిప్యూటీ సీఎం మోదీ, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధికి కృషి జనసైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని హామీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయం సాధించి నేటికి ఏడాది పూర్తయిందని, ఈ ప్రజా తీర్పు ప్రజా చైతన్యానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నిదర్శనమని జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. 2024 జూన్ 4వ తేదీ భారత రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజుగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల అరాచక పాలనను అంతమొందించి, నిరంకుశ పోకడలను ప్రజలు తమ ఓటు హక్కుతో తిప్పికొట్టి, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు మార్గం సుగమం చేసిన రోజని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. "దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృఢమైన నాయకత్వం, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మార్గనిర్దేశంలో, అలాగే దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి, దాడులను ఎదుర్కొని నిలబడిన జనసైనికులు, వీరమహిళల స్ఫూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్న జనసేన పార్టీ సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రక విజయాన్ని అందించారు" అని తెలిపారు. ఎన్డీయే కూటమి చారిత్రక విజయానికి, జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో సాధించిన విజయానికి ఏడాది పూర్తయిందని సంతోషం వెలిబుచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా స్వీకరించామని, గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుకుంటూ, భావి తరాలకు బంగారు భవిష్యత్తును అందించేలా కృషి చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. "రాష్ట్రాన్ని 'స్వర్ణాంధ్ర 2047' దిశగా నడిపించేందుకు, 'వికసిత్ భారత్ 2047' లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్‌ను కీలక భాగస్వామిగా నిలిపేందుకు ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళుతున్నాం. రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుంది" అని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా మరింత బాధ్యతతో పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన జనసైనికులకు, వీరమహిళలకు, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకు, మూడు పార్టీల నాయకులకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని ఆయన కొనియాడారు. Quote
psycopk Posted June 4 Author Report Posted June 4 Yuva Galam: జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా 'యువగళం'.. డిప్యూటీ సీఎం పవన్ ప్రశంస 04-06-2025 Wed 12:43 | Andhra రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన 'యువగళం' పాదయాత్ర ఈ పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని పవన్, ఇతర మంత్రులకు అందజేసిన లోకేశ్ యువగళం పుస్తకంపై డిప్యూటీ సీఎం ప్రశంసల జల్లు రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేశ్... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందజేశారు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్ తో పాటు, ఇతర మంత్రులకు లోకేశ్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృత మైందన్నారు. ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేశ్‌ను ప్రశంసించారు. ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికీ జనం మర్చిపోలేదని తెలిపారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా యువనేత లోకేశ్... పవన్ కల్యాణ్‌తో పంచుకున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.