Jump to content

Recommended Posts

Posted

Chandrababu Naidu- గత సీఎం హెలికాప్టర్ లో వెళుతుంటే కింద ఉన్న చెట్లు ఎగిరిపోయేవి: చంద్రబాబు సెటైర్ 

05-06-2025 Thu 15:50 | Andhra
Chandrababu Naidu Criticizes YCP Government on Tree Felling
 
  • నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
  • అనంతవరంలో మొక్కలు నాటిన సీఎం చంద్రబాబు
  • గత ప్రభుత్వంలో పర్యావరణ పరిరక్షణ నిర్లక్ష్యానికి గురైందని ఆరోపణ
గత వైసీపీ ప్రభుత్వం చెట్లను నరికివేయడమే పనిగా పెట్టుకుందని, వారికి చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై కనీస అవగాహన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాటిని నరికివేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇవాళ రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ పరిరక్షణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గత ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుంటే కింద ఉన్న చెట్లు ఎగిరిపోయేవని సెటైర్ వేశారు. కానీ ఇప్పుడు తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నప్పుడు ఒక్క చెట్టు కూడా నరకడం లేదని ప్రజలు గమనించాలని కోరారు.

కొన్ని దేశాల్లో చెట్లను నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారని, చెట్టు నరకాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని చంద్రబాబు గుర్తుచేశారు. చెట్టు నరికితే మనిషిని చంపినంత నేరంగా పరిగణించి చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. "చెట్లు పెంచడం మనందరి బాధ్యత. చెట్లు నరకడం అత్యంత దుర్మార్గమైన చర్య" అని ఆయన పేర్కొన్నారు.

అందరం ఆక్సిజన్ తీసుకుంటున్నాం కదా... మరి మొక్కలు నాటే బాధ్యత లేదా?

రానున్న నాలుగైదు సంవత్సరాల్లో రాష్ట్రంలో కనీసం 37 శాతం పచ్చదనం ఉండేలా చూడాలన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకోసం ఉద్యానవన పంటల (హార్టికల్చర్) అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయంలో పవన్ కల్యాణ్ కూడా స్పష్టమైన సూచనలు చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం పది మొక్కలు నాటి పెంచాలని పిలుపునిచ్చారు. "అందరం ఆక్సిజన్ తీసుకుంటున్నాం కదా? మరి మొక్కలు నాటే బాధ్యత మనపై లేదా?" అని ప్రజలను ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన రావాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్లలో గ్లోబల్ వార్మింగ్ ఒకటని, దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాలు తగ్గిపోతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో సాగు ప్రమాదంలో పడుతోందని, తాగునీటికి ఇబ్బందులు తలెత్తి ఫ్లోరైడ్ సమస్యలు పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన చెందారు. చిన్నప్పుడు చదువుకున్న కథను గుర్తుచేస్తూ, "ఒక వృద్ధుడు తన తర్వాతి తరాల కోసం చెట్టు నాటినట్లు, మనం కూడా భవిష్యత్ తరాల కోసం చెట్లు నాటాలి. స్వార్థంతో బతకడం కాదు, విజ్ఞతతో ప్రవర్తించాలి," అని హితవు పలికారు. పద్మశ్రీ వనజీవి రామయ్య వంటి వ్యక్తులు మనకు ఆదర్శమని, వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.
Posted

Chandrababu Naidu: అనంతవరంలో మొక్కలు నాటిన చంద్రబాబు... కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ 

05-06-2025 Thu 14:41 | Andhra
Chandrababu Naidu plants trees in Anantavaram Pawan Kalyan attends
 
  • నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం 
  • అమరావతిలో వెయ్యి మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం
  • ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు, ఈ ఏడాది ఐదు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం
  • రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించడమే ప్రభుత్వ ధ్యేయమన్న సీఎం
  • ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ నిర్మూలనపై దృష్టి
  • గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పచ్చదనం తగ్గిందంటూ చంద్రబాబు విమర్శ
రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే ఆదర్శంగా నిలపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేడు (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని అనంతవరం ఏడీసీఎల్ పార్క్‌లో  జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వెయ్యి మంది విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిలో నేడు చేపట్టిన ఈ కార్యక్రమం ఒక చరిత్ర సృష్టించబోతోందని అన్నారు.

ఒకే రోజు కోటి మొక్కలు, ఏడాదికి ఐదు కోట్లు లక్ష్యం

ఈరోజు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతున్నామని, ఈ సంవత్సరం మొత్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటాలనేది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. "ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. మన మిత్రులు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు చెప్పినట్టు ఒక కోటి చెట్లను నేడు నాడుతున్నాం. ఈ సంవత్సరం ఐదు కోట్ల మొక్కలు నాటబోతున్నాం" అని వివరించారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం (గ్రీన్ కవర్) సాధించడమే అంతిమ లక్ష్యమని, ఇది సాకారమైతే దాని ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుందని, ఈ విషయంలో దేశానికే కాకుండా ప్రపంచానికే మనం ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.

పర్యావరణ దినోత్సవం – ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలన

1972 నుంచి జూన్ 5వ తేదీన ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేస్తూ, ఈ ఏడాది 'ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయండి' (End Plastic Pollution) అనే థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించి, రీసైకిల్ వంటి పద్ధతుల ద్వారా దానిని ఎలా ఉపయోగించాలనే విషయంపై ప్రజల్లో అవగాహన పెంచడమే దీని ఉద్దేశమని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో పచ్చదనం – ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ ప్రణాళిక

ప్రస్తుతం రాష్ట్రంలో 36,742 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉందని, ఇది రాష్ట్ర మొత్తం విస్తీర్ణంలో 22.96 శాతం అని చంద్రబాబు తెలిపారు. "మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, రాయలసీమలో నల్లమల అడవులు ఉన్నాయి. రాయలసీమలో హార్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతోంది. దీనివల్ల మైదాన ప్రాంతాల్లో కూడా చెట్లు పెరుగుతున్నాయి, పచ్చదనం వృద్ధి చెందింది" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం గ్రీన్ కవర్ 30.05 శాతంగా ఉందని, దీనిని 50 శాతానికి తీసుకెళ్లడమే అందరి లక్ష్యమని పునరుద్ఘాటించారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెట్లు నాటడంపై అవగాహన లేకుండా వ్యవహరించిందని, కేవలం ఫోటోల కోసమే మొక్కలు నాటి వదిలేసేవారని విమర్శించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా చెట్ల పెంపకంపై శ్రద్ధ చూపలేదని, చెట్ల వల్ల ఉపయోగం తెలియక నరకడానికే ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
20250605fr68415e99bef77.jpg20250605fr68415ea48c633.jpg20250605fr68415eae44f27.jpg20250605fr68415ec4e57c9.jpg20250605fr68415eb8b0148.jpg20250605fr68415ed2bfd26.jpg20250605fr68415f12c546c.jpg

Posted

Pawan Kalyan: బహుశా ఆయనకు ఉన్నంత అర్హత నాకు లేదేమో!: పవన్ కల్యాణ్

05-06-2025 Thu 15:11 | Andhra
Pawan Kalyan Speech on World Environment Day in Amaravati

  • నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
  • అమరావతిలోని అనంతవరంలో కార్యక్రమం
  • సీఎం చంద్రబాబుతో పాటు హాజరైన పవన్ కల్యాణ్
  • పర్యావరణ పరిరక్షణే ధ్యేయమని ఉద్ఘాటన
  • వచ్చే ఏడాదిలోగా కోటి మొక్కలు నాటుతానని ప్రతిజ్ఞ

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు అమరావతి ప్రాంతంలోని అనంతవరంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషిగా వచ్చే ఏడాది ఇదే రోజు నాటికి రాష్ట్రంలో కనీసం కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ఆయన ప్రకటించారు. అడవుల్లో కార్చిచ్చులను నివారించడం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం వంటి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.

ఈ సందర్భంగా పర్యావరణవేత్త కుమెర అంకారావు సేవలను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "14 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ వ్యర్థాలు తిని ఒక పక్షి చనిపోవడం చూసి చలించిపోయి, మూడు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు అంకితమైన కుమెర అంకారావు గారి నిబద్ధత ప్రశంసనీయం. ఆయనకున్నంత అర్హత బహుశా నాకు లేదేమో అనిపిస్తుంది" అంటూ పవన్ వినమ్రంగా వ్యాఖ్యానించారు. నల్లమల అడవుల పరిరక్షణ కోసం అంకారావు చేస్తున్న కృషి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. అటువంటి వ్యక్తిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, అధికారులకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు.

పర్యావరణ పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు స్ఫూర్తి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. "చెట్టు-నీరు" వంటి కార్యక్రమాల ద్వారా చంద్రబాబు పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేశారని, ఆయన మార్గదర్శకత్వంలో పర్యావరణ మంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. "ప్రస్తుతం అటవీ, పర్యావరణ శాఖల బాధ్యతలు నా వద్ద ఉన్నాయి. వచ్చే ఏడాది ఇదే సమయానికి కోటి మొక్కలు నాటడమే కాకుండా, అడవుల్లో కార్చిచ్చులను అరికట్టి, గొర్రెలు, మేకల కాపరులకు అవగాహన కల్పించి, అడవుల నరికివేతను తగ్గించి, అప్పుడు మరింత అనుభవంతో మీ ముందుకొచ్చి మాట్లాడతాను" అని పవన్ కల్యాణ్ అన్నారు.

చెట్లు మన జీవితంలో ఎంత కీలకమో వివరిస్తూ, "ఒకప్పుడు ఇళ్లకు దారి చెప్పాలంటే మర్రిచెట్టునో, గోరింటాకు చెట్టునో ఆనవాలుగా చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చెట్లు లేని జీవితాన్ని ఊహించుకోలేం. అవి కేవలం పక్షులకే కాదు, ప్రతి ఒక్కరికీ ఆధారం" అని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం పచ్చదనం సాధించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యాన్ని చేరుకోవడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. "ముఖ్యమంత్రి గారు మా అందరికీ రాష్ట్రంలో 33 శాతం కాకుండా, 50 శాతం అటవీ విస్తీర్ణం ఉండాలని లక్ష్యం నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్‌ను పర్యావరణ పరిరక్షణలో, అటవీ సంరక్షణలో, నగర వనాల్లో తలమానికంగా నిలపడానికి మనమందరం కృషి చేద్దాం" అని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చే సూచనలు, సలహాలు స్వీకరించి, వచ్చే ఏడాదికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుని ఆయన మెప్పు పొందేలా పనిచేస్తామని పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు. 
Posted
1 hour ago, psycopk said:

Chandrababu Naidu- గత సీఎం హెలికాప్టర్ లో వెళుతుంటే కింద ఉన్న చెట్లు ఎగిరిపోయేవి: చంద్రబాబు సెటైర్ 

05-06-2025 Thu 15:50 | Andhra
Chandrababu Naidu Criticizes YCP Government on Tree Felling
 
  • నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
  • అనంతవరంలో మొక్కలు నాటిన సీఎం చంద్రబాబు
  • గత ప్రభుత్వంలో పర్యావరణ పరిరక్షణ నిర్లక్ష్యానికి గురైందని ఆరోపణ
గత వైసీపీ ప్రభుత్వం చెట్లను నరికివేయడమే పనిగా పెట్టుకుందని, వారికి చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై కనీస అవగాహన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాటిని నరికివేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇవాళ రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ పరిరక్షణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గత ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుంటే కింద ఉన్న చెట్లు ఎగిరిపోయేవని సెటైర్ వేశారు. కానీ ఇప్పుడు తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నప్పుడు ఒక్క చెట్టు కూడా నరకడం లేదని ప్రజలు గమనించాలని కోరారు.

కొన్ని దేశాల్లో చెట్లను నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారని, చెట్టు నరకాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని చంద్రబాబు గుర్తుచేశారు. చెట్టు నరికితే మనిషిని చంపినంత నేరంగా పరిగణించి చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. "చెట్లు పెంచడం మనందరి బాధ్యత. చెట్లు నరకడం అత్యంత దుర్మార్గమైన చర్య" అని ఆయన పేర్కొన్నారు.

అందరం ఆక్సిజన్ తీసుకుంటున్నాం కదా... మరి మొక్కలు నాటే బాధ్యత లేదా?

రానున్న నాలుగైదు సంవత్సరాల్లో రాష్ట్రంలో కనీసం 37 శాతం పచ్చదనం ఉండేలా చూడాలన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకోసం ఉద్యానవన పంటల (హార్టికల్చర్) అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయంలో పవన్ కల్యాణ్ కూడా స్పష్టమైన సూచనలు చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం పది మొక్కలు నాటి పెంచాలని పిలుపునిచ్చారు. "అందరం ఆక్సిజన్ తీసుకుంటున్నాం కదా? మరి మొక్కలు నాటే బాధ్యత మనపై లేదా?" అని ప్రజలను ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన రావాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్లలో గ్లోబల్ వార్మింగ్ ఒకటని, దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాలు తగ్గిపోతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో సాగు ప్రమాదంలో పడుతోందని, తాగునీటికి ఇబ్బందులు తలెత్తి ఫ్లోరైడ్ సమస్యలు పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన చెందారు. చిన్నప్పుడు చదువుకున్న కథను గుర్తుచేస్తూ, "ఒక వృద్ధుడు తన తర్వాతి తరాల కోసం చెట్టు నాటినట్లు, మనం కూడా భవిష్యత్ తరాల కోసం చెట్లు నాటాలి. స్వార్థంతో బతకడం కాదు, విజ్ఞతతో ప్రవర్తించాలి," అని హితవు పలికారు. పద్మశ్రీ వనజీవి రామయ్య వంటి వ్యక్తులు మనకు ఆదర్శమని, వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.

Eee randa opposition lo vundi em peekadu antav? Eppadanna question chesaada?

Posted
9 minutes ago, Chatgpt2 said:

Eee randa opposition lo vundi em peekadu antav? Eppadanna question chesaada?

oh .. pichi battai eppudu aaina adigina questions ki answer ichada?? kanesam media ki pressmeet ke tikana ledu.. 6months ki ravatam.. paper chadavatam palace loki dengeyatam...

Posted
14 minutes ago, Chatgpt2 said:

Eee randa opposition lo vundi em peekadu antav? Eppadanna question chesaada?

pakka state nundi chinchukuntunav ga.... ee 2 questions ki answers chepinchu anna cheta..

1) babai case emaindi?

2) kodi katti case sangati enti?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...