Jump to content

Talliki vandanam beneficieries 67.27lk


Recommended Posts

Posted

Nara Lokesh: చదువుకునే పిల్లలందరికీ 'తల్లికి వందనం': నారా లోకేష్

11-06-2025 Wed 17:02 | Andhra
Thalliki Vandanam Scheme Approved by AP Government Says Nara Lokesh

 

  • కొత్త విద్యా సంవత్సరం వేళ 'తల్లికి వందనం' పథకానికి సీఎం ఆమోదం
  • కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తి సందర్భంగా ఈ పథకం అమలు
  • చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా ప్రతి తల్లికీ లబ్ధి
  • 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.8745 కోట్లు జమ
  • సూపర్ సిక్స్ హామీల్లో మరొకటి నెరవేరిందని మంత్రి లోకేష్ వెల్లడి
  • ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, దీపం-2 అమలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం  ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ విద్యార్థుల తల్లులకు శుభవార్త అందించింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా 'తల్లికి వందనం' పథకం అమలుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఆర్థిక సహాయం జమ చేయనున్నట్లు ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల 27 వేల 164 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. వీరి తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం మొత్తం రూ. 8745 కోట్లు జమ చేయనుంది. ఒకటో తరగతిలో కొత్తగా అడ్మిషన్ పొందే చిన్నారులతో పాటు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు.

విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు, వారి తల్లులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని గుర్తు చేశారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మెగా డీఎస్సీ ప్రకటన, దీపం-2 పథకాల అమలు దిశగా చర్యలు తీసుకున్నామని, తాజాగా 'తల్లికి వందనం' పథకం అమలుతో మరో ముఖ్యమైన హామీని నిలబెట్టుకున్నామని లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ పథకానికి పచ్చజెండా ఊపడం సంతోషకరమని ఆయన అన్నారు.
Posted

Thalliki Vandanam Scheme: సూపర్ సిక్స్‌లో మరో ముఖ్యమైన హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

11-06-2025 Wed 16:23 | Andhra
AP Government to Launch Thalliki Vandanam Scheme Scheme Tomorrow

 

  • కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది 
  • ఈ సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం ప‌థ‌కం ప్రారంభం
  • రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం
  • 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింపు
  • ఈ పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ. 8,745 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం ప‌థ‌కం అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం తెలిపింది. 

కాగా, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది. దీంతో 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింపజేయ‌నుంది. ఇందులో భాగంగా తల్లుల ఖాతాల్లో రేపు ప్రభుత్వం రూ. 8,745 కోట్లు జమ చేయనుంది. 

1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు కానుంది. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. ప‌థ‌కం విధి విధానాలను ఖరారు చేస్తూ అధికారులు ఇవాళ జీఓ విడుదల చేయ‌నున్నారు. 

ఇక‌, సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కూట‌మి ప్ర‌భుత్వం ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన విష‌యం తెలిసిందే. 

20250611fr684960eb6b566.jpg20250611fr684960f715bd7.jpg 
Posted

Aipayi…Andhra ki appuku…20 lakh crore datesinayi…sei lanka aipoindi..nashanam ayipoindi

Posted
2 hours ago, psycopk said:

 

First time maata meedha nilabaduthunnattu unnaru mana Babu Garu.. Ala ani అనుకున్నా  తీరా చూస్తే అంతా అస్సామే....
******************************************
రేపు ప్రారంభిస్తారు విధి విధానాలు ఖరారయ్యాక అకౌంట్ లో వేస్తారట మూడు నెలల పడుతుందో వచ్చే జూన్ పడతదో పక్కన పెట్టండి 

67 లక్షల మందికి 15000 చొప్పునైతే సుమారు 10,500 కోట్లు  అటు ఇటు   అవుతుంది ...

But veellu  8745 కోట్లు antunnaru...

Ala ithey 13000 చొప్పున వేస్తారా ?? Ante Assamenaaaa??? 
 

Posted
3 minutes ago, Android_Halwa said:

Aipayi…Andhra ki appuku…20 lakh crore datesinayi…sei lanka aipoindi..nashanam ayipoindi

Ekkadiki pothayanna anni manolla pocket loke gaa?

antha manolla manchike

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...