Jump to content

Recommended Posts

Posted

KTR: ఇప్పటికి 3 సార్లు పిలిచారు.. ఇంకో 30 సార్లైనా వస్తా: కేటీఆర్

16-06-2025 Mon 10:56 | Telangana
KTR Says Will Appear for Investigation Even 30 Times

 

  • ఏసీబీ విచారణపై బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు
  • ఫార్ములా వన్ రేసింగ్ లో అవినీతి కేసు
  • ఏసీబీ ఆఫీసులో విచారణకు మాజీ మంత్రి కేటీఆర్

‘‘విచారణకు రమ్మని ఇప్పటికే మూడుసార్లు పిలిచారు.. ఇంకో 30 సార్లు పిలిచానా వస్తా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్లా.. ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను’’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫార్ములా వన్ రేసింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఏసీబీ దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ను అధికారులు విచారణకు పిలిచారు. ఈ రోజు ఉదయం పది గంటలకు కేటీఆర్ ఏసీబీ ఆఫీసుకు బయలుదేరారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకుంటామని అనుకోవద్దని కేటీఆర్ అన్నారు. చట్టం, న్యాయస్థానాలపై తమకు గౌరవముందని, నిజం నిలకడ మీద తెలుస్తుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్‌ ఎదుట కేసీఆర్‌, హరీశ్‌రావును కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారని ఆరోపించారు. ఈ రోజు తనను విచారణకు పిలిచి మానసిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదని అన్నారు. అయితే, తాము కేసులకు అరెస్టులకు భయపడే వాళ్లం కాదని కేటీఆర్ తేల్చిచెప్పారు. 
Posted

K Kavitha: కేటీఆర్ కు మద్దతుగా నిలిచిన కవిత

16-06-2025 Mon 16:49 | Telangana
Kavitha on KTR ACB questioning

 

  • కేటీఆర్‌ పై ఏసీబీ విచారణ నేపథ్యంలో కవిత మద్దతు
  • ప్రధాన సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే విచారణలంటూ ఆరోపణ
  • తమ పార్టీ నేతలు, కార్యకర్తలను అడ్డుకుంటున్నారని మండిపాటు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆయన సోదరి, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతుగా నిలిచారు. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ చేపట్టిన విచారణ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ విచారణ జరుగుతోందని, ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.

"ఏ పార్టీలోనైనా లోపాలుంటే అధినేత దృష్టికి తీసుకెళ్లడం సహజం. అంతమాత్రానికే దాన్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. మా పార్టీలోని లోపాలను మేం సరిదిద్దుకుంటాం. మాపై ఎవరైనా దాడి చేస్తే ఊరుకోబోం" అని స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను, నేతలను బయటకు రాకుండా అడ్డుకోవడం దారుణమని ఆమె మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాను కేవలం ఒకసారే, అదీ 60 శాతం మంది రైతులకే అందించిందని కవిత విమర్శించారు. "మిగిలిన 40 శాతం మంది రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. గత యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల లోపు భూమి ఉన్నవారికే ఇస్తారా, లేక రైతులందరికీ వర్తింపజేస్తారా అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడింది" అని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.  
Posted

Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

16-06-2025 Mon 14:22 | Telangana
Padi Kaushik Reddy Petition Dismissed by High Court

 

  • బెదిరింపుల కేసుకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
  • గ్రానైట్ వ్యాపారి నుంచి రూ.50 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణ
  • వ్యాపారి భార్య ఫిర్యాదుతో సుబేదారి పోలీసుల కేసు నమోదు
  • కేసును కొట్టివేయాలన్న కౌశిక్‌రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన బెదిరింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

కమలాపురం మండలం వంగపల్లి గ్రామంలో గ్రానైట్ వ్యాపారి మనోజ్ ఒక క్వారీని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తమను రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారని మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హన్మకొండ జిల్లా సుబేదారి పోలీసులు పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ కౌశిక్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో బెదిరింపుల కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగనుంది.
Posted

Seethakka: రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క

16-06-2025 Mon 16:25 | Telangana
Seethakka fires on KTR

 

  • కవిత జైలుకెళ్లి బీసీ ఎజెండా ఎత్తుకున్నారన్న సీతక్క
  • కేటీఆర్ కూడా జైలుకి వెళ్లాలనుకుంటున్నారని ఎద్దేవా
  • తోడేళ్లలా దోచుకుని వినయం నటిస్తున్నారని మండిపాటు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు.

వీలైనంత త్వరగా జైలుకు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారని సీతక్క అన్నారు. "కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లివచ్చి బీసీ ఎజెండాను అందుకున్నారు. తాను వెనుకబడ్డాననే భావనతో కేటీఆర్ కూడా జైలుకు వెళ్లి ఏదైనా పథకం రచించాలని అనుకుంటున్నారేమో" అంటూ వ్యంగ్యంగా అన్నారు. కేటీఆర్ మాటల్లో పొగరు కనిపిస్తోందని ఆమె మండిపడ్డారు. ఏదో ఆశించే కేటీఆర్ జైలుకు వెళ్లాలని అనుకుంటున్నారని, తోడేళ్లలా దోచుకుని ఇప్పుడు వినయం నటిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. "కేటీఆర్ పొగరుతో మాట్లాడుతుంటే, మా ముఖ్యమంత్రి పౌరుషంతో మాట్లాడుతున్నారు" అని సీతక్క వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయని ఆమె స్పష్టం చేశారు.

మరోవైపు, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భాగంగా కేటీఆర్ ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు వెళ్లేముందు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే మూడుసార్లు విచారణకు పిలిచారని, ముప్పైసార్లు పిలిచినా తాను హాజరవుతానని అందులో పేర్కొన్నారు. తనను ఏసీబీ విచారణకు పిలిచి కొందరు రాక్షసానందం పొందుతున్నారని, అవసరమైతే తనను అరెస్టు కూడా చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను జైలుకు వెళ్లి వచ్చానని, తనకు జైళ్లు, కేసులు కొత్తేమీ కాదని ఆయన తన ట్వీట్‌లో తెలిపారు. కేటీఆర్ జైలు గురించి చేసిన ఈ వ్యాఖ్యలపైనే మంత్రి సీతక్క పైవిధంగా స్పందించారు.
Posted

nakoti ardam kaadu ee family politics enti asalu? ila family lo kottku sasthe janalu oostaru ani telvada? kanesam ingitam lekunda etla asalu?

Jagan anthe, now kcr family? 

look at PK, he never criticized chiru openly, together in family creates strong emotion in public

Kcr kante gnani em kaadu kada pk? 

Posted

KTR: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌

16-06-2025 Mon 11:20 | Telangana
KTR Attends ACB Inquiry in Formula E Case

 

  • ఫార్ములా వన్ రేసింగ్ లో కేటీఆర్‌పై అవినీతి కేసు
  • ఏసీబీ ఆఫీసులో విచారణకు మాజీ మంత్రి 
  • అంతకుముందు నందీనగర్‌లో కేసీఆర్‌తో భేటీ

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌.. ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌ రావు కూడా విచారణకు హాజరయ్యారు. అంతకుముందు నందీనగర్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ అయిన విష‌యం తెలిసిందే. 

ఈ స‌మావేశంలో ఫార్ములా వన్‌ విచారణకు సంబంధించి పలు అంశాలపై వారు చర్చించినట్లు స‌మాచారం. ఈ భేటీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు కూడా పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనాయకులతో స‌మావేశ‌మ‌య్యారు. అనంతరం తెలంగాణ భవన్‌ నుంచి నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలనికి చేరుకున్నారు.

అంత‌కుముందు కేటీఆర్ మాట్లాడుతూ... ‘‘విచారణకు రమ్మని ఇప్పటికే మూడుసార్లు పిలిచారు.. ఇంకో 30 సార్లు పిలిచానా వస్తా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్లా.. ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను’’ అంటూ వ్యాఖ్యానించారు. 
Posted

KTR: ఫార్ములా-ఈ కేసు: కేటీఆర్‌కు 7 గంటల పాటు 60 ప్రశ్నలు సంధించిన ఏసీబీ అధికారులు!

16-06-2025 Mon 18:26 | Telangana
KTR Questioned for 7 Hours in Formula E Case by ACB

 

  • ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ పై ఆరోపణలు
  • నేడు ఏసీబీ సుదీర్ఘ విచారణ
  • హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపైనే ప్రధానంగా ప్రశ్నలు
  • ఎఫ్ఈవోకు నిధులు బదిలీ చేశా, లబ్ధి పొందలేదన్న కేటీఆర్

ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ సోమవారం ముగిసింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయనను దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఉదయం ప్రారంభమైన విచారణలో సుమారు 60 ప్రశ్నలను కేటీఆర్‌పై సంధించినట్లు సమాచారం. ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించడం ఇది రెండోసారి.

ఎఫ్ఈవో (ఫార్ములా ఈ ఆపరేషన్స్) కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించారని సమాచారం. ప్రధానంగా హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధులను ఎలా మళ్లించారన్న అంశాలపై ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించారు.

ఏసీబీ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు చెప్పారు. హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఈవో సంస్థకు నిబంధనల ప్రకారమే పంపామని, ఈ వ్యవహారంలో తాను వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధి పొందలేదని ఆయన అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ల వ్యవహారమంతా అధికారులే చూసుకున్నారని, స్పాన్సర్లు చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంతో హెచ్ఎండీఏ నిధులతో ఫీజులు చెల్లించాల్సి వచ్చిందని కేటీఆర్ వివరించినట్లుగా తెలుస్తోంది. 
Posted
25 minutes ago, psycopk said:

 

 

yesheyyandi tillu gadni.. phul support to pacha party on this. 6 months pulka laga tiruguta DB lo veseste.. 

 

Ismailbhai Telugu GIF - Ismailbhai Telugu Sorry - Discover & Share GIFs

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...