paaparao Posted September 4 Author Report Posted September 4 చెవిరెడ్డి ఇంట్లో సోదాలు – ఎమేమి బయటపడతాయో? సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు చిత్తూరు వైసీపీ ఇంచార్జ్, పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్ గా పేరు తెచ్చుకున్న విజయానందరెడ్డి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. లిక్కర్ స్కాంలో చాలా లెక్కల వ్యవహారాలకు సంబంధించిన వివరాల కోసం ఈ సోదాలు నిర్వహించారు.ఇరవై మందితో కూడిన సిట్ టెక్నికల్ సిబ్బంది కూడా మొత్తం పరిశీలించారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో విచారణకు వెళ్లి సోదాలు చేస్తే ఇతర వ్యవహారాలు ఎన్ని బయటపడతాయో అన్నది ఇప్పుడు చెవిరెడ్డి అనుచరుల్లో ఆందోళనగా ఉంది. చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విజయానందరెడ్డిపై పదుల సంఖ్యలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. ఆయన ఒత్తిడి కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మరీ విజయానందరెడ్డికి టిక్కెట్ ఇచ్చారని భావిస్తున్నారు. వీరిద్దరూ పార్టనర్స్ అని చంద్రగిరిలో చెప్పుకుంటారు. అది ఎందులో అన్నది తాజా సోదాల్లో బయటపడి ఉంటే మాత్రం మరిన్ని ఇబ్బందుల్లో చెవిరెడ్డి పడటం ఖాయంగా కనిపిస్తోంది. చెవిరెడ్డి ఆర్థిక వ్యవహారాలు ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంటాయి. ఆయన అసువుగా కోట్లకు కోట్లు నగదు ఖర్చు పెడతారు. అది ఎలా వస్తుందన్న లింకులు బయటకు లాగనున్నారు. విజయానందరెడ్డి వ్యవహారాలూ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చెవిరెడ్డి ఏదో విధంగా తిరుపతికి రావాలని ప్రయత్నిస్తున్నారు. నడుంనొప్పికి ప్రకృతి చికిత్స స్విమ్స్ లో తీసుకుంటానని కోర్టును అడిగారు. కానీ ఈ లోపు ఆయనపై మొత్తం వివరాలు బయటకు లాగుతున్నారు. తదుపరి సిట్ అధికారులు దాఖలు చేయబోయే చార్జిషీట్‌లో చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు వ్యవహారాలన్నీ బయట పెట్టే అవకాశం ఉంది. Quote
paaparao Posted September 4 Author Report Posted September 4 హమ్మ సజ్జల భార్గవ – దాక్కుంటే పట్టుకోలేరా? సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడు.. వైసీపీ బూతు సైన్యానికి నాయకుడిగా పని చేసిన సజ్జల భార్గవరెడ్డి ప్రభుత్వం మారిన తర్వాత ఒక్క సారి అంటే ఒక్క సారి కూడా బయట కనిపించ లేదు. అధికారంలో ఉన్నప్పుడు తనకు ఎలివేషన్ వీడియోలను వైసీపీ సోషల్ మీడియా టీమ్‌తోనే వేయించుకునేవారు. కానీ ఇప్పుడు తన ఫోటోలు కూడా బయటకు రానివ్వడం లేదు.కలుగులో ఎలుకలా బతికేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అరెస్టు కాకుండా తప్పించుకున్నారు కానీ.. ఇప్పుడు ఏకంగా లిక్కర్ కేసులోనే దొరికిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్‌లో సజ్జల వాటాల తీగ దొరికింది ! లిక్కర్ స్కామ్ సొమ్మును రూటింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన ఓ కంపెనీలో సజ్జల భార్గవ కూడా డైరక్టర్ గా ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. చెవిరెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, వారి బినామీ కంపెనీల ఆఫీసుల్లో నిర్వహించిన సోదాల్లో చాలా డాక్యుమెంట్లు పట్టుబడ్డాయి. అందులో ఓ కంపెనీలో.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ, ప్రద్యుమ్న అనే వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నారు. ఈ ప్రద్యుమ్న ..ఎన్నికల సమయంలో దొరికిన డబ్బు తనదేనని క్లెయిమ్ చేసుకున్నారు. ఎక్కడిదని విచారణ ప్రారంభించడంతో దుబాయ్ పరారయ్యారు. జగన్ దొరికినా తాము దొరకకుండా ప్లాన్ చేసుకునే సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత తెలివిగలవాడు. ఆయన పార్టీ నేతలందర్నీ వాడుకుంటారు కానీ.. తాను కానీ.. కుమారుడికి కానీ చిన్న లింకులు బయపడేలా ఎప్పుడూ వ్యవహారాలు నడపరు. కానీ ఆయన వాటా ఆయనకు చేరాల్సిందే. అయితే ఎవరూ కనిపెట్టలేరని అనుకున్నారేమో కానీ ఓ కంపెనీలో డైరక్టర్ గా కొడుకుల్ని చేర్పించేశాడు. ఇప్పుడు దొరికిపోయాడు. తిరుపతిలో ఓ కంపెనీ పేరుతో ఉన్న చిరునామాలో సోదాలు మరో పది సూట్ కేసు కంపెనీలు అక్కడి నుంచి నడుస్తున్నాయని క్లారిటీ వచ్చింది. అదే పెద్ద తీగ కావడంతో మొత్తం బయటకు లాగుతున్నారు. ఇప్పుడు కుమారుడు దొరికిపోవడంతో హాహాకారాలు ఖాయం లిక్కర్ స్కాంలో డబ్బులన్నీ ఇష్టం వచ్చినట్లుగా పంచుకున్నారు. వాటిని వైట్ చేసేందుకు చేయని నేరం లేదు. ఎర్రచందనం స్మగ్లర్ అయిన విజయానందరెడ్డిని ఫేక్ కంపెనీలకు కేరాఫ్ గా వాడుకున్నారు. విజయానందరెడ్డితోనే చెవిరెడ్డి ఎక్కువగా వ్యవహారాలు నడిపారు. ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి అంశం కూడా బయటకు వస్తోంది. పోలీసులు ఆయనకు రేపోమాపో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. దీనిపై సజ్జల హాహాకారాలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.