psycopk Posted June 18 Author Report Posted June 18 https://x.com/Trends4TDP/status/1935285979344228783 Quote
psycopk Posted June 18 Author Report Posted June 18 Gottipati Ravikumar: కాన్వాయ్ ఢీ కొట్టి ఆగకుండా వెళ్లడం దుర్మార్గం, జగన్ స్వార్థ రాజకీయానికి నిండు ప్రాణం బలి: గొట్టిపాటి రవికుమార్ 18-06-2025 Wed 17:30 | Andhra జగన్ కాన్వాయ్ వాహనం ఢీకొని వృద్ధుడి మృతిపై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వైసీపీ నేతల నిర్లక్ష్యం వల్లే సింగయ్య మరణించారని ఆరోపణ "వై నాట్ 175" వ్యాఖ్యలతోనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శ జగన్ పరామర్శలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని గొట్టిపాటి వ్యాఖ్య జగన్ మోసపు మాటలను ప్రజలు నమ్మరని మంత్రి స్పష్టీకరణ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ స్వార్థ రాజకీయాల కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మరణించడం, గతంలో ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనలను ప్రస్తావిస్తూ బుధవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. లాల్‌పురం ఘటనపై ఆగ్రహం పల్నాడు పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని లాల్‌పురం వద్ద జాతీయ రహదారిపై జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొనడంతో సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందడం పట్ల మంత్రి గొట్టిపాటి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, వైసీపీ నేతల నిర్లక్ష్యం, అహంకారమే సింగయ్య మరణానికి కారణమని ఆరోపించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింగయ్యను ఆసుపత్రికి తరలించకుండా రోడ్డు పక్కనే వదిలేశారని, కనీస మానవత్వం కూడా చూపలేదని మండిపడ్డారు. స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని, వైసీపీ నేతలు సకాలంలో స్పందించి ఉంటే సింగయ్య ప్రాణాలతో ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతికి జగన్మోహన్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలపై విమర్శ సత్తెనపల్లికి చెందిన నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు, ఆయన కుటుంబం అనాథలుగా మారడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలే కారణమని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. "ఎన్నికల ఫలితాలకు ముందు తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని 'వై నాట్ 175' అంటూ జగన్ నమ్మబలకడం వల్లే వేలాది మంది అమాయక కార్యకర్తలు బెట్టింగ్‌లు కాసి ఆర్థికంగా చితికిపోయారు. అప్పుల బాధ, ఒత్తిడి తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు లాంటి ఎందరో ఆత్మహత్యలకు పాల్పడ్డారు" అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన ఏడాది తర్వాత ఇప్పుడు పరామర్శల పేరుతో జగన్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని గొట్టిపాటి దుయ్యబట్టారు. ఇవి కేవలం సానుభూతి కోసం చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలని ఆయన స్పష్టం చేశారు. "అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ దాటని జగన్‌కు ఇప్పుడు ప్రజలు, కార్యకర్తలు, పరామర్శలు గుర్తొచ్చాయా?" అని ఎద్దేవా చేశారు. కార్యకర్తలకు ఏనాడూ కనీస సాయం చేయని జగన్, కేవలం రాజకీయ అవసరాల కోసం వారిని పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. గతంలోనూ ఇదే విధంగా పరామర్శలు, "ఒక్క ఛాన్స్ ఇవ్వండి" అంటూ ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని, ప్రజల్ని నిండా ముంచేశారని మంత్రి గుర్తు చేశారు. జగన్ మోసపు మాటలను మరోసారి నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరని గొట్టిపాటి తేల్చిచెప్పారు. ఖాళీ అవుతున్న వైసీపీని కాపాడుకోవడానికే జగన్ ఇలాంటి డ్రామాలాడుతున్నారని, ఆయన చేస్తున్నవన్నీ మోసపూరిత పరామర్శలు, వాగ్దానాలేనని, జగన్ పార్టీనే ఒక మోసపూరిత పార్టీ అని మంత్రి తీవ్రంగా విమర్శించారు. Quote
psycopk Posted June 18 Author Report Posted June 18 Jagan: జగన్ పర్యటన... మరో వ్యక్తి మృతి 18-06-2025 Wed 17:27 | Andhra పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనలో ఇద్దరి మృతి ఏటుకూరు వద్ద కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు సింగయ్య మరణం సత్తెనపల్లిలో తోపులాటలో ఊపిరాడక జయవర్ధన్ రెడ్డి మృతి వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో తీవ్ర విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పర్యటనలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, ఈ ఉదయం జగన్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఏటుకూరు బైపాస్ వద్ద సింగయ్య అనే వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింగయ్యను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఘటనలో, సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద జగన్ రాక సందర్భంగా ఏర్పడిన జనసందోహం, తోపులాటలో వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి (ఆటోమొబైల్ షాపు నిర్వాహకుడు) ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.