Jump to content

Evaru qualify avutharu eb1@ ki..! Read this..!


Recommended Posts

Posted

read this atleast to understand who will qualify, and don’t fall in the trap of profile building companies like EB1A experts or Smart green card..! Lucky ga apply cheysi deny avuthae okay, porpatuna vachindho AI algorithms tho fraud detection and Noid..
 

Visakhapatnam: విశాఖ వాసికి అరుదైన ఈబీ-1 గ్రీన్‌కార్డు

విమానాల తయారీ, భారీ వంతెనల నిర్మాణం, గ్యాస్‌ పైపు లైన్లలో వెల్డింగ్‌ పాత్ర చాలా కీలకం. ఎక్కువ చేసినా, తక్కువ చేసినా నాణ్యత దెబ్బతిని ప్రమాదాలకు దారి తీస్తుంది. ఎంత సమయం చేస్తే పటిష్ఠంగా మారుతుందనే లెక్క కీలకం.

visakhapatnam-logo.webp

విశాఖ వాసికి అరుదైన ఈబీ-1 గ్రీన్‌కార్డు

ఈనాడు, విశాఖపట్నం : విమానాల తయారీ, భారీ వంతెనల నిర్మాణం, గ్యాస్‌ పైపు లైన్లలో వెల్డింగ్‌ పాత్ర చాలా కీలకం. ఎక్కువ చేసినా, తక్కువ చేసినా నాణ్యత దెబ్బతిని ప్రమాదాలకు దారి తీస్తుంది. ఎంత సమయం చేస్తే పటిష్ఠంగా మారుతుందనే లెక్క కీలకం. విశాఖకు చెందిన వెంకట చరణ్‌ ఫ్రిక్షన్‌ వెల్డింగ్‌పై చేసిన పరిశోధన అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చింది. దాన్ని 25 దేశాలు గుర్తించాయి. ఈ రంగంలో చేస్తున్న కృషికి మెచ్చిన అమెరికా ప్రభుత్వం అరుదైన గుర్తింపు ఇచ్చింది. ఏదైనా రంగంలో అసాధారణ ప్రతిభ చూపిన వారికి ఇచ్చే ఈబీ-1 గ్రీన్‌కార్డు అందజేసింది. వెంకట చరణ్‌ గీతంలో బీఈ చదివారు. ప్రస్తుతం అమెరికాలోని ఓ ప్రముఖ ఎలక్ట్రిక్‌ సంస్థలో సీనియర్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్వాలిటీ హోదాలో పనిచేస్తున్నారు.

ఇక్కడి విద్యార్థుల కోసం

ఉన్నత చదువులు, ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లే యువత అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. ఎలా వెళ్లాలి, ఎక్కడ చదవాలి, అందుకు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతారు. అటువంటి వారికి సహకారం అందించేందుకు వెంకట చరణ్‌ ‘అచీవర్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌’ అనే సంస్థను స్థాపించి సేవలందిస్తున్నారు. తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదని తగిన సలహాలు ఇస్తూ కొత్తవారికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు.

ఎన్నో రకాల వడపోతల తరువాత..

ఈబీ-1 గ్రీన్‌కార్డు సాధారణంగా ఆస్కార్, ఒలింపిక్స్‌ పతకాలు, నోబెల్‌ బహుమతులు సాధించిన స్థానికేతరులకు అమెరికా ఇస్తుంది. అలాగే ఆయా రంగాల్లో అత్యున్నత ప్రతిభచూపించిన వారికి అందజేస్తుంది. వెంకట చరణ్‌ దీనికి దరఖాస్తు చేసుకోగా వందల మంది నుంచి పోటీ ఎదుర్కొన్నారు. అనేక రకాల వడపోతల తర్వాత ఆయన్ని పరిగణనలోకి తీసుకున్నారు. అంతర్జాతీయంగా ఆ రంగంలో ఉన్న పేరు, ప్రచురితమైన పరిశోధన పత్రాలు పరిశీలించారు. ఈయన రాసిన కొన్ని పరిశోధన అంశాలను 25 దేశాల పరిశోధకులు 400సార్లు ప్రస్తావించారు. అలాగే ఫ్రిక్షన్‌ వెల్డింగ్‌పై  చేసిన శోధన సరికొత్త రీతిలో సాగడంతో అదీ కలిసొచ్చింది.

అంతర్జాతీయ నిపుణుడిగా

తయారీరంగంలో నాణ్యత నియంత్రణలో అంతర్జాతీయ నిపుణుడిగా చరణ్‌ ఎదిగారు. 15 ఏళ్ల కిందట అమెరికా వెళ్లి ఒక్కో మెట్టు ఎక్కారు. ఉత్పత్తుల నాణ్యత గుర్తించి ధ్రువీకరణ అందించే స్థితికి చేరుకున్నారు. 20కిపైగా అంతర్జాతీయ జర్నల్స్‌లో ఆయన పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. కొందరు రచయితలతో కలిసి అయిదు పాఠ్య పుస్తకాల్లో కొన్ని అధ్యాయాలు రాశారు. కొన్ని అంతర్జాతీయ ప్రచురణలకు సమీక్షకుడిగానూ వ్యవహరిస్తున్నారు. కొన్నేళ్లుగా అమెరికా సొసైటీ ఫర్‌ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) సభ్యుడిగా కొనసాగుతున్నారు. అనేక సంస్థలకు గౌరవ హోదాల్లో పనిచేస్తున్నారు. 85 దేశాలకు చెందిన ఇంజినీర్లున్న మెంబర్‌ ఆఫ్‌ సొసైటీ ఫర్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఇంజినీర్స్‌ సభ్యుడిగా ఉన్నారు. రెండేళ్ల కిందట ఆ సంస్థ నుంచి అత్యంత ప్రతిభకలిగిన ఉత్తమ యువ ఇంజినీర్‌ అవార్డు సాధించారు.

Posted
8 hours ago, Thokkalee said:

@Spartan ni gurunchi kuda Eenadu and other newspapers lo ravali 😉

😀

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...