psycopk Posted June 29 Author Report Posted June 29 YS Jagan: విద్యావ్యవస్థ అస్తవ్యస్తం... ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ: జగన్ 29-06-2025 Sun 18:16 | Andhra ఈసెట్ కౌన్సెలింగ్లో తీవ్ర జాప్యం అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడిన జగన్ ఫలితాలొచ్చి 45 రోజులైనా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదని విమర్శ "అమాత్యా మేలుకో, పప్పూ నిద్ర వదులు" అంటూ ఘాటు వ్యాఖ్యలు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, అందుకు ఏపీ ఈసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర జాప్యమే నిదర్శనమని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫలితాలు వెలువడి నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంతవరకు కౌన్సెలింగ్ ప్రారంభించకపోవడం ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ఠ అని విమర్శించారు. ఈసెట్ ఫలితాలు గత నెల మే 15వ తేదీన వెలువడినా, నేటికీ అడ్మిషన్ల ప్రక్రియపై ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా అస్తవ్యస్తంగా మారిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని ఆయన అన్నారు. రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానుండగా, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన "అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 34 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షకు హాజరుకాగా, వారిలో 31,922 మంది అర్హత సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని జగన్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసి, అడ్మిషన్ల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 1 Quote
psycopk Posted June 29 Author Report Posted June 29 Neku enduku ra politics pichi battai ani sweet ga chepadu Nara Lokesh: జగన్ గారూ... మీ ఏడుపులే మాకు దీవెనలు: మంత్రి నారా లోకేశ్ కౌంటర్ 29-06-2025 Sun 19:26 | Andhra విద్యా వ్యవస్థపై జగన్ విమర్శలకు మంత్రి లోకేశ్ రిప్లయ్ విద్యా వ్యవస్థను ఐదేళ్లుగా భ్రష్టుపట్టించింది మీరేనని ఆరోపణ తాను విద్యావ్యవస్థను చక్కదిద్దానని వెల్లడి మీకు కడుపమంట రావడం సహజమేనని సెటైర్ ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన విమర్శలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. "జగన్ గారూ.. మీ ఏడుపులే మాకు దీవెనలు" అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. తాము చేపడుతున్న సంస్కరణలు చూసి ఓర్వలేకే జగన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది... అందుకు ఏపీఈసెట్ అడ్మిషన్లే నిదర్శనం అని జగన్ చేసిన విమర్శలకు లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. "మీరు ఐదేళ్లు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారు. నేను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి మీకు కడుపుమంట రావడం సహజం. మీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా మీకు స్పృహ లేదు. కోవిడ్ తరువాత 2022 సెప్టెంబర్లో, 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన మీరు మమ్మల్ని విమర్శించటం మీ అజ్ఞానానికి నిదర్శనం. మేము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేశాం. ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్ని జూలై మూడో వారానికి పూర్తి చేస్తాం" అని లోకేశ్ వివరించారు. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.