BattalaSathi Posted July 5 Report Posted July 5 sampi para 10ngi .. okka debbake pothadanukole saar ani bhorumani edupanta..maha pathivratha... @FrustratedVuncle edho guttugaa kaapuram chesuko anna kottina kosina bharinchu lekapothe eee violent ideas vasthe modatike mosam vasthadhi..jagratha! eenadu.net ఒక్క దెబ్బకే చచ్చిపోతాడనుకోలేదు సార్.. Eenadu ~3 minutes రాగిసంగటి కర్రతో కొట్టి చంపిన భార్య బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ‘ఆయన అలా.. ఒక్క దెబ్బకే నేలకొరుగుతారని నేను అనుకోలేదు’ అంటూ ఆ భార్య కన్నీరు మున్నీరవుతుంటే పోలీసులే విస్తుపోయారు. భర్త చేష్టలను సహించలేక రాగి సంగటి తయారీకి ఉపయోగించే కర్రతో ఆయన తలపై ఒక్కటిచ్చింది. ఆపై.. ఆయన కదల్లేకపోయారని పోలీసులు వివరించారు. ఈ సంఘటన రాజధాని నగరంలోని బనశంకరి మార్గంలోని సుద్దుగుంటెపాళ్య పోలీసుఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుద్దగుంటెపాళ్య నివాసి భాస్కర్ (42) జూన్ 27న రాత్రి అనుమానాస్పద రీతిలో మరణించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి మరణోత్తర పరీక్షలు నిర్వహించాక.. ఆయనను ఎవరో బలంగా కొట్టి చంపారని వైద్యులు గుర్తించడంతో పోలీసులు రంగంలోకి దిగి చివరికి ఆయన భార్య శృతి(36)ని శుక్రవారం అరెస్టు చేశారు. వారిద్దరికీ పుష్కర కాలం కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలూ ఉన్నారు. ఆ ప్రాంతంలో భాస్కర్‌కు ఆరు నివాస గృహాలుండటంతో వాటి అద్దె వసూలు చేసుకుని జీవిక సాగించేవాడు. ఎలాంటి ఉపాధి పనులకూ వెళ్లేవాడు కాదట. అలవోకగా వస్తున్న డబ్బు, పనీపాటలేని ఆయన మద్యంతో జల్సా చేస్తూ, ఇతర మహిళలతో సన్నిహితంగా ఉంటూ విలాస జీవితానికి అలవాటు పడినట్లు గుర్తించారు. ఇవన్నీ శృతికి నచ్చేవి కాదు. ఇక ఇంటికి వస్తే నిత్యం బిడ్డలతో పాటు తననూ చితకబాదే వాడని ఆమె వాపోయింది. ‘నన్ను విచ,క్షణా రహితంగా కొట్టేవాడు. ఆయన ఇంటికి వస్తున్నాడంటే నిత్యం వణుకే. జూన్ 27న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి..మద్యం మత్తులో గొడవపడి కొట్టడటం ప్రారంభించాడు. కోపంపట్టలేక వంటగదిలోకి వెళ్లి రాగిముద్ద చేసే కర్ర పట్టుకొచ్చి ఆయన తలపై బలంగా ఒక్కటిచ్చా. ఆ దెబ్బకు ఆయన కిందపడి.. మళ్లీ లేవనేలేదు. తల నుంచి కారిన రక్తాన్ని తుడిచి, స్నానం చేయించి, పడక గదిలో పడుకోబెట్టా’ అంటూ పోలీసులకు జరిగిన సంఘటనను వివరించింది. 28న ఉదయం లేచిన వెంటనే ఆమె తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ‘నా భర్త పడకగదిలో కదలకుండా పడిపోయారు. ఆయనకు ఏదో జరిగింది’ అంటూ వీధిలో కేకలు పెడుతూ కన్నీరుమున్నీరైంది. చుట్టుపక్కల వారు వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. హత్యకు ఉపయోగించిన రాగిముద్ద కర్రను స్వాధీనం చేసుకున్నారు. ‘రోజూ తాగడమే. విపరీతంగా కొట్టేవాడు. చూస్తే భయం వేసేది. మా ఇంటి పక్కనే ఓ భవనంలో రోజూ ఎవరెవరో ఆడవారితో పడకసుఖం.. ఇవన్నీ చూడలేకపోయాను. ఆయన కొడుతుంటే నేనూ తిరిగి కొట్టాలని ఆపనిచేశా. ఒక్కదెబ్బకే ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆయనను చంపాలని అనుకోలేదు..’ అంటూ ఆమె కన్నీరు కార్చిందని పోలీసులు వివరించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.